• HOME
  • »
  • NEWS
  • »
  • TRENDING
  • »
  • VIRAL NEWS A WOMAN ORGANISED FAKE FUNERAL FOR HER CHEATING EX LOVER AND HERE FULL STORY SRD

Viral News : దెబ్బకి దెబ్బ..మోసం చేసిన ప్రియుడికి ఊహించని షాకిచ్చిన గర్ల్ ఫ్రెండ్..ఇదో వెరైటీ పగ..

Viral News : దెబ్బకి దెబ్బ..మోసం చేసిన ప్రియుడికి ఊహించని షాకిచ్చిన గర్ల్ ఫ్రెండ్..ఇదో వెరైటీ పగ..

Photo Credit : Face Book

Viral News : మనం ఊహించనిది జరగడాన్నే జీవితం అంటారు. కొందరికి సరైన వయసులోనే నిజమైన ప్రేమ లభిస్తుంది. కానీ, ఆ ప్రేమను నిలబెట్టుకోవడం కష్టమే. సాధారణంగా ప్రేమించిన అమ్మాయిలు మోసం చేస్తే..అబ్బాయిలు అస్సలు ఊరుకోరు. అలానే, అప్పుడప్పుడూ అమ్మాయిలు కూడా అబ్బాయిలకి ఝలక్ ఇస్తుంటారు.

  • Share this:
    మానవ సంబంధాలు ఎప్పుడు ఎలా మారతాయో తెలియకుండానే కొంతమంది జీవితాలు కోనసాగుతాయి.ఊహించని ఘటనలతో కొంతమంది జీవితాలు వెలుగులు నింపుతాయి. జీవితంలో అంటేనే ఎన్నో ఊహించని మలుపులు. మనం ఊహించనిది జరగడాన్నే జీవితం అంటారు. కొందరికి సరైన వయసులోనే నిజమైన ప్రేమ లభిస్తుంది. కానీ, ఆ ప్రేమను నిలబెట్టుకోవడం కష్టమే. సాధారణంగా ప్రేమించిన అమ్మాయిలు మోసం చేస్తే..అబ్బాయిలు అస్సలు ఊరుకోరు. తన మాజీ ప్రియురాలి గురించి అడ్డమైన చెత్తంతా ప్రచారం చేసి.. వారి పరువు తీసి సంతోషిస్తారు కొందరు. మరి కొందరు ఏకంగా ప్రియురాలి ప్రాణాలు కూడా తీయడానికి వెనకాడరు. అదే అమ్మాయి ప్రియుడి చేతిలో మోసపోతే.. ఎవరికి చెప్పుకోలేదు. తనలో తానే బాధపడుతుంది. ఏం చేయలేక మౌనంగా రోదిస్తుంది. అయితే అందరు అమ్మాయిలు ఇలానే ఉండరు. కొందరు తమను మోసం చేసిన వాడికి చుక్కలు చూపిస్తారు. మరికొందరు సరియైన రీతిలో బుద్ధి చెప్తారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది కూడా ఇలాంటి అమ్మాయి గురించే. మోసం చేసిన ప్రియుడికి ఓ మహిళ ఊహించని విధంగా షాక్‌ ఇచ్చింది. అతడిని జైలుకు పంపడంతోనే ఆగిపోలేదు. ఏకంగా అతడు చనిపోయినట్లు ప్రచారం చేసి.. అంత్యక్రియలు కూడా నిర్వహించింది. సదరు మహిళ చేసిన పనికి నెటిజనులు అభినందిస్తున్నారు. ఆ వివరాలు.. థేయా లోవరిడ్జ్ అనే మహిళ, ఓ వ్యక్తిని మూడేళ్లుగా ప్రేమిస్తుంది. వివాహం కానప్పటికి ఇద్దరు కలిసే ఉంటున్నారు. మొదట బాగానే ఉన్న థేయా బాయ్‌ఫ్రెండ్‌ ఆమె గర్భవతిగా ఉన్నప్పుడు మరో మహిళను ప్రేమించాడు. దీని గురించి థేయాకు తెలియకుండా.. కొత్త ప్రియురాలితో కలిసి ఏంజాయ్‌ చేయసాగాడు.

    అయితే తన బాయ్‌ఫ్రెండ్‌ తనను మోసం చేసి.. వేరే యువతితో తిరుగుతున్నాడని.. థేయాకు తెలిసింది. ఈ మోసాన్ని తట్టుకోలేకపోయింది. తనని మోసం చేసినందుకు ప్రియుడిపై ప్రతీకారం తీర్చుకోవాలని భావించింది. ఓ మంచి ప్లాన్‌ సిద్ధం చేసుకుంది. తన ప్రియుడి చెల్లెలని కలిసి తనకు జరిగిన అన్యాయం గురించి చెప్పి సాయం చేయాల్సిందిగా కోరింది. అందుకు ఆ యువతి కూడా అంగీకరించింది. ఈ క్రమంలో థేయా మొదట తన ప్రియుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసి అతడిని జైలుకు పంపింది.

    ఇక ఈ విషయాలు ఏవి తెలియని థేయా మాజీ ప్రియుడి కొత్త లవర్‌, అతడి మొబైల్‌కు అనేక సార్లు కాల్‌ చేసింది.. మెసేజ్‌లు పంపింది. కానీ ఎలాంటి రిప్లై రాలేదు. కొద్ది రోజుల పాటు ఆమెను ఇలా కంగారు పెట్టిన థేయా ఓ రోజు బాంబ్‌ పేల్చింది. "మీ బాయ్‌ఫ్రెండ్‌ చనిపోయాడు. ఈ రోజు అతడికి అంత్యక్రియలు నిర్వహిస్తున్నాం" అని మాజీ ప్రియుడి కొత్త లవర్‌కి మెసేజ్‌ చేసింది. ఆమెను నమ్మించడం కోసం ఉత్తుత్తి అంత్యక్రియలు నిర్వహించింది థేయా. ఈ సంఘటన జరిగి ఇప్పటికి మూడు ఏళ్లు అవుతుంది. తన మాజీ ప్రియుడి కొత్త లవర్‌కి అతడు జైలులో ఉన్నట్లు ఇప్పటికి తెలియదు. ఆమె ఇంకా అతడు చనిపోయాడనే భావిస్తుంది. ప్రతి ఏటా అతడి సమాధి వద్దకు వెళ్లి నివాళులర్పిస్తుందని తెలిపింది థేయా. తనను మోసి చేసినందుకు అతడికి ఇలా జరగాల్సిందే అంటుంది.

    ఇక ఫేస్‌బుక్‌లో షేర్‌ చేసిన ఈ స్టోరీ ప్రస్తుతం తెగ వైరలవుతోంది. ఇది చదివిన నెటిజనులు థేయాను అభినందిస్తున్నారు. మోసం చేసిన వాడిని ఊరికే వదిలిపెట్టకుండా తగిన బుద్ది చెప్పారు. మీరు చాలా మంది ఆడవారికి ఆదర్శం అని కామెంట్‌ చేస్తున్నారు. ఇలాంటి వాళ్లకి ఇలానే బుద్ది చెప్పాలంటూ కామెంట్‌ చేస్తున్నారు.
    Published by:Sridhar Reddy
    First published: