Viral News: సోషల్‌మీడియాలో పాపులర్ అయ్యేందుకు పాముతో చెలగాటం.. చివరికి ఏం జరిగిందంటే..

ప్రతీకాత్మక చిత్రం

Viral News: సంజయ్ నగర్‌కి చెందిన ముంబ్రా టౌన్ షిప్ ప్రాంతంలో ఓ పాము తిరుగుతోంది. దాన్ని పట్టుకున్నాడు మొహమ్మద్ షేక్ అనే 28 ఏళ్ల యువకుడు. దాన్ని అలాగే జన సందోహం లేని ప్రదేశంలో వదిలేస్తే సరిపోయేది. కానీ ఆ పాముతో ఆడుకోవడం ప్రారంభించాడు.

  • Share this:
చాలామంది అడవి జంతువులు, ప్రమాదకరమైన పాములను తేలికగా తీసుకుంటారు. వాటితో ఆడుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. ఫోటోలు తీసుకుంటూ వైరల్‌గా మారాలనుకుంటారు. అయితే వీటితో అజాగ్రత్తగా వ్యవహరిస్తే.. ప్రాణాలు పోవడం ఖాయమని ఆ తరువాతే తెలిసివస్తుంది. అలాంటి సంఘటనే మహారాష్ట్రలోని థానే జిల్లాలో జరిగింది. విషపూరితమైన పామును మెడలో వేసుకొని హల్‌చల్‌ చేసిన వ్యక్తి.. చివరికి అదే పాము కాటుతో కన్నుమూశాడు.వివరాల్లోకి వెళ్తే.. సంజయ్ నగర్‌కి చెందిన ముంబ్రా టౌన్ షిప్ ప్రాంతంలో ఓ పాము తిరుగుతోంది. దాన్ని పట్టుకున్నాడు మొహమ్మద్ షేక్ అనే 28 ఏళ్ల యువకుడు. దాన్ని అలాగే జన సందోహం లేని ప్రదేశంలో వదిలేస్తే సరిపోయేది. కానీ ఆ పాముతో ఆడుకోవడం ప్రారంభించాడు. ఆ పామును మెడలో వేసుకొని మెడ చుట్టూ తిప్పి ఆటలు ఆడాడు. అతడి స్నేహితులు వీడియో తీస్తుంటే.. హీరోలా పోజులు ఇవ్వడానికి ప్రయత్నించాడు. అయితే అప్పటికే భయపడిన పాము, తనను తాను రక్షించుకోవడానికి మొహమ్మద్‌ను కాటు వేసింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ వీడియో తీస్తున్నప్పుడే మొహమ్మద్‌ను పాము మూడు సార్లు కరిచిందట. ఆ విషయాన్ని బాధితుడు స్నేహితులు గమనించకపోవడం గమనార్హం. కాసేపయ్యాక ఏదోలా అవుతుండడంతో స్థానిక సివిక్ హాస్పిటల్ కి వెళ్లాడు. అక్కడికి వెళ్లే లోపే అతడు మరణించాడు. ముంబ్రా పోలీసులు ఈ ఘటనను యాక్సిడెంటల్ డెత్ గా నమోదు చేసి దేహాన్ని థానే ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు. సోషల్ మీడియాలో లైకులు, కామెంట్ల కోసం ఇలా పాములతో ఆటలు ఆడవద్దని ప్రతి ఒక్కరినీ కోరుతున్నారు థానే పోలీసులు.

అచ్చం ఇలాంటి సంఘటనే ఆస్ట్రియాలో జరిగింది. ఇసుక దగ్గరలో నిలబడిన ఓ వ్యక్తిని ఓ కొండ చిలువ అమాంతం చుట్టేసింది. ఈ క్రమంలో అతడి మర్మాంగాల వద్ద పళ్లు గుచ్చుకోవడంతో అతడు బాధతో విలవిలలాడిపోయాడు. కొండ చిలువ చుట్టేయగానే ఈ 65 సంవత్సరాల వ్యక్తిని విడిపించి వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్లారు పక్కనున్న వ్యక్తులు. అక్కడ పరీక్షించగా కొండ చిలువ పళ్లతో మర్మాంగాల భాగంలో గుచ్చినట్లుగా గుర్తించారు. అది విషపూరితం కాకపోవడంతో అతడి ప్రాణాలకు ఎలాంటి హాని జరగలేదు. కానీ చాలా లోతుగా దిగడంతో అతడు నొప్పితో బాధపడుతున్నాడు. ఇన్ఫెక్షన్ రాకుండా తగిన చర్యలు తీసుకున్నామని వైద్యులు వెల్లడించారు.
Published by:Sridhar Reddy
First published: