• HOME
  • »
  • NEWS
  • »
  • TRENDING
  • »
  • VIRAL NEWS 2 MILLION DOLLAR BABY TEERAKAMAT RECEIVED HER RUPEES 16 CRORE ZOLGENSMA INJECTION FINALLY NK

Viral Video: ఆ ఇంజెక్షన్ ధర రూ.16 కోట్లు... ఆ చిన్నారి కోసం ప్రపంచం సాయం

Viral Video: ఆ ఇంజెక్షన్ ధర రూ.16 కోట్లు... ఆ చిన్నారి కోసం ప్రపంచం సాయం

ఆ ఇంజెక్షన్ ధర రూ.16 కోట్లు... ఆ చిన్నారి కోసం ప్రపంచం సాయం (image credit - twitter)

Viral Video: లక్షల కొద్దీ డొనేషన్లు... కోట్ల కొద్దీ ఆశీర్వాదాలు... లక్షల కోట్ల ప్రార్థనలు ఫలించాయి. ఆ చిన్నారి కోలుకుంటోంది. హృదయాన్ని కదిలించే ఆ కథేంటో తెలుసుకుందాం.

  • Share this:
    Viral Video: ఒక్క చిన్నారి కోసం ప్రపంచం కదిలింది. ఎవరికి వారు తమవంతుగా సాయం చేశారు. అలా చేస్తేగానీ ఆ చిన్నారి బతికే అవకాశం లేదు. అసలు ఒక్క ఇంజెక్షన్ ఖరీదు రూ.16 కోట్లు ఉండటం చిత్రంగా లేదు. 6 నెలల చిన్నారి తీరా కామత్‌కి అరుదైన వెన్నెముక కండరాల వ్యాధి సోకింది. అది తగ్గాలంటే... ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన జోల్‌జెన్‌స్మా (zolgensma) ఇంజెక్షన్ ఇవ్వాలి. దాని రేటు రూ.16 కోట్లు. పాప తల్లిదండ్రులు సంపన్నలేమీ కాదు. ఎలాగైనా పాపను బతికించుకోవాలని... క్రైడ్ ఫండింగ్ ద్వారా సాయం చేయాల్సిందిగా కోరారు. ఇందుకోసం సోషల్ మీడియాలో తీరా ఫైట్స్ ఎస్ఎంఏ (Teera Fights SMA) పేరుతో అకౌంట్లు తెరిచారు. అవి చూసి ప్రపంచం కదిలివచ్చింది. నలుమూలల నుంచి డొనేషన్లు వచ్చాయి. చివరకు రూ.16 కోట్లు పోగయ్యాయి. దాంతో ఇంజెక్షన్ ఇచ్చిన ముంబై హిందుజా హాస్పిటల్ డాక్టర్లు... చిన్నారిని అబ్జర్వేషన్‌లో ఉంచారు.

    ఇంజెక్షన్ వేసిన సందర్భంగా చిన్నారి తల్లిదండ్రులు తమకు సాయం చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. ఇది సాధ్యమైందంటే అది మీ వల్లే అని అన్నారు. ఫిబ్రవరి 26 ఉదయం పాపకు ఇంజెక్షన్ ఇచ్చినట్లు ట్విట్టర్ ద్వారా తెలిపారు.


    ఇప్పటికీ సస్పెన్సే:
    ఇంజెక్షన్ ఇచ్చారు గానీ... కచ్చితంగా వ్యాధి నయం అవుతుందని డాక్టర్లు గ్యారెంటీ ఇవ్వట్లేదు. తగ్గే అవకాశాలు ఉంటాయనే చెబుతున్నారు. ఇక్కడ మరో గొప్ప విషయం మన కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చింది. ఆ ఇంజక్షన్‌ను విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నారు. ఈ విషయం కేంద్రానికి తెలిసింది. తీరా కామత్ తల్లిదండ్రుల విజ్ఞప్తితో ఇంజెక్షన్‌పై GST, ఇంపోర్ట్ డ్యూటీ రూ.6.5 కోట్లను మాఫీ చేశారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.


    ఇది కూడా చదవండి: World Record Marriages: ఒకే రోజు 3229 పెళ్లిళ్లు... ప్రపంచ రికార్డు

    అసలేంటి సమస్య:
    ఇదో అరుదైన సమస్య. జన్యుపరమైన స్పైనల్ మస్క్యులర్ అట్రోఫి వ్యాధితో బాధ పడుతోంది 6 నెలల తీరా కామత్. పాపను బతికించుకోవాలంటే జీనీ థెరపీ చేయాలి. మన దేశంలో ఈ ట్రీట్‌మెంట్ లేదు. అందుకే... అమెరికా నుంచి రూ.16 కోట్ల విలువైన జోల్‌జెన్‌స్మా ఇంజక్షన్ తెప్పిస్తే తగ్గే అవకాశం ఉంటుందని డాక్టర్లు చెప్పారు. ఇక ఆ చిన్నారి కోలుకోవాలని అంతా ప్రార్థిస్తున్నారు.
    Published by:Krishna Kumar N
    First published:

    అగ్ర కథనాలు