• Home
  • »
  • News
  • »
  • trending
  • »
  • VIRAL MATHEMATICS PROBLEM LEAVES INTERNET DIVIDED OVER THE SAME ANSWER CAN YOU SOLVE IT MK GH

Math's Problems: 0.25కి భిన్న‌రూపం ఏంటి? కంప్యూట‌ర్ ఇచ్చిన సమాధానంపై వైరల్ అవుతున్న కామెంట్లు

(ప్రతీకాత్మక చిత్రం)

ఒక లెక్కకు కంప్యూట‌ర్ ఇచ్చిన ఓ స‌మాధానం నెటిజ‌న్లు త‌మ బుర్ర గోక్కునేలా చేస్తోంది. ఇంత‌కీ విష‌యం ఏంటంటే..

  • Share this:
చిన్నప్పటి నుంచి కొందరు లెక్కలు, గణితం అంటే ఎంతో భయపడతారు. అందులోనూ ఆల్‌జీబ్రా అంటే ఇంకా ఆందోళన చెందుతారు. పెద్దయ్యాక ఈ సమస్యల జోలికి పోకుండా కంప్యూటర్, క్యాలిక్యులేటర్లను వాడతారు. సాధారణంగా లెక్క‌ల విష‌యంలో మ‌న‌మంద‌రం కంప్యూట‌ర్‌ను మాన‌వ మేథ‌స్సు క‌న్నా ఎక్కువైన‌దిగా భావిస్తుంటాం. కానీ ఒక లెక్కకు కంప్యూట‌ర్ ఇచ్చిన ఓ స‌మాధానం మాత్రం నెటిజ‌న్లు త‌మ బుర్ర గోక్కునేలా చేస్తోంది. ఇంత‌కీ విష‌యం ఏంటంటే.. ఆన్‌లైన్‌లో మాథ్స్ ప‌జిల్స్ ప‌రీక్ష తీసుకున్న ఓ వ్య‌క్తి, Y విలువను 0.25X అని పేర్కొన్నారు. కానీ కంప్యూటర్ మాత్రం దీన్ని 1/4Xగా లెక్కించింది. నిజానికి ఈ రెండూ స‌రైన స‌మాధానాలే కానీ.. కంప్యూటర్ ఒక్క ఆన్సర్‌నే ఎందుకు గుర్తించిందనే విషయంపై అంద‌రూ త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు.

పావుభాగాన్ని భిన్న‌రూపంలో సూచించాల్సి వ‌చ్చిన‌ప్పుడు స‌హజంగా అంద‌రూ 1/4 గా రాస్తారు. దీనికి మ‌రో రూపం 0.25గానూ చాలామంది పేర్కొంటూ ఉంటారు. మ‌రి కంప్యూట‌ర్ ఎందుకు ఈ స‌మాధానాన్ని త‌ప్పు అని చెపుతోంది? స్కూల్స్‌లో భిన్నాలు నేర్చుకునేట‌పుడు.. 1/4 అనేది 0.25కి సమానమని తెలుసుకున్నాం. అయినప్పటికీ, Y విలువను 0.25X వద్ద లెక్క‌క‌ట్ట‌గా, కంప్యూటర్ 1/4Xగా మాత్రమే లెక్కించింది. కంప్యూట‌ర్ 0.25X ను త‌ప్పుగా గుర్తించడంపై నెటిజ‌న్లు స్పందించారు. దీనిపై వ‌ర‌ద‌లా వ‌చ్చిప‌డిన కామెంట్లతో ట్విట్ట‌ర్ నిండిపోయింది.

దీనిపై స్పందిస్తూ.. 0.25 X స‌రైన స‌మాధాన‌మ‌ని, నిజానికి రెండూ స‌రైన‌వ‌నే ఒక‌ యూజర్ కామెంట్ పెట్టారు. ఇది ఒకే స‌మాధానాన్ని రెండు ప‌ద్ధ‌తుల‌లో రాయ‌డ‌మ‌ని మ‌రొక‌రు స్పందించ‌గా, ఇలాంటి గంద‌ర‌గోళాలు ఉంటాయి కాబ‌ట్టే నాకు మాథ్స్‌ల్యాబ్ అంటేనే చిరాకని మరో నెటిజ‌న్ ఫన్నీ కామెంట్ రాశారు. అయితే కొంద‌రు మాత్రం 0.25X స‌మాధానం త‌ప్పు అని పేర్కొన్నారు. ఇందులో క‌చ్చిత‌త్త్వం లేద‌ని భిన్న‌రూపంలో స‌మాధానం రాయ‌డ‌మే స‌రైన‌ద‌ని పేర్కొన్నారు. ఎందుకంటే 0.25ను 0.250 నుంచి 0.255 మధ్య ఉండే విలువగా అర్థం చేసుకోవ‌డానికి ఆస్కార‌ముంది. అందుకే 1/4 స‌రైన స‌మాధానమ‌ని కొంద‌రు నిపుణులు పేర్కొన్నారు.
Published by:Krishna Adithya
First published: