• HOME
  • »
  • NEWS
  • »
  • TRENDING
  • »
  • VILLAGERS TRIED TO RESURRECT A DEAD MAN BUT IN VAIN AND THE INCIDENT WAS REPORTED FROM NAYAGARH DISTRICT ODISHA SSR

Odisha: పోస్ట్‌మార్టం పూర్తయిన వ్యక్తి మృతదేహానికి ప్రాణం పోసేందుకు ప్రయత్నం.. చివరకు ఏమైందంటే...

Odisha: పోస్ట్‌మార్టం పూర్తయిన వ్యక్తి మృతదేహానికి ప్రాణం పోసేందుకు ప్రయత్నం.. చివరకు ఏమైందంటే...

రబీ మృతదేహంతో గ్రామస్తులు

నయగర్ జిల్లా సరంకుల్ తాలూకాలోని బరసహి గ్రామంలో ఓ మతపరమైన ఉత్సవం జరుగుతోంది. ఆ ఉత్సవంలో కొందరు వ్యక్తులు ఆడిపాడుతున్నారు. అలా ఆ ఉత్సవంలో నృత్య ప్రదర్శన ఇస్తున్న రబీ అనే వ్యక్తి ఉన్నట్టుండి స్పృహ తప్పిపడిపోయాడు. దీంతో.. అతనిని నయగర్‌లోని జిల్లా ఆసుపత్రికి...

  • Share this:
    నయగర్: శాస్త్రసాంకేతిక రంగాల్లో ప్రపంచం పరుగులు పెడుతోంది. అయినా కొన్ని చోట్ల ప్రజలకు మూఢనమ్మకాల మత్తు వదలడం లేదు. ఎన్నో విజయాలు సాధించిన మనిషికి ఇప్పటికీ మరణాన్ని జయించడం అనేది అంతుచిక్కని ప్రశ్నగానే మిగిలిపోయింది. చనిపోయిన వ్యక్తి బతికి రావడం అనేది జరగదు. సైన్స్‌పరంగా కూడా చనిపోయిన వ్యక్తి తిరిగి బతికే అవకాశాలు ప్రస్తుతానికైతే లేవు. కానీ.. ఒడిశాలోని ఓ గ్రామంలో మాత్రం చనిపోయిన వ్యక్తిని బతికించేందుకు ఆ గ్రామస్తులు విశ్వ ప్రయత్నాలు చేశారు. పోస్ట్‌మార్టం పూర్తయిన మృతదేహాన్ని ఎదురుగా పెట్టుకుని అతనిని బతికిస్తామంటూ నానా హడావుడి చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. నయగర్ జిల్లా సరంకుల్ తాలూకాలోని బరసహి గ్రామంలో ఓ మతపరమైన ఉత్సవం జరుగుతోంది. ఆ ఉత్సవంలో కొందరు వ్యక్తులు ఆడిపాడుతున్నారు. అలా ఆ ఉత్సవంలో నృత్య ప్రదర్శన ఇస్తున్న రబీ అనే వ్యక్తి ఉన్నట్టుండి స్పృహ తప్పిపడిపోయాడు. దీంతో.. అతనిని నయగర్‌లోని జిల్లా ఆసుపత్రికి తరలించారు. అయితే.. అతనిని పరీక్షించిన వైద్యులు అప్పటికే రబీ చనిపోయినట్లు చెప్పారు. సరంకుల్ పోలీసులు ఆ మృతదేహానికి పోస్ట్‌మార్టం పూర్తి చేయించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఇంటికి మృతదేహాన్ని తీసుకెళ్లిన తర్వాత అంత్యక్రియలు చేయకుండా ఆ వ్యక్తిని బతికించేందుకు గ్రామస్తులు కొన్ని పూజలు, ప్రార్థనలు చేయడం కొసమెరుపు. అందుకు సంబంధించిన వీడియో నెట్‌లో వైరల్‌‌గా మారింది.

    రాత్రంతా మృతదేహాన్ని ముందు పెట్టుకుని వాళ్ల ఆచారాల ప్రకారం కొన్ని పూజలు చేశారు. ఆ తాంత్రిక పూజల్లో భాగంగా.. ఆ మృతదేహంపై బిందెల కొద్దీ నీళ్లు పోశారు. ఏవేవో మంత్రాలు చదివారు. అలా చేస్తే చనిపోయిన వ్యక్తి ఆత్మను దేవుడు తిరిగి మృతదేహంలోకి పంపిస్తాడన్నది ఆ ఊరి జనం నమ్మకం. ఉదయానికి.. ఆ ఊరి జనం చేస్తున్న ఈ పూజల గురించి తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. చనిపోయిన వ్యక్తి బతికి బట్టకట్టడం జరగదని, సాధ్యం కాని పనికి యత్నించడం మాని అంత్యక్రియలు పూర్తి చేయాలని సూచించారు. అప్పటికి ఆ ఊరి జనం వాస్తవాన్ని గుర్తెరిగి రబీ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు.



    ఏదేమైనా ఈ ఊరి జనం చేసిన పని గురించి తెలిసిన చుట్టుపక్కల గ్రామస్తులు విస్తుపోయారు. ప్రజలు ఇకనైనా ఇలాంటి మూఢ నమ్మకాలను విడనాడాలని మేధావులు సూచిస్తున్నారు. ఈ ఒక్క గ్రామంలోనే కాదు మన దేశంలోని చాలా గ్రామాల్లో ఏదో ఒక మూల ఇలాంటి మూఢ నమ్మకాలతో ప్రజలు సావాసం చేస్తూనే ఉంటారు. అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా అక్కడక్కడా మూఢనమ్మకాలను బలంగా నమ్మేవాళ్లున్నారు.
    Published by:Sambasiva Reddy
    First published:

    అగ్ర కథనాలు