పెళ్లైన ఆంటిని ప్రేమించాడో యువకుడు. ఆమె భర్త వేరే చోట పని చేస్తూ ఉండటంతో ఆమె కూడా యువకుడికి దగ్గరైంది. తరచూ కలుస్తూ ఉండేవారు. ఆరు నెలలుగా వీరిద్దరి మధ్య ఈ రంకు (Extramarital affair)వ్యవహారం కొనసాగుతూ వచ్చింది. పిల్లి పాలు తాగుతూ తనను ఎవరూ చూడటం లేదనుకున్నట్లుగా వీరిద్దరు మరింత బరితెగించారు. ఎంతగా అంటే రాత్రి వేళల్లో ఆ యువకుడు డైరెక్ట్‌గా ఆమె ఇంటికి వచ్చి కలుసుకునేంతగా శృతి మించిపోయింది ఇద్దరి మధ్య రిలేషన్. రోజు ఆంటీని కలుస్తున్నట్లుగానే గురువారం(Thursday)రాత్రి కూడా ఆమె ఇంటికి వెళ్లి బుక్కయ్యాడు. మధ్యప్రదేశ్(Madhya Pradesh)రాష్ట్రం షికార్‌పూర్(Shikarpur)పోలీస్ స్టేషన్(Police Station) పరిధిలోని సుగౌలి(Sugauli)గ్రామంలో జరిగింది.
యువకుడితో ఆంటీ అఫైర్..
సుగౌలి గ్రామానికి చెందిన వివాహితురాలు సుశీలదేవి..సెమ్రాచౌక్‌లో మొబైల్ షాపు నడుపుతున్న వినోద్‌రామ్ అనే 26సంవత్సరాల యువకుడ్ని ప్రేమించింది. కుటుంబాన్ని పోషించడానికి సుశీలదేవి భర్త ముంబైలో కార్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. దాంతో సుశీలదేవి తరచూ సెల్‌ఫోన్ షాపుకి రిచార్జ్ నిమిత్తం వెళ్లడం కారణంగా వినోద్‌రామ్‌కి పరిచయమైంది. ఆ పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. భర్త దూరంగా ఉండటంతో ప్రియుడ్ని ఇంటికి పిలిపించుకొని మాట్లాడుకోవడం, కలుసుకునే వాళ్లు.
నైట్ కలుసుకున్న టైమ్‌లో బుక్కయ్యారు..
ఇలా ఇద్దరూ సీక్రెట్ లవ్ స్టోరీ నడపిస్తున్నారు. గురువారం అర్ధరాత్రి తన ప్రియురాలైన సుశీలదేవి ఇంటికి వినోద్‌రామ్ వెళ్లాడు. సరిగ్గా ఆంటీ ఇంట్లోకి ఆమె ప్రియుడు వెళ్లడం స్థానికులు గమనించారు. వెంటనే ఇంటి దగ్గరకు చేరుకొని ఇద్దర్ని బయటకు లాక్కొచ్చి పక్కనే ఉన్న కరెంట్ స్తంభానికి తాడుతో కట్టేశారు. అక్కడే ఉన్న మరికొందరు యువకులు ఇద్దర్ని రాత్రంతా కొట్టారు. తెల్లవారుజామున గ్రామస్తుల సమక్షంలో ఇద్దరికి పెళ్లి చేశారు గ్రామస్తులు. గ్రామంలో ఇంత సీన్ జరగడంతో సుశీలదేవి, వినోద్‌రామ్ ఇద్దరూ గ్రామం విడిచి వెళ్లిపోయారు.
కొట్టి ..ఇద్దరికి పెళ్లి చేసిన స్థానికులు..
సుగౌలి గ్రామంలో ఇంత జరిగిన విషయం తెలిసినప్పటికి పోలీసులు పెద్దగా జోక్యం చేసుకోలేదు. తీరా ప్రేమజంటకు దేహశుద్ధి చేస్తున్న సమయంలో ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వార్త వైరల్ అయింది. దీనిపై స్పందించిన పోలీసులు ఎవరైనా తమకు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసుకొని విచారిస్తామన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.