VILLAGERS IN CHHATTISGARH CONSIDER A CALF BORN WITH THREE EYES AND FOUR NOSTRILS TO BE A DIVINITY SNR
మూడు కళ్లు, నాలుగు ముక్కు రంధ్రాలు..అదేం జంతువు
Photo Credit: Youtube
OMG: చత్తీస్‌ఘడ్‌లో ఓ దూడ విచిత్రంగా ఉంది. శరీర అవయవ నిర్మాణంలో మార్పుతో జన్మించింది. మూడు కళ్లు, నాలుగు ముక్కు రంద్రాలు కలిగి ఉండటంతో గ్రామస్తులు దైవస్వరూపంగా భావిస్తున్నారు. దానికి కొబ్బరి కాయలు కొట్టి పూజలు చేస్తున్నారు.
ఈ కలియుగంలో కాదేది వింతలకు అతీతం అన్నట్లుగా ఉంది. ఏదో ఓ చోట వింతలు, విచిత్రాలు వెలుగులోకి రావడం గమనిస్తూనే ఉంటాం. చత్తీస్ఘఢ్(Chhattisgarh)లో ఓ వింత ఆకారంలో లేగ దూడ పుట్టింది.ఉండాల్సిన అవయవకాలంటే ఎక్కువ కలిగి పుట్టడమే అది చేసుకున్న పుణ్యం. అందుకే కోట్లాది లేగ దూడలున్న మన దేశంలో చత్తీస్‌ఘడ్‌లో పుట్టిన ఆ లేగ దూడ గురించే అందరూ చర్చించుకుంటున్నారు. దాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు. ఇప్పుడు దానికి సంబంధించిన వీడియోనే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. చత్తీస్ఘడ్ రాజ్‌నంద్‌గావ్ (Rajnandgaon)జిల్లాలో ఓ ఆవు లేగ దూడ(Heifer)కు జన్మనిచ్చింది. నీరజ్ చందేల్ (Neeraj chandel)అనే వ్యక్తి దగ్గరున్న ఆవు జన్మనిచ్చిన లేగ దూడ అన్నీ దూడల్లా కాకుండా వెరైటీగా ఉండటంతో అందరి కళ్లు ఆ మూగజీవిపై పడ్డాయి. వింత ఏమిటంటే అన్నీ లేగ దూడలకు రెండు కళ్లు మాత్రమే ఉంటాయి. నీరజ్చందేల్ దగ్గరున్న లేగ దూడకు మూడు కళ్లు (3 eyed)ఉండటం విశేషం. నుదుటి దగ్గర మరో కన్ను రెండు ముక్కు రంద్రాలుంటే స్థానంలో నాలుగు రంద్రాలు (Four holes in the nose)ఉన్నట్లుగా గుర్తించాడు యజమాని. సృష్టిలో ఇలాంటి దూడ పుట్టినట్లుగా తాము ఎక్కడా చూడలేదంటున్నారు గ్రామస్తులు. వింత ఆకారంలో పుట్టిన దూడను చూసేందుకు గ్రామస్తులతో పాటు చుట్టు పక్కల గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.
ఇలాంటి దూడని ఎక్కడా చూడలేదే..
మూడు కళ్లు కలిగి ఉండేది కేవలం మహాశివుడు ఒక్కరేనని. అలాంటి మూడు కళ్లతో పుట్టింది కాబట్టి ఈ లేగ దూడ మహాశివుని ప్రతిరూపంగా భావిస్తున్నామంటున్నారు యజమాని, గ్రామస్తులు. అంతే కాదు వింతను చూసేందుకు వచ్చే జనం కొబ్బరి కాయాలు తెచ్చి ఆ దూడ దగ్గర కొడుతున్నారు. పసుపు, కుంకుమలతో పూజలు చేస్తున్నారు. ఇది నిజంగా భగవంతుడు సృష్టించిన అద్భుతమేనని ఆనోట ఈనోట పడటంతో దూడను చూసేందుకు పెద్ద సంఖ్యలో జనం వస్తున్నారని యజమాని చెప్పాడు.
వింత కాదు జన్యులోపం..
జంతు, జీవరాశుల్లో జన్యు లోపం కారణంగా శరీర నిర్మాణం, శరీరంలోని అవయవాలు మార్పులు కలుగుతాయంటున్నారు పశు వైద్య నిపుణులు. కొన్ని సందర్భాల్లో అవయవాలు తక్కువగా ఉండటం, కొన్ని జీవరాశుల్లో ఎక్కువగా ఉండటం జరుగుతుందంటున్నారు. అంతే కానీ జన్యులోపంతో పుట్టిన దూడను దైవానుగ్రహం అని, దైవస్వరూపంగా భావించవద్దని సూచిస్తున్నారు. అయితే ప్రజల సెంటిమెంట్‌ని తప్పు పట్టలేము కాబట్టి ఎవరి నమ్మకం వాళ్లదని చెబుతున్నారు పశువైద్య నిపుణులు.
Published by:Siva Nanduri
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.