• HOME
  • »
  • NEWS
  • »
  • TRENDING
  • »
  • VILLAGE PANCHAYAT OF CALANGUTE IN GOA CREATE AWARENESS ABOUT STAY AT HOME WITH THESE VIRAL SONG SSR GH

Stay Home: బయటకు రావొద్దని ఇలా కూడా చెప్పొచ్చా.. ఇదెక్కడి మాస్ పాట మామా.. వీడియో చూస్తే..

Stay Home: బయటకు రావొద్దని ఇలా కూడా చెప్పొచ్చా.. ఇదెక్కడి మాస్ పాట మామా.. వీడియో చూస్తే..

రోడ్డుపై వెళుతున్న అనౌన్స్‌మెంట్‌ వాహనం

బయటకు రావొద్దు, ఇంట్లోనే ఉండండి అంటూ చాలా రోజులుగా అక్కడి అధికారులు, పరిశోధకులు చెబుతూనే ఉన్నారు. అయినా ప్రజల్లో ఏ మార్పు లేదు. మాస్క్‌లు లేకుండా చాలా మంది బయట తిరుగుతూ కనిపిస్తున్నారు. దీంతో అక్కడి ప్రజలు వినూత్నంగా ఆలోచించి ఓ అనౌన్స్‌మెంట్‌ చేస్తున్నారు. దానికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

  • Share this:
మనిషికో మాట, గొడ్డుకో దెబ్బ అని అంటారు. అంటే ఏదైనా చెప్పినప్పుడు వినకపోతే మనిషికి మాటతో చెప్పాలి, గొడ్డుకు అయితే దెబ్బ కొట్టి చెప్పాలి. అయితే అప్పటికీ వినకపోతే మనిషిని తిడుతూ చెబుతుంటారు. ఇప్పుడు గోవాలోని ఓ ఊళ్లో అదే జరుగుతోంది. కరోనా ప్రభంజనం సృష్టిస్తోంది బయటకు రావొద్దు, ఇంట్లోనే ఉండండి అంటూ చాలా రోజులుగా అక్కడి అధికారులు, పరిశోధకులు చెబుతూనే ఉన్నారు. అయినా ప్రజల్లో ఏ మార్పు లేదు. మాస్క్‌లు లేకుండా చాలా మంది బయట తిరుగుతూ కనిపిస్తున్నారు. దీంతో అక్కడి ప్రజలు వినూత్నంగా ఆలోచించి ఓ అనౌన్స్‌మెంట్‌ చేస్తున్నారు. దానికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

గోవాలోని కలన్‌గూట్‌లో ఓ వాహనం మీద ‘ఇంట్లోనే ఉండండి... బయటకు రావొద్దు’ అంటూ బ్యానర్‌ పెట్టి ఊరంతా తిప్పుతున్నారు. ఇది చాలా ప్రాంతాల్లో జరుగుతోంది. అయితే ఆ వాహనంలో వినిపిస్తున్న పాట మాత్రం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ‘Stay the fuck at home. Stay the fuck at home. Don't be a dick. Stay the fuck at home’ అంటూ సాగే పాటలో బయటకు రావద్దని ప్రజలను ఘాటుగా హెచ్చరిస్తున్నారు. అయితే ఈ వీడియో నిజమైందా కాదా అనే విషయంపై స్పష్టత లేదు. ప్రజలకు అవగాహన కల్పిస్తున్న వీడియోకు, కొందరు ఆకతాయిలు పాటను జోడించి వైరల్‌ చేస్తున్నారనే వాదన వినిపిస్తోంది. అయితే జనాలకు విషయం తీవ్రత అర్థమయ్యేలా పాట ఉందని కొందరు మెచ్చుకుంటున్నారు. ఈ పాట విన్న తరువాత అయినా ఇంటి నుంచి బయటకు రావద్దనే విషయం జనాలకు అర్థమవ్వాలని కోరుతున్నారు.



ట్విటర్‌లో ఈ వీడియో వైరల్ అవుతోంది. చాలామంది యూజర్లు దీన్ని షేర్ చేస్తుండగా.. కొంతమంది మాత్రం రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ‘టిపికల్‌ గోవా పర్సన్‌’ అని కొందరు రాస్తుంటే, ‘ఆ వ్యాన్లో ఏం చెబుతున్నారో వినండి’ అంటూ ఇంకొంతమంది రాస్తున్నారు. ‘మంచి పని చేశారు.. అందుకే గోవా అంటే ఇష్టం’ అంటూ కొందరు ట్వీట్‌ చేస్తే, ‘కరోనా కాలర్‌ ట్యూన్‌ కంటే చాలా బాగుంది’ అంటూ ఇంకొందరు ట్వీట్లు చేస్తున్నారు. ‘ఇది వయలెన్స్‌ కావొచ్చు. కానీ అంగీకరించాల్సిందే’ అని మరికొందరు ట్వీట్లు చేశారు. ఇంకొందరైతే ‘దేశం మొత్తం ఇలాంటి పాట వినిపించాల్సిందే’ అని సరదాగా కామెంట్లలో రాశారు. ఈ పాట నా మొబైల్‌ కాలర్‌ ట్యూన్‌గా ఉంటే బాగుండు అని మరొకరు కామెంట్ రాశారు.
Published by:Sambasiva Reddy
First published: