ఎద్దుకు ఘనంగా అంత్యక్రియలు.. 3000 మందికి భోజనాలు

ప్రతీకాత్మక చిత్రం

ఆ ఎద్దు చనిపోతే... ఊరంతా విషాదంలో మునిగిపోయింది. ఎందుకు అంతలా వారికి బాండ్ ఏర్పడింది. ఆ ఎద్దు ప్రత్యేకతేంటి? ఈ రోజుల్లో మనుషులకే అంత గుర్తింపు లేదు... మరి మూగజీవం చనిపోతే ఎందుకంతలా స్పందించారు?

 • Share this:
  అది ఉత్తరప్రదేశ్... శహరాన్‌పూర్‌లోని కుర్డీ గ్రామం. శనివారం ఆ గ్రామస్థులంతా... ఓ చోటికి వచ్చారు. పూజారులు మంత్రాలు చదివారు. డప్పుల మోత మోగింది. అందరూ భారమైన హృదయాలతో బాబూజీకి అంత్యక్రియలు నిర్వహించారు. ఏకంగా 3వేల మంది ఈ అంత్యక్రియల్లో పాల్గొన్నారు. బాబూజీ అంటే ఊళ్లో ఏ పెద్దాయనో కాదు... అదో ఎద్దు. మనుషులకు ఎంత విలువ ఇచ్చారో... ఆ ఎద్దుకు కూడా అంతే విలువ ఇచ్చారు. 20 ఏళ్ల ఆ ఎద్దు... అదే ఊళ్లో ఉంటూ... ఆగస్ట్ 15న చనిపోయింది. ఊరు ఊరంతా విషాదంలో మనిగిపోయారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన రోజున తమ ఊళ్లో ఇలా జరిగిందే అని ఆవేదనలో మునిగిపోయారు. ఆ తర్వాత మనుషులకు చేసినట్లే అంత్యక్రియలు చెయ్యాలని నిర్ణయించుకొని... అన్నీ సాస్త్రోక్తంగా నిర్వహించారు.

  బాబూజీ... సహజ మరణం పొందింది. దాన్ని మా కుటుంబంలో ఒకటిగా భావిస్తున్నాం అని స్థానికుడైన మనీష్ త్యాగి తెలిపారు. ఎద్దుకు అంత్యక్రియల కోసం ఊరంతా డబ్బులు వేసుకుంది. ఘనంగా అంత్యక్రియలు జరిపించింది. మనుషులకు పాటించినట్లే... ఆచారాలు, పద్ధతులు, సంప్రదాయాలు అన్నీ పాటించారు. కర్మకాండలు జరిపించారు. అంత్యక్రియల తర్వాత 3000 మంది కలిసి భోజనాలు చేశారు. స్థానిక కుర్రాళ్లలో ఒకడు... ఊరి జనం మధ్య ఎద్దును ఫొటో తీశాడు. తర్వాత దాన్ని క్రాప్ చేసి... చుట్టూ ఉన్న జనాన్ని తీసివేశాడు. ఆ తర్వాత ఎద్దు చుట్టూ పువ్వులు, కరెన్సీ నోట్లతో డెకరేట్ చేశాడు. ఎద్దు స్వర్గానికి వెళ్లినట్లుగా సెట్ చేశాడు. ఎద్దుకు ఆత్మకు శాంతి కలగాలని పూజలు చేసినట్లు పూజారి నరేష్ పండిత్ తెలిపారు.

  ఇంతకీ ఆ ఎద్దు అంటే ఎందుకు అంత ప్రేమానురాగాలు అన్న డౌట్ మనకు రావచ్చు. "అది మామూలు ఎద్దు కాదు. అది ఎప్పుడూ ఊళ్లో ఎవర్నీ ఏమీ అనలేదు. పిల్లలైతే దానితో ఆడుకుంటారు కూడా." అని స్థానికుడు భోలా త్యాగీ తెలిపారు. "మా ఊళ్లో పవిత్రమైన ప్లేస్ ఒకటుంది. అక్కడ ఈ ఎద్దు ఓ రోజు సడెన్‌గా కనిపించింది. ఎక్కడి నుంచి వచ్చిందో మాకు తెలియదు. కానీ దాన్ని శివుడి నందీశ్వరుడిగా మేం భావిస్తాం. అందుకే అదంటే మాకు భక్తి, ప్రేమ" అని తెలిపారు మరో గ్రామస్థుడు.

  ఇది కూడా చదవండి: Bullet Train: ఢిల్లీ - అయోధ్య మధ్య బుల్లెట్ ట్రైన్.. వేగం ఎంతంటే!

  ఈ రోజుల్లో మనుషులు చనిపోతేనే... అంత్యక్రియలకు చాలా తక్కువ మంది వెళ్తున్నారు. అలాంటిది ఓ ఎద్దు కోసం ఊరు ఊరంతా తరలిరావడం గొప్ప విషయమే.
  Published by:Krishna Kumar N
  First published: