Vijayawada Fire Mishap : అన్ని కొవిడ్ ఆస్పత్రుల్లో ఫైర్ సేఫ్టీ ఉందా? మొదలైన తనిఖీలు...

Vijayawada Fire Mishap : విజయవాడ కొవిడ్ కేర్ సెంటర్‌లో జరిగిన అగ్నిప్రమాదం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. దేశంలోని మిగతా కొవిడ్ కేర్ సెంటర్లలో ఫైర్ సేఫ్టీ సరిగా ఉందా లేదా అన్న అంశం ఇప్పుడు చర్చకు దారితీసింది.

news18-telugu
Updated: August 9, 2020, 12:10 PM IST
Vijayawada Fire Mishap : అన్ని కొవిడ్ ఆస్పత్రుల్లో ఫైర్ సేఫ్టీ ఉందా? మొదలైన తనిఖీలు...
Vijayawada Fire Mishap : అన్ని కొవిడ్ ఆస్పత్రుల్లో ఫైర్ సేఫ్టీ ఉందా? మొదలైన తనిఖీలు... (credit - twitter - ANI)
  • Share this:
Vijayawada Fire Mishap : కరోనా పేషెంట్లకు ఊపిరే ప్రాణం. విజయవాడలో జరిగిన అగ్నిప్రమాదంలో పొగ, మంట వల్ల ఊపిరి ఆడక కరోనా పేషెంట్లు చనిపోయారు. ఆ ఆస్పత్రిలో మంటల్ని ఆర్పేందుకు తగిన ఏర్పాట్లు, ఫైర్ అలారం వంటివి ఉండి ఉంటే... అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే అలారం మోగి... పేషెంట్లు తప్పించుకునేందుకు అవకాశం ఉండేది. అవేవీ లేకపోవడంతో... మంటలు వేగంగా వ్యాపించి... 11 మంది ప్రాణాలు కోల్పోయారు. దీనంతటికీ కారణం... సరైన ఫైర్ సేఫ్టీ చర్యలు లేకపోవడం వల్లేనని అర్థమవుతోంది. మరి దేశవ్యాప్తంగా ఉన్న కొవిడ్ కేర్ సెంటర్ల పరిస్థితి ఏంటి? వాటిలో ఎన్నింటికి ఫైర్ సేఫ్టీ ఉంది? ఎన్నింటికి గాలి, వెలుతురూ వస్తోంది? ఫైర్ ఇంజిన్లు రావడానికి రూల్ ప్రకారం మూడువైపుల దారులు ఉండాలి. అలా ఎన్ని ఆస్పత్రులకు వీలుంది? ఇవన్నీ ఇప్పుడు తేలాల్సిన అంశాలు. మరోసారి ఇలా జరగకుండా... అన్ని ఆస్పత్రులు, కొవిడ్ సెంటర్లలో ఫైర్ సేఫ్టీ, భవన నిర్మాణ సేఫ్టీ అన్నీ సక్రమంగా ఉన్నాయో లేదో చూడాలి.

Vijayawada Fire Mishap : అన్ని కొవిడ్ ఆస్పత్రుల్లో ఫైర్ సేఫ్టీ ఉందా?


కర్నూలు జిల్లాలో ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కోవిడ్ ఆస్పత్రులు, కోవిడ్ కేర్ సెంటర్లను యుద్ధప్రాతిపదికన తనిఖీ చేసి నివేదిక ఇవ్వాలని జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి, విద్యుత్ ఎస్ఈ, ఏపీపీసీబీ ఇంజినీర్లకు ఆదేశాలను జారీ చేసినట్లు కర్నూలు జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్ తెలిపారు అన్ని కోవిడ్ ఆసుపత్రుల సూపెరింటెండెంట్స్, కోవిడ్ కేర్ సెంటర్స్ నోడల్ అధికారులు ఒకసారి విద్యుత్ కనెక్షన్లను చేక్ చేయించాలని ఆదేశించారు. అలాగే... అగ్నిప్రమాదాలు, ఇతరత్రా ప్రమాదాలు జరగకుండా పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్డరేశారు. దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఇలాంటి చర్యలు చేపట్టాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.

11 మంది ప్రాణాలు బలిగొన్న ఈ ఘటన దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో చర్చకు వచ్చింది. తమ తమ రాష్ట్రాల్లో కూడా ఇలాంటివి జరిగితే ఇంకేమైనా ఉందా అని అక్కడి పాలకులు అలర్ట్ అవుతున్నారు. అసలే దేశంలో కరోనా ఆగట్లేదు. రోజూ 700 నుంచి 800 మరణాలు సంభవిస్తున్నాయి. ఆ నష్టానికి తోడు... ఇలాంటి అగ్నిప్రమాదాల వల్ల మరిన్ని నష్టాలు జరుగుతున్నాయి. పోయిన ప్రాణాలు తిరిగిరావు కాబట్టి... రాజీ పడకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

Vijayawada Fire Mishap : అన్ని కొవిడ్ ఆస్పత్రుల్లో ఫైర్ సేఫ్టీ ఉందా?


దేశంలో ఉన్న అన్ని భవనాలూ సక్రమంగానే కడుతున్నారా? ఎత్తు, అంతస్థులు, ఫైర్ సేఫ్టీ అన్ని రూల్సూ పాటిస్తున్నారా అంటే... లేదన్నదే సమాధానం. చాలా అపార్ట్‌మెంట్లలో పార్కింగ్ సౌకర్యమే ఉండదు. మరి వాటిని కట్టేందుకు అధికారులు ఎలా అనుమతిస్తున్నారో అర్థం కాదు. ఎన్నో భవనాలు అడ్డగోలుగా నిర్మితమవుతున్నవే. ఇప్పుడు విజయవాడలో... స్వర్ణా ప్యాలెస్ హోటల్‌ను రమేశ్ హాస్పిటల్స్... కొవిడ్ కేంద్రంగా మార్చింది కాబట్టి... ఈ ఫైర్ సేఫ్టీపై చర్చ జరుగుతోంది. లేకపోతే... ఎప్పట్లాగే... అవే అక్రమాలు జరుగుతూనే ఉంటాయి. ఇలాంటివి ఏవైనా జరిగి... ప్రాణాలు గాల్లో కలిసిపోతే తప్ప అధికారులు చర్యలు తీసుకోవట్లేదు. రెగ్యులర్‌గా తనిఖీలు చేస్తూ... అక్రమ భవనాల్ని కట్టిన వారిపై చట్టపరమైన చర్యలు ఎందుకు తీసుకోరు? అధికారుల నిర్లక్ష్యం నిండు ప్రాణాలను బలితీసుకుంటోంది.
Published by: Krishna Kumar N
First published: August 9, 2020, 12:10 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading