హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Vijay Sethupathi: అనూహ్య స్పందన -విజయ్ సేతుపతిపై దాడి చేసిన గాంధీ ఇప్పుడు సెలబ్రిటీ!

Vijay Sethupathi: అనూహ్య స్పందన -విజయ్ సేతుపతిపై దాడి చేసిన గాంధీ ఇప్పుడు సెలబ్రిటీ!

విజయ్ సేతుపతి, మహా గాంధీ

విజయ్ సేతుపతి, మహా గాంధీ

ఎయిర్ పోర్టులో దాడి ఘటనపై విలక్షణ నటుడు విజయ్ సేతుపతి అనూహ్యంగా స్పందించారు. జనం తీరుపై వెటకారపు కామెంట్లు చేశారు. కాగా, నటుడిపై దాడికి పాల్పడిన మహా గాంధీ అనే వ్యక్తి మాత్రం కన్నడనాట ఇప్పుడొక చిన్నపాటి సెలబ్రిటీ అయ్యాడు. వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ నీతి బోధలు చేస్తున్నాడు..

ఇంకా చదవండి ...

తమిళ సినిమాలతో మొదలై ఇప్పుడు ఇండియా వ్యాప్తంగా పాపులారిటీ సాధించిన విలక్షణ నటుడు విజయ్ సేతుపతి తనపై దాడి ఘటనపైనా అంతే విలక్షణంగా స్పందించారు. ఇటీవల బెంగళూరు ఎయిర్ పోర్టులో విజయ్ సేతుపతి బృందంపై ఓ వ్యక్తి దాడికి పాల్పడటం, పరుగెత్తుకుంటూ వచ్చి విజయ్ సేతుపతిని వెనుక నుంచి ఎగిరి తన్నిన దృశ్యాలు వైరల్ కావడం తెలిసిందే. ప్రాంతీయ విద్వేషాల నేపథ్యంలో సేతుపతిపై దాడి తర్వాత పుకార్లకు తావు ఇవ్వకుండా ఆయన టీమ్, పోలీసులు, ఎయిర్ పోర్టు సిబ్బంది వివరణలు ఇచ్చారు. తాజాగా విజయ్ సేతుపతి సైతం స్వయంగా నాటి ఘటనపై స్పందించారు. మరోవైపు, నటుడిపై దాడికి పాల్పడిన వ్యక్తి ఇప్పుడు ఏకంగా సెలబ్రిటీ లెవెల్ లో యూట్యూబ్ ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తుండటం గమనార్హం.

గత మంగళవారం(నవబర్ 2న) ఎయిర్ పోర్టులో విజయ్ సేతుపతి బృందంపై దాడి జరగ్గా, సదరు ఘటనకు దారి తీసిన కారణాలను, తర్వాతి పరిణామాలను హీరో స్వయంగా వెల్లడించారు. ‘నిజానికి ఇది(దాడి) చాలా చిన్న ఘ‌ట‌న‌. కానీ జ‌నాలు దీన్ని చాలా పెద్దదిగా చేస్తున్నారన్నారు. దాడి చేసిన వ్య‌క్తి తాగిన మైకంలో ఉన్నాడు. జ‌నాలు స్పృహ‌లో లేన‌పుడు అసాధార‌ణంగా ప్ర‌వ‌ర్తిస్తుంటారు. అధికారులు అత‌న్ని పోలీస్ స్టేష‌న్ కు తీసుకెళ్లారు. స‌మ‌స్య ప‌రిష్కార‌మైంది’అని విజయ్ సేతుపతి అన్నారు. అంతేకాదు..

Huzurabad తర్వాత తొలిసారి CM KCR -సిల్లీ బీజేపీ మెడలు విరగ్గొడతా -వరి వద్దన్నది కేంద్రమే -బండిని ఘోరంగా


ఎయిర్ పోర్టులో విజయ్ సేతుపతిపై దాడి అంటూ సోషల్ మీడియాలో వీడియోలు, ఫోటోలు వైరల్ కావడంపైనా ఆయన అనూహ్య రియాక్షన్ ఇచ్చారు. ‘ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ ఫిల్మ్ మేక‌ర్ అయిపోతున్నారు..’అని వెటకరించారు. అభిమానులంతా ‘మ‌క్క‌ల్ సెల్వ‌న్’ అని పిలుచుకునే విజయ్ సేతుపతి ప్రతస్తుం రెండు సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇక సేతుపతిపై దాడి చేసిన వ్యక్తి ఎవరో వెల్లడైంది..

Aryan Khan కిడ్నాప్, రూ.18కోట్లకు SRKతో డీల్ .. సెల్ఫీతో సీన్ రివర్స్.. బీజేపీ నేత స్కెచ్: నవాబ్ మాలిక్ సంచలనం


దాడి ఘటనను హీరో విజయ్ సేతుపతి ఎంతో హుందాగా లైట్ తీసుకుంటే, దాడికి పాల్పడిన మహా గాంధీ అనే వ్యక్తి మాత్రం కన్నడ యూట్యూబ్ ఛానళ్లకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ నీతి బోధలు చేస్తున్నాడు. తాను కూడా చిన్నపాటి నటుడినే అని, పది సినిమాల్లో నటించానని గాంధీ చెప్పుకున్నాడు. ఆ రోజు విమానంలో సేతుపతితో కలిసి ప్రయాణించానని, మొదట విష్ చేసినప్పుడు నటుడు వెటకారంగా స్పందించాడని, ఆ తర్వాత అతని అసిస్టెంట్లలో ఒకరు దురుసుగా ప్రవర్తిండం వల్లే గొడవ మొదలైందని, సరిగ్గా ఎవరితో గొడవపడింది తెలుసుకోడానికే ఎయిర్ పోర్టు సీసీటీవీ కెమెరా ఫుటేజీ అడిగానని మహా గాంధీ చెప్పుకొచ్చాడు. సేతుపతి నటనంటే చాలా ఇష్టమని, ఇప్పటిదాకా ఆయన సినిమాలు ఒక్కటీ చూడలేదని మహా గాంధీ చెప్పాడు.

First published:

Tags: Attack, Bengaluru, Vijay Sethupathi

ఉత్తమ కథలు