25 కోట్ల క్లబ్లో ‘ట్యాక్సీవాలా’... బయ్యర్లకు లాభాల పంట...
ఐదు రోజుల్లోనే రూ. 25 కోట్ల గ్రాస్ క్లబ్‌లోకి చేరిన విజయ్ దేవరకొండ... ఈ వారం కూడా బాక్సాఫీస్ దగ్గర నో పోటీ... సెంటిమెంట్ కొనసాగిస్తున్న సెన్సేషనల్ స్టార్...

‘టాక్సీవాలా’ మూవీ పోస్టర్ (Photo: twitter)
- News18 Telugu
- Last Updated: November 21, 2018, 11:00 PM IST
‘అర్జున్‌రెడ్డి’, ‘గీత గోవిందం’ సినిమాలతో టాలీవుడ్లో సెన్సేషనల్ స్టార్ అయిపోయాడు విజయ్ దేవరకొండ. ‘నోటా’ డిజాస్టర్ ఫలితం తర్వాత మనోడు విడుదల చేసిన పాత సినిమా ‘ట్యాక్సీవాలా’. విడుదలకు ముందే పైరసీ బారిన పడిన ఈ సినిమాపై విడుదలకు ముందు పెద్దగా అంచనాలు లేవు. అయితే సినిమా విడుదల తర్వాత వచ్చిన పాజిటివ్ మౌత్ టాక్ సినిమాను నిలబెట్టింది. రెండు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘ట్యాక్సీవాలా’... మూడోరోజు నుంచి బయ్యర్లకు లాభాల పంట పండిస్తూనే ఉన్నాడు. మొదటి రెండు రోజుల్లోనే రూ.9 కోట్లకు పైగా షేర్ సాధించి... విజయ్ దేవరకొండకు యూత్‌లో ఉన్న క్రేజ్‌ను మరోసారి నిరూపించింది ‘ట్యాక్సీవాలా’. వీక్ డేస్‌లోనూ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.
థియేటర్ల దగ్గర పెద్దగా పోటీ లేకపోవడం, పోటీగా వచ్చిన రవితేజ ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ డిజాస్టర్ అని తేలడంతో విజయ్ దేవరకొండ సినిమా బాక్సాఫీస్ కలెక్షన్లకు ఢోకా లేకుండా పోయింది. అదీగాకుండా పిల్లలకు కూడా నచ్చేలా తీసిన ఈ సోషియో ఫాంటసీ, సైంటిఫిక్ థ్రిల్లర్ తెలుగు ప్రేక్షకులను బాగానే అలరిస్తుంది. తాజాగా విడుదల చేసిన రిపోర్ట్స్ ప్రకారం ఐదు రోజుల్లోనే రూ. 25 కోట్ల గ్రాస్ క్లబ్‌లోకి చేరిపోయాడు విజయ్ దేవరకొండ. ‘అర్జున్‌రెడ్డి’, ‘గీత గోవిందం’ తర్వాత ఈ పాలమూరు కుర్రాడికి ఇది మూడో రూ.25 కోట్ల సినిమా. వచ్చేవారం కూడా పెద్ద సినిమాలేవీ థియేటర్లలోకి రావడం లేదు. దాంతో ఈ వారం కూడా బాక్సాఫీస్ ‘ట్యాక్సీవాలా’దే.
విజయ్ దేవరకొండ నటించిన ‘పెళ్లిచూపులు’ సినిమా నుంచి ఒక సినిమా హిట్ అయితే ఓ సినిమా ఫ్లాప్ అవుతూ వస్తోంది. ‘పెళ్లిచూపులు’ హిట్టు, ఆ తర్వాత వచ్చిన ‘ద్వారక’ ఫ్లాప్... ‘అర్జున్‌రెడ్డి’ సూపర్ హిట్... తర్వాత విడుదలైన బ్యాక్లాగ్ సినిమా ‘ఏ మంత్రం వేసావే’ డిజాస్టర్... ‘గీత గోవిందం’ బంపర్ హిట్టు... వెంటనే వచ్చిన ‘నోటా’ డిజాస్టర్... ఇప్పుడు ‘ట్యాక్సీవాలా’ హిట్టు కావడంతో నెక్ట్స్ వచ్చే ‘డియర్ కామ్రేడ్’ ఫలితం ఎలా ఉంటుందోనని భయపడుతున్నారు ‘రౌడీ ఫ్యాన్స్’... అదీగాక వీటిలో ‘గీత గోవిందం’, ‘ట్యాక్సీవాలా’ సినిమాలు పైరసీ బారిన పడి, ఆన్లైన్లో లీక్ అయిన తర్వాత కూడా బాక్సాఫీస్ దగ్గర విజయం సాధించడం విశేషం.

షాలిని ఇది నీకు తగునా.. అంటూ తలలు పట్టుకుంటున్న టాలీవుడ్ నిర్మాతలు..
అర్జున్ రెడ్డి చూసి హత్య చేసాడంట.. సారీ చెప్పిన సందీప్ రెడ్డి వంగా..
టాలీవుడ్లో ఆ హీరో అంటే క్రష్... సీక్రేట్ చెప్పేసిన రకుల్
Bigg Boss Telugu 3: బిగ్ బాస్ నుంచి అలీరెజా ఎలిమినేషన్‌కు విజయ్ దేవరకొండ కారణమా...?
బంపర్ ఆఫర్ కొట్టేసిన అర్జున్ రెడ్డి భామ.. రణ్వీర్ సింగ్‌తో.. మూడు సినిమాలు
అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ఇంట్లో విషాదం..
Loading...