హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

OMG: వీళ్లసలు మనుషులేనా.. కుక్కను తాడుకు వేలాడదీసి అమానుషం.. కారణం తెలిస్తే షాక్ అవుతారు..

OMG: వీళ్లసలు మనుషులేనా.. కుక్కను తాడుకు వేలాడదీసి అమానుషం.. కారణం తెలిస్తే షాక్ అవుతారు..

కుక్కను తాడుకి వేలాడదీసి కిందకు వదులుతున్న దృశ్యం

కుక్కను తాడుకి వేలాడదీసి కిందకు వదులుతున్న దృశ్యం

Shocking:  చైనాలో కరోనా మహామ్మారి విజృంభిస్తోంది. ఆ దేశంలో ఇప్పటికే లాక్ డౌన్ ఆంక్షలను కఠినంగా అమలు చేస్తున్నారు. దీంతో.. మనుషులే కాదు.. నోరు లేని ప్రాణులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. ఈ క్రమంలో షాంఘైలోని ఒక కుటుంబం.. తమ పెంపుడు కుక్క కోసం చేసిన పనిని నెటిజన్లు ఏకిపారేస్తున్నారు.

ఇంకా చదవండి ...

China lock down: చైనాలో కరోనా కేసులు శరవేగంగా వ్యాపిస్తున్నాయి. అక్కడి అధికారులు ఆంక్షలను కఠినంగా అమలు చేస్తున్నారు. అత్యవసర సర్వీసులకు మాత్రమే అనుమతి ఇచ్చారు. ప్రజలు ఇల్లుదాటి బయట అడుగు పెట్టకుడదంటూ హెచ్చరికలు జారీ చేశారు. దీంతో ప్రజలు తమ ఇళ్లకే పరిమితమయ్యారు. మనుషులే కాదు.. మూగ జీవాలు కూడా ఈ  లాక్ డౌన్ తో  ఇబ్బందులు పడుతున్నాయి.

ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న దేశానికి ప్రస్తుతం కరోనా కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. కొత్త కొత్త వేరియంట్లు పుట్టుకోస్తున్నాయి. ఒకవైపు కరోనా, మరో వైపు ఒమిక్రాన్ కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఈ క్రమంలో షాంఘైలో కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. దీంతో ఆ నగరమంతా లాక్ డౌన్ విధించారు. అయితే, షాంఘైలో ఒక ఇంటి యజమాని పమేరియన్ జాతి కుక్క పిల్లను పెంచుకుంటున్నాడు.


మరీ దానికి ఇంట్లో బోర్ అయ్యిందో.. లేదా.. బయట వాకింట్ చేస్తే ఎలా ఉంటుందో అనుకున్నాడో కానీ.. కాస్త వెరైటీగా  ఆలోచించాడు. ఒక  తాడుతో కిటికి నుంచి కిందకు మెల్లగా వదిలాడు. కుక్కకు ఒక జాకెట్ అమర్చబడి ఉంది. దానికి ఒక తాడును వేలాడదీసి కిందకు వదిలాడు. వారి ఇల్లు మూడంతస్థుల పైన ఉంది. అది కిందకు చేరుకుని నెలపై వాకింగ్ చేశాక.. మరలా దాన్ని పైకి లాక్కున్నాడు. పైకి లాగేటప్పుడు దానికి అపార్ట్ మెంట్ లోని... కిటికిలు దాని తలకి తగులుతున్నాయి.

ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు.. మీరసలూ.. మనుషులేనా.. అంటూ ఏకిపారేస్తున్నారు. పొరపాటున తాడు.. కుక్కకు ఉరిలాగ బిగిసుకు పోతే.. ఎలా అంటు ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు ఇదేం తెలివిరా బాబు.. అంటూ కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ హాల్ చల్ చేస్తుంది.

Published by:Paresh Inamdar
First published:

Tags: China, Viral Video

ఉత్తమ కథలు