కాంగ్రెస్ (Congress) నేత రాహుల్ గాంధీ తన లోక్‌సభ నియోజకవర్గమైన కేరళలోని (kerala) వాయనాడ్‌లో ఈ రోజు పర్యటించారు. ఈ సందర్భంలో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. తన పర్యటన సందర్భంగా ఒక వృద్ధ మహిళతో కరచాలనం చేస్తూ కనిపించారు. ఆమె రాహుల్ ను (Rahul gandhi) ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నారు. అంతటితో ఆగకుండా రాహుల్ కు ముద్దులు కూడా పెట్టింది. ప్రస్తుతం వీరిద్దరి మధ్య జరిగిన మధుర క్షణానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో (Social media) హల్చల్ చేస్తోంది.
తన నియోజకవర్గమైన వయానాడ్ కి మూడు రోజుల పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ వచ్చారు. రోజంతా అక్కడే పలు ప్రాంతాలలో పర్యటించారు. ప్రజలతో ముచ్చటించారు. అదే విధంగా.. ఇటీవల అధికార సీపీఐ (ఎం) విద్యార్థి విభాగం అయిన స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లేదా ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు ధ్వంసం చేసిన తన కార్యాలయాన్ని కూడా సందర్శించారు.
అప్పుడు ఒక ఆసక్తికర సంఘటన జరిగింది. ఒక వృద్ధురాలు కుర్చీలో కూర్చుని రాహుల్ ను కలవడానికి వేచిచూస్తోంది. తమ ప్రియమైన ఎంపీని కలిసే పోతానని భీష్మించుకుంది. కాసేటపటికి రాహుల్ అక్కడికి చేరుకున్నారు. అక్కడి అధికారులు.. ఈమె ఉదయం నుంచి వేచి చూస్తుందని అన్నారు. ఆమెను ప్రేమగా పలకరించాడు.
ఆమె ఆనందంతో పొంగిపోయింది. వెంటనే రాహుల్ బుగ్గలను ప్రేమతో తాకింది. ముద్దులను పెట్టింది. రాహుల్ కూడా ఆమెను అప్యాయంగా పలకరించాడు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ. బీజేపీపై (bjp) తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.. " దేశంలో ప్రతిచోటా, హింస సమస్యలను పరిష్కరిస్తుందనే ఆలోచన చేస్తుంటారు. కానీ.. హింస ఎప్పుడూ సమస్యలను పరిష్కరించదు... ఇది మంచిది కాదు.. వారు బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించారు. కానీ, నాకు కోపం లేదా శత్రుత్వం లేదని రాహుల్ అన్నారు. అదే విధంగా, హింసకు పాల్పడిన ఎస్ఎఫ్ఐ కార్యకర్తలను గాంధీ "పిల్లలు" అని కూడా పిలిచారు. రాహుల్ గాంధీ ఆదివారం కోజికోడ్ నుంచి ఢిల్లీకి తిరిగి రానున్నారు
Published by:Paresh Inamdar
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.