Home /News /trending /

VIDEO VIRAL PAN SLAPPING CONTEST BETWEEN TWO MEN LEAVES INTERNET IN SPLITS PAH

OMG: పాన్ స్లాపింగ్ కంటెస్ట్.. ఒకరి తలపై మరోకరు పాన్ తో కొట్టుకొవడం.. వీడియో వైరల్..

పాన్ తొ కొట్టుకుంటున్న కంటెస్టెంట్ లు

పాన్ తొ కొట్టుకుంటున్న కంటెస్టెంట్ లు

Viral video: ఇద్దరు వ్యక్తులు ఎదురెదురుగా కూర్చున్నారు. వారిద్దరు కూడా హెల్మెట్ లను ధరించి ఉన్నారు. చుట్టు పక్కలు జనాలు వారిని వింతగా చూస్తున్నారు.

మనం తరచుగా బైక్ రేసింగ్, కార్ రేసింగ్ లను ఎక్కువగా చూస్తుంటాం. కొన్ని చోట్ల యువకులు.. సరదాగా రన్నింగ్ రేస్.. అనేక ఈవెంట్లలో ఇద్దరు పోటికి దిగుతుంటారు. ఇక బాక్సింగ్, స్విమ్మింగ్ లలో కొంత మంది నువ్వా నేనా అని పోటీలో దిగుతుంటారు. మరికొందరు.. ఫుడ్ వెరైటీగా ఫుడ్ తినండంలో పోటీపడిన ఘటనలు కూడా చూశాం. పాటల పాడటం, డ్యాన్స్ లు చేయడం, మొదలైన వాటిలో పోటీపడిన అనేక ఘటనలు తరచుగా చూస్తునే ఉంటాం. కానీ ఇక్కడ ఇద్దరు పెనంతో కొట్టుకొవడం పోటీలో పాల్గొన్నారు. ప్రస్తుతం ఈ ఫన్నీ వీడియో నెట్టింట (social media) హల్ చల్ చేస్తుంది.

పూర్తి వివరాలు.. దీనిలో ఇద్దరు వ్యక్తులు బెంచ్ మీద కూర్చున్నారు. ఒకరికి ఎదురుగా మరోకరు కూర్చున్నారు. మెటల్ తో తయారు చేసిన హెల్మెట్ లను వేసుకున్నారు. నిర్వహకులు వారి చేతికి దోసా పెనం ఇచ్చారు. దాన్నిపట్టుకుని ఒకరి తలపై మరోకరు కొట్టుకుంటున్నారు. ఇద్దరు ఏమాత్రం తగ్గడం లేదు. అయితే, యూఎస్ లో.. కొన్ని చోట్ల పాన్ స్లాపింగ్ కాంటెస్ట్ ( Pan Slapping Contest)  పోటీలను నిర్వహిస్తుంటారు. హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ స్క్వార్జెనెగర్ స్థాపించిన ఆర్నాల్డ్ స్పోర్ట్స్ ఫెస్టివల్ "స్లాప్ ఫైటింగ్ ఛాంపియన్‌షిప్"(Pan slapping contest)  యొక్క అటవీ ఎడిషన్‌ను ప్రారంభించింది.


అయితే, దీనిలో ఇద్దరు వ్యక్తులు తమ తలలపై పాన్ తో బలంగా కొట్టుకొవాలి. ఇద్దరికి కూడా గాయాలు కాకుండా మెటల్ తో తయారుచేసిన హెల్మెట్లను వేసుకొవడానికి ఇచ్చారు. అయితే, ఇద్దరిలో ఎవరైతే అదుపు తప్పి కిందకు పడిపోతారో.. వారు ఓడిపోయినట్లు లెక్క. అయితే, ఈ పోటీలో కూడా.. అదే విధంగా జరిగింది. కొన్ని రౌండ్ల తర్వాత.. ఒక వ్యక్తి కింద పడిపోయాడు. ఆ తర్వాత.. మరో వ్యక్తిని నిర్వహకులు విజేతగా ప్రకటించారు. అయితే, ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ (Viral video) గా మారింది. కాగా, స్లాప్ ఫైటింగ్ ఛాంపియన్‌షిప్" కంటే ముందు మొట్టమొదటి ప్రొఫెషనల్ "పిల్లో ఫైటింగ్ ఛాంపియన్‌షిప్" కూడా జనవరి 2022లో యునైటెడ్ స్టేట్స్‌లో జరిగింది.

ఇదిలా ఉండగా మరోక ఘటనలో ఒక వ్యక్తి దోస పెనంతో  మొసలిని చిత కొట్టాడు.

ఆస్ట్రేలియాలో (Australia)  ఒక వ్యక్తికి షాకింగ్ ఘటన ఎదురైంది. ఆస్రటేలియా ప్రాంతంలోని ల్యాండ్ డౌర్ లో ఈ ఘటన జరిగింది. అక్కడి నార్తర్న్ టెరిటరీ పబ్ కు చెందిన యజమానిపై మొసలి దాడి చేయడానికి ప్రయత్నించింది. వెంటనే అతను చాకచక్యంగా ప్రవర్తించాడు. తన చేతిలోని దోసా ప్యాన్ తో (Man uses frying pan)  మొసలిపై ముఖంపై చితకొట్టాడు. ఆ పబ్ చెరువుకు సమీపంలో ఉంటుంది. అక్కడ తరచుగా మొసళ్లు ఒడ్డుకు వస్తుంటాయి. అయితే.. అతను తన చేతిలోని దోసా ప్యాన్ తో మొసలి ముఖంపై కొట్టాడు. ప్రస్తుతం ఈ క్లిప్పింగ్స్  నెట్టింట వైరల్ గా మారింది.
Published by:Paresh Inamdar
First published:

Tags: Trending video, USA, Viral Video

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు