Home /News /trending /

VIDEO VIRAL ASSAM AUTO DRIVER PUNCHED KICKED BY COPS FOR NOT STOPPING PAH

అమానవీయం.. ఆటోడ్రైవర్ ను విచక్షణ రహితంగా కొట్టిన పోలీసులు.. వీడియో వైరల్..

ఆటోడ్రైవర్ ను కొడుతున్న పోలీసు

ఆటోడ్రైవర్ ను కొడుతున్న పోలీసు

Assam: పోలీసులు వాహానాల తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో.. కొంత మంది పోలీసులు రోడ్డు మీద వెళ్తున్న వాహానలన్నింటిని చెక్ చేస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులు ప్రవర్తించిన తీరు వివాదస్పదంగా మారింది.

కొంత మంది పోలీసులు (Police) కఠినంగా ప్రవర్తిస్తుంటారు. ఖాకీ ఉద్యోగం రాగానే.. ఏదో ఫీల్ అవుతుంటారు. ఇతరుల మీద అజమాయిషీ చేస్తుంటారు. తమ అధికారాన్ని, హోదాను అడ్డుపెట్టుకుని అమానుషంగా ప్రవర్తిస్తుంటారు. కొంత మంది ఇలాంటి పనులు చేయడం వలన డిపార్ట్ మెంట్ అంతటికి చెడ్డపేరు ఆపాదించబడుతుంది. ఈ కోవకు చెందిన అనేక ఘటనలు ఇప్పటికే వార్తలలో నిలిచాయి. మరోక ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

పూర్తి వివరాలు.. అస్సాంలో (Assam)  షాకింగ్ ఘటన జరిగింది. కొంత మంది పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలో.. కర్బీ అంగ్లాంగ్‌లోని ఓ వీధిలో ఓ ఆటోరిక్షా డ్రైవర్‌ను ఇష్టమోచ్చినట్లు కొట్టారు. స్థానికులు కల్గచేసుకుని ఆపడానికి ప్రయత్నించిన వారుపట్టించుకోలేదు. ఆటో డ్రైవర్ ను కాలితో తన్నుతూ.. కొట్టడం చేస్తున్నారు. కేవలం ఆటోను ఆపమంటే... వెళ్లినందుకు ఇలా దాడిచేసినట్లు స్థానికులు తెలిపారు. బొకాజన్ పట్టణంలో ఆదివారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. స్థానికులు.. వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఇది కాస్త వైరల్ గా (Viral video)  మారింది. దీనిపై పోలీసులు ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు.

ఘటనపై విచారణకు ఆదేశించారు. వీడియోలో, బాధితుడు, ఎర్రటి టీ-షర్టు, నల్లని షార్ట్ ధరించి, అతనిపై దాడి చేయడానికి వంతులవారీగా ఇద్దరు పోలీసులు పట్టుకున్నట్లు కనిపిస్తోంది. వారిలో ఒకరు, యూనిఫాంలో, పూర్తి పంచ్‌లు మరియు కిక్‌లు విసురుతూ కనిపిస్తుండగా, మరొకరు, సివిల్ దుస్తులలో, నిస్సహాయ వ్యక్తిని కొట్టడానికి లాఠీని ఉపయోగిస్తున్నారు. అంతే కాకుండా.. పోలీసులు, ఆటో డ్రైవర్ మెడ పట్టుకుని వంచి ఉన్న పోలీసు కారులోనికి ఎక్కించారు. దీన్ని చూసిన నెటిజన్లు షాకింగ్ కు గురౌతున్నారు. ఇది మంచి పద్ధతి కాదని కామెంట్ లు పెడుతున్నారు. ఇదేం ఫ్రెండ్లీ పోలీసింగ్ రా నాయన అంటూ కామెంట్ లు పెడుతున్నారు.

ఇదిలా ఉండగా  ఒక బాలిక చేసిన పనికి జవాన్లు ఎమోషనల్ కు గురయ్యారు.

కొందరు సైనికలు మెట్రో స్టేషన్ లో తమ రైలు కోసం వేచిచూస్తున్నారు. అప్పుడు.. ఒక కుటుంబం కూడా అదే ప్లాట్ ఫామ్ మీద ఉంది. అప్పుడు ఒక చిన్నారి జవాన్లను చూసింది. ఆమె నలుపు రంగు గౌన్ వేసుకుని ఉంది. వెంటనే జవాన్ల దగ్గరకు పరిగెత్తుకుంటు వెళ్లింది. దీంతో జవాన్లు కూడా చిన్నారి వంక ప్రేమగా చూశారు. అప్పుడు చిన్నారి ఒక చేసిన పనికి అందరు ఎమోషనల్ కు గురయ్యారు. జవాన్ ల దగ్గరకు వెళ్లిన చిన్నారి.. వారిని చూస్తు సంతోష పడింది.

అప్పుడు ఒక జవాన్ పాదాల మీద వంగి, ఆయన పాదాలకు నమస్కారం చేసింది. దీంతో అతను కూడా చిన్నారి చేసిన పనికి ఎమోషనల్ అయ్యాడు. వెంటనే కిందకు వంగి చిన్నారిని పైకి ఎత్తాడు. ఆ తర్వాత.. ఆమెను ప్రేమతో దగ్గరకు తీసుకున్నాడు. ఈ ఘటన ఎక్కడ జరిగిందో వివరాలు లేవు . ప్రస్తుతం ఈ వీడియో (viral video)  మాత్రం నెట్టింట తెగ హల్ చల్ చేస్తోంది.
Published by:Paresh Inamdar
First published:

Tags: Assam, Police, Viral Video

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు