రోడ్లపై అడ్డదిడ్డంగా డ్రైవ్ చేయడం.. హెల్మెట్లు పెట్టుకోకుండా రయ్ రయ్‌మని దూసుకెళ్లడం.. సిగ్నల్స్ జంప్ చేయడం.. ర్యాష్ డ్రైవింగ్... ఓవర్ స్పీడ్.. అసలు ఎలా డ్రైవ్ చేయకూడదో అలానే రోడ్డుపైకి దూసుకురావడం.. ప్రశ్నించిన ట్రాఫిక్ పోలీసుల(traffic police)పై దాడి చేయడం.. దాదాపు ప్రతీచోటా ఇదేదో సర్వసాధారణంగా మారిపోయింది.. తప్పు చేసింది చాలదన్నట్లు.. తిరిగి ప్రశ్నించడమే పాపం అనుకోకుండా.. కొట్టడం, తన్నడమేంటో అర్థంకానీ పరిస్థితి. ధన బలం, కండ బలం, రాజకీయం బలం, మూక బలం ఉన్నవాళ్లవే రోజులన్నట్లుగా మారిపోయింది పరిస్థితి. వాళ్లు ఆడిందే ఆట.. కొట్టిందే డప్పు అన్నట్లు తయారైపోయింది. తాజాగా ముంబై(mumbai)లోని కుర్లా ప్రాంతంలో జరిగిన ఈ షాకింగ్ ఘటన చూస్తే ఈ విషయం స్పష్టమవుతుంది.
హెల్మెట్ లేదు.. సిగ్నల్ జంప్:
నగరాల్లో సిగ్నల్స్‌లో డ్యూటీలు చేసే ట్రాఫిక్ పోలీసులు నిబంధనలకు విరుద్ధంగా ప్రయాణించే వాహనాలను ఫోటోలు తీస్తుంటారు. హెల్మెట్ లేకపోతే కొన్నిసార్లు ఆపి ప్రశ్నిస్తారు.. అది కూడా వాహనదారుడి సేఫ్టీ కోసమే చెబుతారు.. మన హైదరాబాద్‌లో లాగే ముంబైలో కూడా అంతే..! కుర్లా ప్రాంతంలో ట్రాఫిక్ పోలీస్ రాకేష్ ఠాకూర్ డ్యూటీ చేస్తున్నాడు. అంతలోనే ఇద్దరు రైడర్లు హెల్మెట్ లేకుండా సిగ్నల్ జంప్ చేసి వేగంగా వెళ్తుండటం గమనించాడు. దీంతో రాకేష్ ఠాకూర్ వారిని అడ్డుకుని మందలించాడు.. హెల్మెట్ లేకుండా వెళ్లడం కరెక్ట్ కాదు అని.. అందులో సిగ్నల్ జంప్ చేయడమేంటని ప్రశ్నించారు.. అప్పటివరుకు రోడ్డంతా తమదేనన్నట్లు అడ్డగోలుగా డ్రైవ్ చేసిన ఆ ఇద్దరికి ట్రాఫిక్ పోలీస్ మాటలు కోపం తెప్పించాయి.
Seems like a new traffic police staff who must be unaware that one cannot fine traffic violators in Kurla. Feel sad for the police staff. Also one more proof of how much fear is there among violators in Mumbai. Wake up call for Traffic Police?pic.twitter.com/QavcnCBgel
— Roads of Mumbai (@RoadsOfMumbai) March 12, 2023
ప్రశ్నించినందుకు దాడి:
తమనే ఆపుతావా.. తమనే ప్రశ్నిస్తావా అంటూ ట్రాఫిక్ పోలీస్‌పై ఆ ఇద్దరు వాదించడం మొదలుపెట్టారు. ఇ-చలాన్ ద్వారా తమకు జరిమానా విధించవద్దని డిమాండ్ చేశారు.ఇక లాభం లేదని భావించిన ట్రాఫిక్ పోలీస్ వాళ్ల బైక్‌ను ఫోటో తియ్యబోయ్యాడు. ముందుకు వెళ్లి ఇ-చలాన్ కెమెరాలో వారిని ఫోటో తీస్తుండటంతో వాళ్లు అతనిపై దాడి చేశారు. ఇంతలో పక్కన ఉన్నవాళ్లు ఈ గొడవను ఆపాల్సిందిపోయి ఆ ఇద్దరి బైకర్లతో చేతులు కలిపారు.. గుంపులో ఒకరి తర్వాత ఒకరు ట్రాఫిక్ పోలీస్‌ను కొట్టడం మొదలుపెట్టారు.. దీంతో అక్కడ నుంచి వెళ్లిపోయిన ట్రాఫిక్ పోలీస్ రాకేష్.. స్టేషన్‌లో కంప్లైంట్ ఇచ్చాడు. బైక్ నంబర్ ఆధారంగా ఒక నిందితుడిని పట్టుకున్న పోలీసులు వాళ్లపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రధాన నిందితుడిని ఖాలీద్‌గా గుర్తించారు. మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఈ ఘటన తర్వాత అతను పరారీలో ఉన్నట్లు సమచారం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Attack, Mumbai, Traffic police