హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

OMG: రెప్పపాటులో మునిగిపోయిన 40 మీటర్ల భారీ నౌక.. షాకింగ్ వీడియో వైరల్..

OMG: రెప్పపాటులో మునిగిపోయిన 40 మీటర్ల భారీ నౌక.. షాకింగ్ వీడియో వైరల్..

మునిగిపోతున్న భారీ నౌక

మునిగిపోతున్న భారీ నౌక

Viral video: మధ్య ధరా సముద్రంలో షాకింగ్ ఘటన జరిగింది. 130 అడుగుల పడవ చూస్తుండగానే నీటిలో మునిగిపోయింది. దీంతో ఒడ్డున ఉన్నవారు.. తీవ్ర ఆందోళనలకు గురయ్యారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Rajasthan, India

చాలా మంది సముద్రంలో ఓడలు, భారీ పడవలలో తరచుగా ప్రయాణిస్తుంటారు.  కొన్నిసార్లు.. అలల తాకిడికి లేదా వాతావరణం అనుకూలించక పోవడంతో ప్రవాహం మధ్యలోనే పడవలు మునిగిపోతుంటాయి. మరికొన్నిసార్లు.. బోట్లలో ప్రయాణికుల సంఖ్య ఎక్కువగా అవ్వడం లేదా పడవలో సాంకేతిక లోపం తలెత్తడం వంటి కారణాల వలన కూడా నడి సముద్రంలో పడవలు ముందుకు వెళ్లలేక ఆగిపోయాయి. ఈ క్రమంలో భారీ ఎత్తున ప్రాణ, ఆస్తి నష్టం సంభవించిన అనేక సంఘటనలు గతంలో వార్తలలో నిలిచాయి. తాజాగా, మరో షాకింగ్ ఘటన వైరల్ గా మారింది.


పూర్తి వివరాలు.. ఇటాలియన్ కోస్ట్ గార్డుకు చెందిన నౌక బోటు గల్లిపోలీ నుంచి మిలాజోకు ప్రయాణిస్తుంది. అప్పుడు వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో బోట్ ఒక్కసారిగా నీటిలో మునిగిపోయింది. అందరు చూస్తుండగానే.. 40 మీటర్ల భారీ పడవ పూర్తిగా నీటిలో మునిగిపోయింది. అందులో ప్రయాణిస్తున్న వారంతా భయంతో వణికిపోయారు.
దీంతో అక్కడికి వెంటనే రెస్క్యూ సిబ్బంది వెళ్లారు. అక్కడ నీటిలో తేలుతున్న 9 మందిని కాపాడారు. కాగా, ఈ పడవను 2007 లో మొనాకోలో నిర్మించారు. దీనికి సాగా అని పేరు పెట్టారు. తీరానికి 14.5 కిలో మీటర్ల దూరంలో శనివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం అక్కడ అధికారులకు సముద్రంలో గల్లంతైన వారి కోసం ప్రత్యేక బోట్ లు, గజ ఈతగాళ్లతో వెతుకుతున్నారు. ప్రస్తుతం పడవ నీటిలో మునిగిపోతున్న  వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో (Social media)  వైరల్ గా (Viral video)  మారింది.


ఇదిలా ఉండగా రోడ్డుమీద దున్న పోతు హల్ చల్ చేసింది.


హర్యానా లో (Haryana)  షాకింగ్ ఘటన జరిగింది. ఫరీదాబాద్ లో గత బుధవారం జరిగిన సంఘటన తాజాగా వైరల్ గా  మారింది. ఒక పెద్దాయన రోడ్డు దాటుతున్నాడు. ఇంతలో ఒక దున్నపోతు అదే మార్గం గుండా వెళ్తుంది. అది పెద్దయనను గమనించింది. పాపం.. ఆయన తన చేతిలో ఒక చిన్నబకెట్ పట్టుకుని రోడ్డు దాటుతున్నాడు. ఇంతలో.. ఏమైందో కానీ దున్నపోతు అక్కడికి కోపంతో వచ్చింది. పెద్దాయనను తన కొమ్ములతో అమాంతం గాలిలో పైకెత్తింది.


ఆ తర్వాత.. మరోవైపుకు విసిరి కొట్టింది. అక్కడున్నవారంతా షాకింగ్ కు గురయ్యారు. వెంటనే చుట్టుపక్కల వారు.. పెద్దయనను అక్కడి నుంచి పక్కకు తీసుకెళ్లారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు షాకింగ్ కు గురౌతున్నారు. ఇంకా నయం కుమ్మేయలేదు.. మనోడి ఆయుశ్శు గట్టిదే అంటూ కామెంట్ లు పెడుతున్నారు.Published by:Paresh Inamdar
First published:

Tags: Boat accident, Viral Video

ఉత్తమ కథలు