Home /News /trending /

VIDEO RPF COP SAVES PASSENGER WHO SLIPPED TRYING TO BOARD MOVING TRAIN VASCO STATION SU

Video: రన్నింగ్ ట్రైన్ ఎక్కబోయి జారిపడ్డ ప్రయాణికుడు.. క్షణాల్లో స్పందించిన రైల్వే పోలీసు.. వీడియో షేర్ చేసిన రైల్వే మంత్రిత్వ శాఖ

(Image-Twitter)

(Image-Twitter)

చాలా వేగంగా స్పందించిన ఓ రైల్వే పోలీసు అధికారి ఓ నిండు ప్రాణాన్ని కాపాడారు.

    చాలా వేగంగా స్పందించిన ఓ రైల్వే పోలీసు అధికారి ఓ నిండు ప్రాణాన్ని కాపాడారు. కదులుతున్న రైలు ఎక్కేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తి.. జారిపడిపడ్డాడు. అయితే ఇది గమనించిన రైల్వే పోలీసు అతన్ని రక్షించాడు. ఈ ఘటన గోవాలోని Vasco da Gama రైల్వే స్టేషన్‌లో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోను రైల్వే మంత్రిత్వ శాఖ ట్విట్టర్‌లో షేర్ చేసింది. వివరాలు.. ఓ ప్రయాణికుడు 02741- Vasco-Patna express రైల్వే స్టేషన్ నుంచి మూవ్ అవుతున్న సమయంలో ట్రైన్ ఎక్కేందుకు ప్రయత్నించాడు. ట్రైన్ కదులుతుండగా రన్ చేసుకుంటూ వచ్చి రైలు ఎక్కబోయాడు. అయితే కాలు జారడంతో స్లిప్ అయి కిందపడిపోయాడు. అయితే ఆ సమయంలో కొద్ది దూరంలో ఉన్న రైల్వే హెడ్ కానిస్టేబుల్ కేఎం పాటిల్ వెంటనే స్పందించారు.

    ప్లాట్‌ఫామ్ నుంచి కిందకు జారిపోతున్న అతన్ని వెంటనే బయటకు లాగి.. పక్కకు తీసుకెళ్లాడు. దీంతో అతని ప్రాణాలతో బయటపడ్డాడు. అయితే ఈ ఘటనలో ఆ ప్రయాణికుడికి గాయాలు అయినట్టుగా తెలుస్తోంది. ఇక, ఈ వీడియో షేర్ చేసిన రైల్వే మంత్రిత్వ శాఖ.. కదులుతున్న రైలు ఎక్కడం గానీ, దిగడం గానీ చేయకూడదని ప్రయాణికులను కోరింది. అది జీవితాన్ని ప్రమాదంలోకి నెట్టవచ్చని పేర్కొంది.





    ఇక, రైల్వే శాఖ షేర్ చేసిన వీడియోను నెట్టింట్లో వైరల్‌గా మారింది. పలువురు ప్రయాణికుడిని రక్షించిన రైల్వే పోలీసును అభినందిస్తూ కామెంట్స్ చేస్తున్నారు.
    Published by:Sumanth Kanukula
    First published:

    Tags: Goa, Indian Railways, Train, Viral Video

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు