VIDEO OF WOMEN CAUGHT STEALING FROM A SWEET SHOP IN UTTAR PRADESH GOING VIRAL SNR
Video viral: కస్టమర్లు కాదు ఖతర్నాక్ లేడీస్..ఎందుకొచ్చారో ఏం చేశారో ఈ వీడియో చూడండి
Photo Credit:Youtube
Video viral:కస్టమర్ల స్టైల్లో స్వీట్షాపులోకి వచ్చిన మహిళలు ఈజీగా చోరీ చేశారు. కౌంటర్ దగ్గరున్న స్వీట్లు, మిక్చర్ ప్యాకెట్లను సైలెంట్‌గా బ్యాగులో వేసుకొని జారుకునే ప్రయత్నం చేయడంతో దొంగల్ని సీసీ ఫుటేజ్ పట్టించింది. ఉత్తరప్రదేశ్‌లో జరిగిన చోరీ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
చోరీలు చేయడం ఓ కళ. అది కూడా తెలియని ఓ మహిళ..ఓ అమ్మాయిని వెంటబెట్టుకొని స్వీట్ షాపుకి వెళ్లి దొంగతనం చేసింది. ఈ చోరీ దృశ్యాలు చూస్తుంటే ...ఆ మహిళకు కనీసం దొంగతనం చేయడంలో ఓనమాలు కూడా నేర్చుకోలేదేమోనని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. స్టోరీలోకి వెళ్తే ..ఉత్తరప్రదేశ్(Uttar Pradesh)రాష్ట్రం హార్దోయ్(Hardoi)లోని శాండిలా(Sandila)ప్రాంతంలో గల్లా మండి ఉంది. అక్కడ ఓ ఫేమస్ స్వీట్ షాపు (Sweet Shop)ఉంది. పెద్ద మిఠాయి దుకాణం కావడంతో ఎప్పుడూ కస్టమర్లతో ఫుల్ రద్దీగా ఉంటుంది. ఈ చిన్న పాయింట్‌ని పట్టుకొని ఆ చోర వనిత(Women)టిప్ టాప్‌గా తయారై స్వీట్లు కొనుగోలు చేయడానికి వెళ్లినట్లుగా బిల్డప్ ఇచ్చింది. ముందు షాపులో పని చేస్తున్న సేల్స్‌మెన్(Salesmen), ఉద్యోగుల(Employees)ను పలకరించి..కౌంటర్, గ్లాస్ ప్రదర్శన కోసం పెట్టిన బాక్సుల్ని, మిక్చర్(Namkin), నమ్కిన్ (Mikchar)ప్యాకెట్లను పరిశీలిస్తున్నట్లుగా చూసి ఒక్కొక్క ప్యాకెట్‌ని తన పక్కనే భుజానికి బ్యాగ్ తగిలించుకొని నిల్చున్న మరో అమ్మాయికి ఇచ్చింది. ఇలా షాపులో ఎవరి పనిలో వాళ్లుంటే ఈ దొంగ మహిళ మాత్రం ఎంచక్కా తన పని తాను పూర్తి చేసుకుంది. ఇలా షాపులో పనిచేస్తున్న వాళ్లకు తెలియకుండా నాలుగు మిక్చర్, నమ్కిన్ ప్యాకెట్లను సీక్రెట్‌గా బ్యాగులో నెట్టేసింది. ఈ లేడీ దొంగకు తెలియని విషయం ఏమిటంటే..ఆమె షాపులోకి ఎంటరైన దగ్గర నుంచి చోరీ చేసి బ్యాగులో సర్ధుకునే వరకూ అంతా సీసీ కెమెరా(CCTV camera)లో రికార్డయింది.
కస్టమర్లు కాదు ఖతర్నాక్ లేడీస్..
షాపుకి వచ్చి ఏమీ కొనుగోలు చేయకుండా వచ్చిన ఆడవాళ్లు వెళ్లిపోతుండటం షాపు యజమాని చూశాడు. అంతే కాదు టేబుల్ పైన పెట్టిన స్వీట్ బాక్సులు, నమ్కిన్ ప్యాకెట్లు తగ్గడంతో అనుమానం వచ్చి మెల్లిగా జారుకుంటున్న దొంగ మహిళను వెనక్కి పిలిచాడు ఓనర్. చేతిలో ఏదో ఉంది బిల్ చెల్లించకుండా తీసుకెళ్తున్నావేంటని నిలదీయడంతో వెంటనే చేతిలో ప్యాకెట్ అక్కడ పెట్టి పారిపోబోయేంది. ఈ చోరీ ఎపిసోడ్ అంతా సీసీ కెమెరాలో రికార్డవడం దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో విపరీతంగా వైరల్ అవుతోంది.
టిప్ టాప్ దొంగలు..
ఈసందర్భంగా స్వీట్ షాప్ యజమానికి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ ఫుటేజ్ అప్పగించడంతో వాళ్లు గ్రూప్‌లో షేర్ చేశారు. ఎందుకంటే షాపులకు వచ్చే అందరూ బయటకు మర్యాదగానే కనిపిస్తారు..కాని వాళ్లు చేసే దొంగ పనులు ఎవరికి కనిపించవని..కాబట్టి టిప్ టాప్‌గా రెడీ అయి దుకాణాలకు వచ్చే కస్టమర్లను నమ్మి మోసపోకండి..ఇలాంటి వారిపై ఓ కన్నేసి ఉంచండి లేదంటే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయమని పోలీసులు సూచిస్తున్నారు.
Published by:Siva Nanduri
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.