హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Viral Video: ఔరా ఏమి ఆ రాజసం​.. ఈ వైట్ టైగర్ అందం చూడటానికి రెండు కళ్లు సరిపోవుగా..

Viral Video: ఔరా ఏమి ఆ రాజసం​.. ఈ వైట్ టైగర్ అందం చూడటానికి రెండు కళ్లు సరిపోవుగా..

Photo Credit : Face book

Photo Credit : Face book

Viral Video: సోషల్ మీడియా విస్తృతితో ప్రపంచంలో జరిగే వింతలు, విశేషాలు క్షణాల్లో వైరల్​ అవుతున్నాయి. ముఖ్యంగా, విభిన్న జంతువుల వీడియోలు క్షణాల్లో వైరల్​ అవుతుంటాయి. తాజాగా ఒక వైట్ టైగర్‌కి సంబంధించిన వీడియో సోషల్​ మీడియాలో అందర్నీ ఆకట్టుకుంటోంది.

ఇంకా చదవండి ...

సోషల్ మీడియా విస్తృతితో ప్రపంచంలో జరిగే వింతలు, విశేషాలు క్షణాల్లో వైరల్​ అవుతున్నాయి. ముఖ్యంగా, విభిన్న జంతువుల వీడియోలు క్షణాల్లో వైరల్​ అవుతుంటాయి. తాజాగా ఒక వైట్ టైగర్‌కి సంబంధించిన వీడియో సోషల్​ మీడియాలో అందర్నీ ఆకట్టుకుంటోంది. అమెరికాలోని ఒక జాతీయ పార్కులో ఉండే అందమైన వైట్​ టైగర్ వీడియోను చూసి ఇప్పుడు అంతా మంత్ర ముగ్ధులవుతారు. ఈ వైట్​ టైగర్​ అమెరికాలోని విస్కాన్సిన్‌లోని షాలోమ్ వన్యప్రాణుల అభయారణ్యంలో కనిపించింది. చూడటానికి ఎంతో ఆకర్షణీయంగా తెలుపు వర్ణంలో మెరిసి పోతుంది. జూకు సంబంధించిన ఫేస్‌బుక్ పేజీ ద్వారా దీన్ని షేర్​ చేశారు. దీని పేరు జింగర్​గా వీడియోలో పేర్కొన్నారు.వీడియోని పరిశీలిస్తే.. ఒక పెద్ద బండపై వైట్​ టైగర్​ కూర్చొని దిక్కులు చూస్తుంది. ఈ క్రమంలో తన కాలు ముందుకు లాక్కుంటుంది. ఆ తర్వాత ఆ బండపైనే పడుకొని విశ్రాంతి తీసుకుంది. ఈ వీడియో చూడటానికి ఎంతో ఆకట్టుకుంటుంది. జూన్ 27న ఫేస్​బుక్​లో ఈ వీడియో షేర్​ అయ్యింది. అప్పటి నుంచి ఈ జింగర్​ వైట్​ టైగర్​ ఆన్‌లైన్‌లో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో షేర్​ చేసినప్పటి నుంచి 3 లక్షలకు పైగా వ్యూస్​ను సాధించింది.

అంతేకాదు, ఫేస్​బుక్​లో 24 వేల దీన్ని షేర్ల చేశారు. నెటిజన్లు ఈ వైట్​ టైగర్​ అందాన్ని ఆరాధిస్తూ, అభినందనలతో ముంచెత్తుతున్నారు. ఇక నెటిజన్​ కామెంట్​ చేస్తూ ‘‘ఇంత అందమైన జంతువును ఇప్పటివరకు చూడలేదు.’’ అని కామెంట్​ చేశాడు. ఇక మరో నెటిజన్​ “ఈ వైట్​ టైగర్​ అద్భుతమైన జీవి! చూడటానికి రెండు కళ్లు చాలడం లేదు. చూస్తుంటే ముచ్చటేస్తుంది." అని కామెంట్​ చేశారు.

గడ్డి తింటున్న వైట్​ టైగర్​​..

ఇదిలా ఉంటే కొంత మంది నెటిజన్లు మాత్రం ఫోటోలు, వీడియోల్లో కాదు ఈ అందమైన వైట్​ టైగర్​ను లైవ్​లో చూడాలని ఉందని తమ కోరికను బయటపెట్టారు. దీన్ని చూడటానికి తప్పకుండా విస్కాన్సిన్​లోని ఫాలోమ్​ జూను సందర్శిస్తానని ఒక నెటిజన్​ పేర్కొన్నారు. ఇక మరికొంత మంది నెటిజన్లు మాత్రం వైట్​ టైగర్​ అందాన్ని ఆరాధిస్తూ ఎమోజీలు, GIF లను పంచుకున్నారు. ఈ క్లిప్‌ను షేర్​ చేసిన షాలోమ్ వైల్డ్​ లైఫ్ జూ అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. కాగా, వైట్​ టైగర్​ ఇంటర్నెట్​లో వైరల్​ అవ్వడం ఇది మొదటి సారేం కాదు. ఇటీవల ఓ వైట్​ టైగర్​ గడ్డి తింటున్న వీడియో ఆన్‌లైన్‌లో చక్కర్లు కొట్టింది. ఈ టైగర్​ భారతదేశంలోని మధ్యప్రదేశ్‌లోని సత్పురా టైగర్ రిజర్వ్‌కు చెందింది. టైగర్లు భయంకరమైన వేటగాళ్ళుగా మనందరికీ తెలుసు. కానీ దానికి భిన్నంగా గడ్డి తినడంతో అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది.

First published:

Tags: America, Tiger, Viral Video

ఉత్తమ కథలు