పురివిప్పిన తెల్ల నెమలి.. ఆడ నెమలి కోసమే.. వైరల్ వీడియో

విశాఖపట్టణంలోని ఇందిరా గాంధీ జూపార్క్‌లో ఈ అందమైన తెల్ల నెమలి పురి విప్పింది. ఆ వీడియోను జూపార్క్ ట్విటర్ హ్యాండిల్‌లో పోస్ట్ చేయగా.. ఐఎఫ్ఎస్ అధికారి పర్వీన్ షేర్ చేశారు.

news18-telugu
Updated: June 9, 2020, 7:38 PM IST
పురివిప్పిన తెల్ల నెమలి.. ఆడ నెమలి కోసమే.. వైరల్ వీడియో
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
నెమలి మన జాతీయ పక్షి. ఈ అందమైన పక్షంటే ఇష్టం లేని వారు ఎవరూ ఉండరు. వాన ముసురులో నెమలి పురి విప్పి నాట్యం చేసిందంటే.. ఆ అందాల దృశ్యాన్ని చూసేందుకు రెండు కళ్లూ చాలవు. సాధారణంగా ఆడ నెమలిని ఆకట్టుకునేందుకు మగ నెమళ్లు పింఛం విప్పి నాట్యం చేస్తుంటాయి. ఐతే తెల్ల నెమళ్లు చాలా తక్కువగా ఉంటాయి. అందులోనూ అది డాన్స్ చేయడం చాలా అరుదుగా కనిపిస్తుంది. ఆ అద్భుతమైన నెమలి నాట్యాన్ని ఐఎఫ్ఎస్ అధికారి పర్వీన్ కశ్వాన్ ట్విటర్ ద్వారా షేర్ చేశారు.


విశాఖపట్టణంలోని ఇందిరా గాంధీ జూపార్క్‌లో ఈ అందమైన తెల్ల నెమలి పురి విప్పింది. ఆ వీడియోను జూపార్క్ ట్విటర్ హ్యాండిల్‌లో పోస్ట్ చేయగా.. ఐఎఫ్ఎస్ అధికారి పర్వీన్ షేర్ చేశారు. అందులో తెల్ల నెమలి తన పింఛం విప్పి ఆడ నెమలిని ఇంప్రెస్ చేసేందుకు ప్రయత్నించింది. తెల్లటి పొడవాటి ఈకలతో చాలా అందంగా కనిపించింది ఆ నెమలి. 45 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియో నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంది. వావ్.. బ్యూటిఫుల్ అంటూ చాలా మంది కామెంట్ చేస్తున్నారు.
Published by: Shiva Kumar Addula
First published: June 9, 2020, 7:38 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading