Israel-Palestine: ఇజ్రాయెల్- పాలస్తీనా గొడవలు... ఈ బాలిక మాటలు వింటే మనసు కరగాల్సిందే..

కంటతడి పెట్టుకున్న బాలిక

ఓ పదేళ్ల బాలిక కన్నీళ్లతో తన బాధను వెల్లడించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్​గా మారింది. తానేం తప్పుచేశానని 10 ఏళ్ల నదీన్ అబ్దెల్ తైఫ్​​ కన్నీళ్లు పెట్టుకుంటూ చెప్పిన మాటలు అందరి హృదయాలను ద్రవింపజేస్తోంది.

  • Share this:
ఇజ్రాయెల్​- పాలస్తీనా మధ్య హింస రోజురోజుకూ పెరిగిపోతోంది. వందల సంఖ్యలో ప్రజలు మరణిస్తుండగా, వేలాది మంది గాయపడుతున్నారు. ఈ దాడుల్లో వేలాది మంది నిరాశ్రయిలవుతున్నారు. ఎంతో మంది భయంతో కాలం గడుపుతున్నారు. ఇక చిన్నారుల వేదన మాత్రం తీవ్రంగా ఉంది. ఈ నేపథ్యంలో ఓ పదేళ్ల బాలిక కన్నీళ్లతో తన బాధను వెల్లడించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్​గా మారింది. తానేం తప్పుచేశానని 10 ఏళ్ల నదీన్ అబ్దెల్ తైఫ్​​ కన్నీళ్లు పెట్టుకుంటూ చెప్పిన మాటలు అందరి హృదయాలను ద్రవింపజేస్తోంది. మిడిల్ ఈస్ట్ ఐ అనే వార్తా సంస్థ ఆ బాలిక వేదనను రికార్డు చేసింది. ఈ వీడియో చూస్తే గాజాలోని చిన్నపిల్లలు ఎంత బాధపడుతున్నారో తెలుస్తోంది. ‘నేను ఏం చేయాలో తెలియడం లేదు. పరిస్థితులను ఎలా సరిచేయాలి? నాకు 10 సంవత్సరాలు. నేను ఈ కష్టాన్ని ఇంక భరించలేను’ అంటూ బాధతో తలబడుతూ ఆ బాలిక మాట్లాడింది.

“నా ప్రజలకు సాయం చేసేందుకు నేను డాక్టర్ కావాలనుకుంటున్నా. కానీ నేను ఇప్పుడు చిన్నపిల్లను. ఇప్పుడేమీ చేయలేకపోతున్నా. నాకు చాలా భయమేస్తోంది. నేను నా ప్రజల కోసం ఏమైనా చేసేందుకు సిద్ధంగా ఉన్నా. కానీ ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు” అని నదీన్ చెప్పింది. అలాగే తమకు ఈ కష్టం ఎందుకొచ్చిందని, తామేం తప్పు చేశామని ఆ బాలిక ప్రశ్నించింది.


పాలస్తీనాలోని హమాస్ ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా గాజాపై ఇజ్రాయెల్ భారీగా దాడులు చేస్తోంది. ఎనిమిది రోజులుగా వైమానిక దాడులతో రాకెట్ల వర్షాన్ని కురిపిస్తోంది. ఇప్పటి వరకు ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ సిస్టమ్​ దాదాపు 1500 రాకెట్లను ప్రయోగించినట్టు వార్తలు వస్తున్నాయి. ఆ దాడుల్లో దాదాపు 149 మంది చనిపోగా.. వేయి మందికి పైగా గాయపడ్డారు. భారీ సంఖ్యలో భవనాలు నేలకొరిగాయి. యూనిసెఫ్​ లెక్కల ప్రకారం మే 15 నాటికి ఈ దాడుల్లో 40 మంది చిన్నారులు మృతి చెందారు. కాగా హమాజ్​ తీవ్రవాదులు సైతం ఎదురుదాడి చేస్తున్నారు.

మరోవైపు ఇజ్రాయెల్​, పాలస్తీనా మధ్య శాంతి నెలకొనాలని వివిధ దేశాధినేతలు ఆకాంక్షిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​ సహా మరిన్ని దేశాల నేతలు ఈ విషయంపై స్పందించారు. చర్చలతో వివాదాలు పరిష్కరించుకోవాలని సూచిస్తున్నారు. అయితే అవసరమైనంత కాలం హమాజ్ తీవ్రవాద స్థావరాలపై వైమానిక దాడులు చేస్తామని ఇజ్రాయెల్​ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు స్పష్టం చేశారు. దీంతో ఈ ఇరు దేశాల మధ్య శాంతి ఎప్పుడు నెలకొంటుందో అని ప్రపంచం మొత్తం వేచిచూస్తోంది. కాగా ఈ ఉద్రిక్తల్లో అమాయకులు బలవుతుండడంతో అంతర్జాతీయ సమాజం విచారం వ్యక్తం చేస్తోంది.
Published by:Shiva Kumar Addula
First published: