డ్రైవింగ్ చేయాలనే కోరిక, సరదా అందరికి ఉంటుంది. ఆ సరదా ఉంటే సరిపోదు. అందులో మనకు పూర్తిగా నైపుణ్యం సాధించి..పర్‌ఫెక్ట్‌గా వస్తేనే వాహనం తీసుకొని రోడ్లపైకి రావాలి లేదంటే..ఎదుటి వాళ్లకు ఎంత ప్రమాదమో..అంతకంటే రెట్టింపు ప్రమాదం మనకే ఉంటుంది మర్చిపోవద్దు. ఉత్తరప్రదేశ్(Uttar Pradesh)లో ఓ అమ్మాయి ఈ చిన్న విషయం తెలియక ప్రాణాల మీదకు తెచ్చుకుంది. జాన్సీ(Jhansi)జిల్లా కిస్ పోలీస్ స్టేషన్(Kiss Police Station)పరిధిలో జరిగిన బైక్ యాక్సిడెంట్(Bike Accident)ఇందుకు ఉదాహరణగా చూడాలి. యూపీలో జరిగిన రోడ్డు ప్రమాదం వీడియో(Video) ఇప్పుడు సోషల్ మీడియా(Social media)లో తెగ చక్కర్లు కొడుతోంది. డ్రైవింగ్ రాకపోయినా రోడ్లపైకి వాహనాలు తీసుకొచ్చే ముందు ఒక్కసారి ఈ వీడియో చూస్తే సరిపోతుంది.
డ్రైవింగ్ రాకపోతే అంతే..
ఉత్తరప్రదేశ్ జాన్సీ జిల్లా కిస్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన యాక్సిడెంట్ వీడియోని చూస్తే నిజంగా వాళ్లు డ్రైవింగ్ రాక షాపు ముందు కట్టిన పిల్లర్‌ని స్కూటీతో ఢీకొట్టారా లేక సూసైడ్ చేసుకునేందుకు ప్రయత్నించారో అర్ధం కాని పరిస్థితి. సైడ్ రోడ్డు మీద నుంచి మెయిన్ రోడ్డుపైకే రెడ్ కలర్ యాక్టివాపై వచ్చారు ఇద్దరు మహిళలు. చాలా స్పీడుగా..డ్రైవింగ్ బాగా వచ్చిన వాళ్లలా మెయిన్ రోడ్డు ఎక్కించారు. అయితే అక్కడి నుంచి లెఫ్ట్, రైట్ రెండు రోడ్లు ఉండగా డైరెక్ట్‌గా రోడ్డు పక్కన ఉన్న షాపుల వైపుకు వచ్చింది స్కూటర్.
వైరల్ అవుతున్న వీడియో..
వాహనం నడుపుతున్న ఇద్దరు మహిళల్లో ఒకరు యువతి కాగా మరొకరు ఆమె తల్లో, సోదరి అనుకుంటా. యాక్టివా బైక్ తీసుకొచ్చి షాపు ముందు షెడ్ వేయడానికి కట్టిన సిమెంట్ ఇటుకల దిమ్మెను ఢీకొట్టారు. యాక్సిడెంట్ జరిగిన సమయంలో బైక్ స్పీడు మీద ఉండటంతో బైక్ షాపు ముందున్న పోల్‌కి ఢీకొట్టడంతో ఇద్దరు మహిళలు పక్కనే ఉన్న అరుగుపైన ఒకరు మరొకరు కింద పిట్టల్లా ఎగిరిపడ్డారు. యాక్సిడెంట్ జరిగిన కొద్ది సేపటికి వెనుక కూర్చున్న మహిళ తేరుకొని కూర్చొనేలోపే అక్కడి స్థానికులు వచ్చి వెంటనే ఇద్దరు మహిళల తీవ్రంగా గాయపడటంతో ఆసుపత్రికి తరలించారు.
ఇది చూసైనా మారండి..
స్థానికంగా ఉంటున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. సదరు మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్ లేనట్లుగా సమాచారం. అలాగే వీళ్లు కావాలనే బైక్‌ని దుకాణానికి ఢీకొట్టాలనుకున్నారా లేక స్పీడ్ కంట్రోల్ చేయలేక యాక్సిడెంట్ చేశారా అనే విషయం మాత్రం పోలీసులకు అంతుచిక్కడం లేదు. కిరాణ షాపు దగ్గర ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో ఈ యాక్సిడెంట్ దృశ్యాలు స్పష్టంగా రికార్డవడంతో వీడియో తెగ వైరల్ అవుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bike accident, Uttar pradesh, Viral Video