Home /News /trending /

VIDEO OF TEENAGERS THROWING CURRENCY NOTES AT LADY DANCER IN UTTAR PRADESH GOES VIRAL SNR

Uttar Pradesh:లేడీ డ్యాన్సర్‌తో తమాషాలా..పిస్టోల్ గురి పెట్టినందుకు నోట్ల వర్షమే

(ప్రతీకాత్మకచిత్రం)

(ప్రతీకాత్మకచిత్రం)

OMG:యూపీలో పోకిరోళ్లు రెచ్చిపోయారు. పార్టీ పేరుతో ఓ మహిళతో అర్ధనగ్నంగా డ్యాన్స్ చేయించారు. ఆమె డ్యాన్స్ చేస్తుంటే ఆమెపై కరెన్సీ నోట్లను వెదజల్లారు. డ్యాన్స్ చేస్తున్న మహిళ చేతిలో పిస్టోల్‌ ఉండటంతో వీడియో వైరల్ అవుతోంది.

పోకిరి కుర్రాళ్ల చేసుకునే పార్టీలు, ఫంక్షన్‌లు హద్దులు దాటిపోతున్నాయి. ఈవెంట్స్‌ పేరుతో ఫుల్‌గా మద్యం తాగడం లేడీ డ్యాన్సర్‌(Lady Dancer)‌లు, డీజే సౌండ్స్‌(DJ Sounds)‌తో పాటు మారణాయుధాలు(Lethal weapons) కూడా ఉండాల్సిందే అన్నట్లుగా మార్చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌Uttar Pradeshలో ఓ కుర్రాళ్ల బ్యాచ్‌ చేసుకున్న పార్టీలో అంతకు మించి అన్నట్లుగా రెచ్చిపోయారు. సరదా పేరుతో నిషేధిత మారణాయుధాలను తీసుకురావడం, ఆడవాళ్లతో అర్ధనగ్నంగా డ్యాన్స్‌లు చేయించడం, వాళ్లను ముట్టుకో రాని చోట, తగలకూడని ప్రదేశాల్లో టచ్ చేస్తూ వికృత ఆనందం పొందారు. అంతటితో ఆగకుండా లేడీ డ్యాన్సర్ చేతిలో పిస్టోల్(Pistol)పట్టుకొని డ్యాన్స్ చేస్తుంటే యువకుల్లో ఒకరు కరెన్సీ నోట్ల(Currency notes)ను ఆమెపై వెదజల్లాడు. మరొకడు ఆమెను దగ్గరకు తీసుకొని రొమాన్స్ చేస్తూ..శునకానందం పొందాడు. యువతి బ్యాగ్రౌండ్‌లో ప్లే చేస్తున్న భోజ్‌పూరి సాంగ్‌(Bhojpuri Song)కి లయబద్ధంగా స్టెప్స్ వేస్తూనే చేతిలో తుపాకీ పట్టుకొని యువకులకు గురి పెట్టింది. లేడీ డ్యాన్సర్లతో పోకిరోళ్లు చేస్తున్న ఎంజాయ్‌మెంట్‌ని వీడియో(Video) తీశాడు మరొక వ్యక్తి. వంకర బుద్ధి కలిగిన యువకులు కావడంతో వీడియోని ఫ్రెండ్స్‌కి షేర్ చేశారు. వాళ్లు మిగిలిన గ్రూప్‌లలో పోస్ట్ చేయడంతో వీడియో బయటకువచ్చింది. ఇదంతా హతా కొత్వాలి(KOTWALI) ప్రాంతంలోని సుక్రౌలి(Sukrauli)లోని ఖుషీనగర్‌(Kushinagar)లో జరిగినట్లుగా తెలుస్తోంది. భోజ్‌పూరి పాటకు హాఫ్ న్యూడ్‌గా డ్యాన్స్ చేస్తున్న మహిళపై నోట్ల వర్షం కురిపించిన వీడియోలో మహిళ తుపాకీ పట్టుకోవడం సంచలనంగా మారింది. వీడియో పోలీసుల వరకు చేరడంతో కేసు నమోదు చేసుకున్నారు. వీడియోలోని వ్యక్తులు, షేర్ అయిన నెంబర్ల ఆదారంగా దర్యాప్తు చేస్తున్నారు.

లేడీతో మజాక్ వొద్దమ్మా..
అమ్మాయిలతో డ్యాన్స్ చేసిన వాళ్లు ఎవరు. ఏ సందర్భంలో ఈ అశ్లీల నృత్యాలు చేయాల్సి వచ్చింది. మహిళలపై కురిపించిన నోట్ల నిజమైన డబ్బులేనా లేక ..ఫేక్ కరెన్సీనా అనే విషయంపై ఆరా తీస్తున్నారు. మరోవైపు లేడీ డ్యాన్సర్ చేతిలో ఉంది నిజమైన తుపాకేనా అనే సందేహం కూడా పోలీసుల్లో కలుగుతోంది. వీడియోలో ఉన్నవాళ్లను గుర్తించాలని ఉన్నతాధికారుల నుంచి ఒత్తిడి పెరగడంతో పోలీసులు అన్నీ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
బుల్లెట్ పేల్చిందో అంతే..

పండుగలు, వేడుకలు లేకుండా కేవలం కుర్రాళ్లు ఎంజాయ్‌మెంట్ కోసమే ఈ తరహా పార్టీలు చేసుకుంటున్న సందర్భాలు ఉత్తరప్రదేశ్‌లో ఈమధ్య కాలంలో బాగా పెరిగిపోయాయి. తాము చేసిన జల్సాను అందరితో షేర్ చేసుకోవాలని వీడియోలను తీయడం ఫ్రెండ్స్‌ గ్రూప్‌లలో షేర్ చేయడంతో వ్యవహారం రచ్చ రచ్చ అవుతోంది. చివరకు కటకటాల వెనక్కు వెళ్లాల్సిన పరిస్ధితి తలెత్తుతోంది.
Published by:Siva Nanduri
First published:

Tags: Uttar pradesh, Viral Video

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు