Home /News /trending /

VIDEO OF RAVANA EFFIGY TRAVELLING ON AMBULANCE GOES CRAZY VIRAL TWITTER IS IN SPLITS BA

Viral Video: ‘రావణుడికి కరోనా పాజిటివ్’.. ఆంబులెన్స్‌పై తరలింపు, సరదా వీడియో

ఆంబులెన్స్‌పై రావణుడి దిష్టిబొమ్మ తరలింపు (Screen Grab)

ఆంబులెన్స్‌పై రావణుడి దిష్టిబొమ్మ తరలింపు (Screen Grab)

ఇప్పటికే ఈ వీడియో కొన్ని వందల మీద ట్వీట్లు రీ ట్వీట్లు చేశారు. చాలా మంది వీడియోకు కామెంట్లు చేశారు. మొత్తానికి ఈ వీడియో సూపర్ వైరల్‌గా మారింది.

    ఇంటర్నెట్‌లో వెరైటీ వెరైటీ వీడియోలు దర్శనమిస్తుంటాయి. వాటిలో కొన్నిటిని చూస్తే ఇదేంట్రా బాబూ ఇలా ఉంది అనిపిస్తుంటుంది. కొన్ని వీడియోలు నవ్విస్తూ ఉంటాయి. మరికొన్ని కన్నీళ్లు పెట్టిస్తుంటాయి. అయితే, ఈసారి మీరు చూడబోయే వీడియో ఏ కేటగిరీకి చెందుతుందో మీరే చెప్పాలి. దసరా పండుగ కావడంతో రావణ దహనాలు చేస్తుంటారు. ఉత్తరాదిన ఈ సంస్కృతి విస్త్రుత ప్రచారంలో ఉంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా అక్కడక్కడ రావణ దహనాలు చేస్తుంటారు. అందుకోసం రావణుడి దిష్టిబొమ్మలు తయారు చేస్తారు. అలాంటి దిష్టిబొమ్మను తీసుకెళ్లిన విధానం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఓ ఆంబులెన్స్ మీద రావణుడి దిష్టిబొమ్మను తరలిస్తున్నారు. ఆంబులెన్స్‌ పైన రావణుడి దిష్టిబొమ్మను కట్టేశారు. దాన్ని తరలిస్తున్న సమయంలో మరో కారులో ఉన్న వ్యక్తి ఈ వీడియో తీశారు. ఆ వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత నందా తన ట్విటర్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. ‘2020. రావణుడు ఆంబులెన్స్ మీద కోవిడ్ ఆస్పత్రికి వెళ్తున్నాడు.’ అంటూ కామెంట్ చేశారు.



    ఒక్కసారి ఇలాంటి వీడియోలు దొరికితే నెటిజన్లు పండుగ చేసుకుంటారు. తమ క్రియేటివిటీని బయటకు తీసి ఆ వీడియోకు కామెంట్లు పెడుతూ ఉంటారు. ఐఏఎస్ అధికారి అశ్విన్ శర్మ ‘రావణుడికి కరోనా పాజిటివ్ వచ్చింది.’ అని కామెంట్ చేశారు.



    అలాంటి నెటిజన్లు పెట్టిన కొన్ని కామెంట్లు చూద్దాం.









    ఇప్పటికే ఈ వీడియో కొన్ని వందల మీద ట్వీట్లు రీ ట్వీట్లు చేశారు. చాలా మంది వీడియోకు కామెంట్లు చేశారు. మొత్తానికి ఈ వీడియో సూపర్ వైరల్‌గా మారింది.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    Tags: Dussehra 2020, Navaratri 2020, Viral Videos

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు