Home /News /trending /

VIDEO OF POLICE BEATING UP CAR DRIVER IN CHALANA CASE CHANDIGARH IS GOING VIRAL SNR

Video Viral:చండీగఢ్‌లో భీమ్లానాయక్..వైరల్ అవుతున్న వీడియో ఇదే

Photo Credit:Youtube

Photo Credit:Youtube

Video Viral:భీమ్లానాయక్ సినిమాలో విలన్ ఎంట్రీ సీన్ చండీగఢ్‌లో రిపీట్ అయింది. ఒక కారు డ్రైవర్‌ పట్ల ఇద్దరు పోలీసులు దురుసుగా ప్రవర్తించిన వీడియో విచ్చలవిడిగా వైరల్ అవుతోంది. పోలీసుశాఖకు చెడ్డపేరు తెచ్చే విధంగా ఉన్న వీడియో ఆధారంగా ఇద్దరు పోలీసులను సస్పెండ్ చేశారు చండీగఢ్‌ పోలీసు అధికారులు.

ఇంకా చదవండి ...
చండీఘడ్‌ (Chandigarh)లో భీమ్లానాయక్(Bheemla nayak)సినిమాలో విలన్ ఎంట్రీ సీన్‌ రిపీట్ అయింది. అయితే ఆ సినిమాలో విలన్ కారులో మద్యం బాటిళ్లు ఉండటం, బోర్డర్ క్రాస్ చేస్తున్న సమయంలో లిక్కర్ తరలించడం వంటి పొరపాట్లు చేస్తాడు కాబట్టి పోలీసులు కాస్త దురుసుగా ప్రవర్తిస్తారు. అతడ్ని అరెస్ట్ చేసి స్టేషన్‌కి తరలిస్తారు. కాని చండీఘడ్‌లో మాత్రం పూర్తి రివర్స్‌గా జరిగింది. దర్జాగా కారు(Car)లో వెళ్తున్న వ్యక్తిని పోలీసులు అడ్డుకున్నారు. ఏదో రూల్స్ బ్రేక్ చేశాడని చలానా (Chalana)రాశారు. అయితే అందుకు కారులో ఉన్న వ్యక్తి చలానా చెల్లించి చీటిని చింపివేయడంతో పోలీసులు(Police) కారులో కూర్చున్న వ్యక్తితో గొడవపడ్డారు. ఈమొత్తంలో సీన్‌లో కారు డ్రైవింగ్(Car driver) సీటులో కూర్చున్న వ్యక్తితో పోలీసులే కొంచెం ఓవర్‌ చేసినట్లుగా వైరల్ (viral)అవుతున్న వీడియో (video)చెబుతోంది. ఇంకా గమ్మత్తు ఏమిటంటే కారులో వ్యక్తి ట్రాఫిక్ పోలీసుల చలానా తీసుకున్నాడు. చెల్లించాడు. అయితే కారు డోర్ వేస్తూ ఏదో మాట్లాడటంతో అక్కడే ఉన్న సివిల్ పోలీసుకి కోపం వచ్చింది. అంతే కారు డోర్ తెరిచి మరీ అతడ్ని కిందకు దింపాడు. పరిస్థితి మరి ముదిరిపోవడంతో కారులో ఉన్న వ్యక్తి కూడా పోలీసులపై అంతే దూకుడుగా ప్రవర్తించాడు. ఒకరినొకరు నెట్టుకున్నారు. ఇదంతా చండీగఢ్‌లోని నడిరోడ్డుపై జరగడంతో అటుగా వెళ్తున్న కొందరు సెల్‌పోన్‌తో షూట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతే చండీగఢ్ భీమ్లానాయక్ సీన్ ఇప్పుడు దేశ వ్యాప్తంగా వైరల్ అవుతోంది.

సేమ్ టు సేమ్‌ సినిమా స్టైల్లో..
వీడియో చూస్తుంటే కారు ఓ ప్రముఖ వ్యక్తిదిగా కనిపిస్తోంది. అలాగే డ్రైవర్‌ సీటులో కూర్చున్న వ్యక్తి కూడా సాధారణ పౌరుడు కాకపోవడంతో విషయం కాస్త పెద్దది అయింది. కారులో ఉన్న వ్యక్తిని సివిల్ పోలీసుతో పాటు ట్రాఫిక్ పోలీసు ఇద్దరూ కలికి దుర్బాషలాడటం, అతనిపై చేయి చేసుకోవడం వంటివి వైరల్ అవుతున్న వీడియోలో స్పష్టంగా రికార్డయ్యాయి.
చండీగఢ్‌లో భీమ్లానాయక్..

ఫ్రెండ్లీ పోలీసింగ్ అటూ డిపార్ట్‌మెంట్ ప్రచారం చేస్తుంటే అక్కడక్కడ ఇలాంటి కొందరు కాప్స్‌ వల్ల పోలీసుశాఖకే చెడ్డపేరు వస్తోందని నెటిజన్లు తెగ మండిపడుతున్నారు. వాహనదారుడు రూల్స్ బ్రేక్ చేస్తే నడిరోడ్డుపైన పట్టుకొని కొడతారా అంటూ మరికొందరు కామెంట్స్ షేర్ చేస్తున్నారు. వీడియో చూసిన చండీగఢ్ పోలీసులు సైతం కారులో ఉన్న వ్యక్తిపట్ల ఇద్దరు పోలీసులు అనుచితంగా ప్రవర్తించినట్లుగా గుర్తించారు. పోలీసుల దురుసు ప్రవర్తన వల్లే ఇంత రాద్దాంతం జరిగిందని భావించి వీడియోలో ఉన్న ఇద్దరు పోలీసులను సస్పెండ్ చేశారు ఉన్నతాదికారులు.
Published by:Siva Nanduri
First published:

Tags: Bheemla Nayak, Chandigarh, Viral Video

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు