VIDEO OF OFFICIALS NEGLECTING PATIENTS AT AGRA DISTRICT GOVERNMENT HOSPITAL GOES VIRAL SNR
Agra: డిప్యూటీ సీఎం వస్తున్నారని అధికారులు ఆసుపత్రిలో ఎంత హడావిడి చేశారో ఈ వీడియోలో చూడండి
Photo Credit:Youtube
Uttar Pradesh:ఆకస్మిక తనిఖీ చేయడానికి డిప్యూటీ సీఎం వస్తున్నాడని తెలిసి ఆగ్రా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో అధికారులు హడావుడి చేశారు. రోగులకు కనీస సౌకర్యాలు లేవనే విషయం బయటపడకుండా జాగ్రత్తపడినప్పటికి ..మీడియా కంట పడటంతో అధికారుల ఓవర్ యాక్షన్ అందరికి తెలిసిపోయింది.
నాయకులు ఆకస్మిక తనిఖీలకు వచ్చినప్పుడు అధికారులు చేసే హడావుడి అంతా ఇంతా ఉండదు. కాని సదరు పాలకులు సైతం తనిఖీలు ముగించుకొని వెళ్లిన తర్వాత పరిస్థితులు షరా మాములే. ప్రారంభోత్సవాలు, ఆసుపత్రుల సందర్శన ఇలా ఒకటేమిటి నేతలు వస్తున్నారంటే అన్నీ సిద్ధంగా ఉంచే అధికారులు వాళ్లు వెళ్లగానే మళ్లీ మాములు పరిస్థితిని సృష్టిస్తారు. ఆగ్రాలో కూడా అదే జరిగింది. ఆగ్రా(Agra)జిల్లా ఆసుపత్రిని సందర్శించడానికి ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)ఉప ముఖ్యమంత్రిDeputy Chief Minister కేశవ్ మౌర్య(Keshav Maurya) వస్తున్నారని అధికారులకు సమాచారం వచ్చింది. అంతే ఆసుపత్రి(Hospital)లో అంతా సవ్యంగానే ఉందన్నట్లుగా పరిస్థితుల్ని చక్కదిద్దారు అధికారులు. రోగులకు ఎలాంటి ఇబ్బందులు, సమస్యలు కలగడం లేదని..అన్నీ సౌకర్యాలు బాగానే ఉన్నాయట్లుగా సీన్ క్రియేట్ చేశారు అధికారులు. డిప్యూటీ సీఎం కేశవ్ మౌర్యా వచ్చిన సమయంలో మసి పూసి మారేడుకాయ చేయాలనుకున్నారు. కాని ఆ సమయంలో ఆసుపత్రిలో స్ట్రెచర్లు(Stretchers), వీల్‌చైర్(wheelchairs)లు అందుబాటులో లేకపోవడంతో ఓ మహిళా పేషెంట్‌ని స్వయంగా తన బంధువే చేతుల్లో పట్టుకొని మోసుకువెళ్లాడు. అలాగే ఓ పసివాడు అనారోగ్యానికి గురైతే ..డాక్టర్లDoctorsకు చూపించేందుకు వచ్చిన తల్లి పరిస్థితి ఎవరూ పట్టించుకోకపోవడంతో బిడ్డను ఒడిలో పడుకోబెట్టుకొని చికిత్స కోసం ఎదురుచూస్తున్న దృశ్యాలు మీడియా(Media)కంట పడ్డాయి. రోగులే కాదు..ఓపీ విభాగం(OP section)లో కూడా రైన్లో నిల్చున్న రోగులతో పాటు కనీసం వృద్ధులు, మహిళలు, చంటి పిల్లల్ని తీసుకొని ఆసుపత్రికి వచ్చిన రోగుల కోసం ఎక్కడా బల్లాలు(Benches), కుర్చీలు (Chairs)కూడా లేకపోవడంపై రోగులు విచారం వ్యక్తం చేశారు.
పాలకులేనా రోగులను పట్టించుకోరా..
చావు, బతుకుల మధ్య ఆసుపత్రికి వైద్యం కోసం వచ్చే రోగులను కన్నెత్తి కూడా చూడని వైద్యాధికారులు, వైద్య సిబ్బంది ఆసుపత్రిని తనిఖీ చేయడానికి స్వయంగా డిప్యూటీ సీఎం వస్తున్నాడని తెలిసి అధికారులు హడావుడి చేయడం చూసి రోగులు ఆశ్చర్యపోయారు. ఉపముఖ్యమంత్రి ప్రోగ్రామ్ కవర్ చేసేందుకు వచ్చిన మీడియా ఆసుపత్రిలో మంత్రి వచ్చే ముందు...వచ్చి వెళ్లిన తర్వాత పరిస్థితులను తమ కెమెరాల్లో షూట్ చేయడంతో అధికారుల అసలు రంగు బయపడింది.
అధికారులు మారేదెప్పుడు..
ఆసుపత్రిలోని డాక్టర్లు, వైద్యాధికారులు అప్పుడప్పుడు తనిఖీలు చేసేందుకు వచ్చే నాయకులపై చూపించే భయ, భక్తులు, ముందు జాగ్రత్తలు ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని వచ్చే రోగులపై ఎందుకు చూపించరని రోగులు ప్రశ్నిస్తున్నారు. ఒక మహిళ అయితే ..తన బిడ్డను తీసుకొని రెండ్రోజులుగా ఆసుపత్రి చుట్టూ తిరుగుతున్నానని ..అయినా ఒక్కరు పట్టించుకున్న పాపాన పోలేదని అసహనాన్ని ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ మౌర్యా ఆగ్రా జిల్లా ప్రభుత్వాసుపత్రి విజిట్ సందర్భంగా అక్కడ కనిపించిన దృశ్యాలే ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
Published by:Siva Nanduri
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.