మెలికలు తిరగని పాము... నెటిజన్ల ఆశ్చర్యం... వైరల్ వీడియో...

ఆ పాము మిగతా పాముల లాగా లేదు. అన్ని పాములూ మెలికలు తిరుగుతూ వెళ్తాయి... అది మాత్రం స్ట్రైట్‌గా వెళ్తోంది. అందుకే ఆ వీడియో వైరల్ అయ్యింది.

news18-telugu
Updated: May 16, 2020, 8:33 AM IST
మెలికలు తిరగని పాము... నెటిజన్ల ఆశ్చర్యం... వైరల్ వీడియో...
మెలికలు తిరగని పాము... నెటిజన్ల ఆశ్చర్యం... వైరల్ వీడియో... (credit -reddit - r/WTF)
  • Share this:
మనకు కాళ్లు ఉంటాయి కాబట్టి... నడుస్తూ వెళ్తాం. మరి పాములకు కాళ్లు ఉండవు కదా... కాబట్టి... అవి... అటూ ఇటూ కదులుతూ... ముందుకు వెళ్తాయి. మరోలా చెప్పాలంటే... అలా అటూ ఇటూ కదలకపోతే... పాములు ముందుకు వెళ్లలేవు. ఉన్నచోటే ఉంటాయి. కానీ... ఆ పాము మాత్రం... తిన్నగా ఉంటూ... వంకర్లు తిరగకుండానే ముందుకు వెళ్తోంది. అటూ ఇటూ కదిలితే... కొంపలు మునుగుతాయి అన్నట్లుగా ఆ పాము... చాలా తెలివిగా ముందుకు సాగుతోంది. "అదెలా సాధ్యం... భలే వెళ్తోందే... ఆర్నీ... దీని బండబడ"... అని అనుకుంటున్నారు నెటిజన్లు ఆ వీడియో చూసి.

ఓ రోడ్డుపై ఈ పాము ఇలా వెళ్తుండటం చూసి... మనలాగే ఆశ్చర్యపోయి... వీడియో తీశారో నెటిజన్. రెడ్డిట్‌లో అప్‌లోడ్ చేశారు. మొత్తం 17 సెకండ్ల వీడియోని... నెటిజన్లు మళ్లీ మళ్లీ ప్లే చేసి చూస్తున్నారు. ఎన్నిసార్లు చూస్తున్నా... ఏదో తేడా కొడుతోందనే ఫీలింగ్. పాము అలా వెళ్లలేదే... ఇదెలా సాధ్యం అన్న ప్రశ్నే మళ్లీ మళ్లీ వెంటాడుతోంది.

A non slithering snake from r/WTF


కొంతమంది దీనికో సైంటిఫిక్ కారణం చెప్పారు. పాములు ఇలా వెళ్లడాన్ని రెక్టిలైనియర్ మోషన్ (rectilinear motion) అంటారని చెబుతున్నారు. అంటే... గొంగళిపురుగులాగా అన్నమాట. గొంగళిపురుగు... తిన్నగా వెళ్లడానికి కారణం... దాని బాడీలో కండరాలు... తిన్నగా కదులుతాయి. ఇప్పుడు ఈ పాములో కూడా కండరాలు... తిన్నగా కదులుతున్నాయని, అది అంగుళం, అంగుళం ముందుకు వెళ్తోందని అంటున్నారు. ఏది ఏమైతేనేం... నెటిజన్లకు కాసేపు... ఇదో పరీక్షలా మారి... టైమ్ పాస్ చేస్తోంది.
Published by: Krishna Kumar N
First published: May 16, 2020, 8:33 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading