Home /News /trending /

VIDEO OF NEWLYWEDS RUNNING AFTER FLAMES GOES VIRAL ON SOCIAL MEDIA SNR

Video Viral: వెరైటీ వెడ్డింగ్ ఫోటో షూట్..ఒంటికి మంటలు అంటించుకున్న జంట వైరల్ అవుతున్న వీడియో

(Photo Credit:Twitter)

(Photo Credit:Twitter)

Videi Viral:పెళ్లి వేడుకల్లో వింతలు, విచిత్రాలు జరుగుతుంటాయి. కాని ఓ పెళ్లిలో వధు,వరులే వెరైటీగా ఆలోచించారు. వాళ్ల వింత కోరిక తీర్చుకునేందుకు చేసిన ప్రయత్నం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ప్రపంచానికి తెలియని ఎన్నో వింతలు, చాలా విచిత్రాలు, చిత్ర విచిత్రమైన మనుషులను సోషల్ మీడియా వెలుగులోకి తెస్తోంది. కొందరు చేసే చర్యలు, వాటికి సమాజంలోని వ్యక్తులు స్పందిస్తున్న తీరు చాలా కొత్తగా ఉంటోంది. రీసెంట్‌గా ట్విట్టర్‌(Twitter)‌లో ఓ వెడ్డింగ్‌ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియో(Video)లో ఉన్న గొప్పతనం ఏమిటంటే ..నూతన వధు,వరులు ఒకరి చేతులు ఒకరు పట్టుకొని శరీరం వెనుక భాగం అంటే వీపు వైపు మంటలు అంటించుకొని నడుచుకుంటూ వస్తుంటారు. ఆ నవదంపతులను ఓవైపు ఫోటో గ్రాఫర్స్ (Photographers)ఫోటోలు ..తమ వెడ్డింగ్‌(Wedding)సెర్మనీకి వచ్చిన గెస్ట్‌లు రెండు వైపుల నిల్చొని మంటలు ఎగసిపడుతుంటే నడుచుకుంటూ వస్తున్న నూతన దంపతులను చూస్తుంటారు. కేవలం నిమిషం నిడివి కలిగిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా(Social media)లో తెగ చక్కర్లు కొడుతోంది. కొత్త పెళ్లి చేసుకున్న జంట అలా మంటల్లో ఒంటికి అగ్గిరవ్వలు అంటికొని మంటలు ఎగసిపడుతుంటే నవ్వుకుంటూ రావడం అందర్ని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ వింత పెళ్లి ఎక్కడ జరిగింది...వధువరుల పేర్ల సంగతి పక్కనపెడితే వీడియో వస్తున్నంత సేపు పెళ్లి చూసేందుకు వచ్చిన వాళ్లంతా ముక్కున వేలేసుకున్నారు. మరోవైపు మంటలు ఎగసిపడుతుంటే పరుగులు పెడతూ వస్తున్న జంట వెనుక మంటలు ఆర్పే గ్యాస్‌ సిలెండర్‌ పట్టుకొని ఓ వ్యక్తి ఫాలో అయ్యాడు.

వీళ్లెక్కడి మనుషులురా బాబు..
చూడటానికి ఒకింత భయాన్ని కలిగించే విధంగా ఉన్న ప్రమాదకరమైన వెడ్డింగ్ వీడియోని ట్విట్టర్‌లో అజయిత అనే హిమాచల్‌ ప్రదేశ్‌కి చెందిన డాక్టర్ షేర్ చేశారు. వీడియోని షేర్ చేస్తూ ఆమె పెట్టిన కామెంట్‌ అందరికి నవ్వులు తెప్పించే విధంగా ఉంది. వైవాహిక జీవితానికి సిద్ధం కావడానికి ఇది ఒక మార్గం అని నేను అనుకుంటున్నాను అంటూ కామెంట్ షేర్ చేసింది డాక్టర్ అజయిత.

నెట్టింట్లో వైరల్ ..
వెరైటీగా పెళ్లి చేసుకోవాలన్న నూతన జంట క్రియేటివిపై ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. అగ్గిమంటలు అంటించుకొని నడుచుకుంటూ స్టిల్స్ ఇవ్వాలనుకున్న నూతన వధువరులను ఉద్దేశిస్తూ సెటైర్లు వేస్తున్నారు. వెటకారం కామెంట్లను షేర్ చేస్తున్నారు.

కాంట్రవర్సీ వీడియో..
పెళ్లి చేసుకోవడం అగ్గిరాజుకోవడం లాంటిదని దాన్ని ఎంత తప్పించుకోవాలని పరిగెత్తినా తప్పించుకోలేరని కొందరు కామెంట్స్ చేస్తే మరికొందరు పెళ్లి కొడుకు చాలా ధైర్యవంతుడు పెళ్లి చేసుకోవడమే సాహసం అయితే అలా మంటలు అంటించుకొని నడవడం రెండో సాహసం అంటూ చలోక్తులు వేస్తున్నారు.

ఫుల్ ట్రోలింగ్..
మరో నెటిజన్ ఇద్దరూ పిచ్చొళ్లనుకుంటా అని కామెంట్ షేర్ చేశాడు. మరో అమ్మాయి అంత సరదా తీర్చుకోవాలనుకుంటే డూప్ చేయవచ్చకదా అంటే దానికి మరో యువకుడు రీట్వీట్ చేశాడు. డూబ్‌ కాదు..మంటలు అంటించుకొని పరిగెత్తే బదులు నడుచుకుంటూ వెళ్తే పీడా వదిలేది అన్నట్లుగా జోక్స్ పేల్చుకుంటున్నారు. ఎవరు ఏ కామెంట్స్ చేస్తున్నా...వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.
Published by:Siva Nanduri
First published:

Tags: Viral Video, Wedding

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు