హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Viral Video: బైక్‌తో పాటు మనిషిని ఎత్తేశారు.. వైరల్‌గా మారిన వీడియో.. ఏం జరిగిందంటే..

Viral Video: బైక్‌తో పాటు మనిషిని ఎత్తేశారు.. వైరల్‌గా మారిన వీడియో.. ఏం జరిగిందంటే..

(Image-ANI)

(Image-ANI)

నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలపై చర్యలు తీసుకునే క్రమంలో ట్రాఫిక్ పోలీసుల కొన్నిసార్లు విమర్శల పాలవుతున్నారు.

నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలపై చర్యలు తీసుకునే క్రమంలో ట్రాఫిక్ పోలీసుల కొన్నిసార్లు విమర్శల పాలవుతున్నారు. తాజాగా నాన్‌ పార్కింగ్ జోన్‌లో నిలిపిన వాహనాలను తొలగిస్తున్న సిబ్బంది.. క్రేన్ సాయంతో బైక్‌ను తొలగించే ప్రయత్నం చేశారు. అయితే బైక్‌ను అక్కడి నుంచి తొలగించే సమయంలో.. ఓ వ్యక్తి బైక్‌పై ఉన్నాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఘటన మహారాష్ట్రలోని పుణెలో చోటుచేసుకుంది. వివరాలు.. గురువారం సాయంత్రం పుణెలోని నానాపేత్ ప్రాంతంలో సమర్త్ బ్రాంచ్ ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు చేపట్టారు. నో పార్కింగ్ జోన్ల‌లో ఉన్న వాహనాలను టోయింగ్‌ వాహనంలోకి ఎక్కిస్తున్నారు.

ఇందులో సమర్త్ బ్రాంచ్‌కు చెందిన ట్రాఫిక్ పోలీసుతో పాటు కాంట్రాక్ట్ సిబ్బంది పాల్గొన్నారు. అయితే వారు ఓ బైక్‌ను తొలగిస్తున్న సమయంలో.. దాని యజమాని అక్కడి చేరుకుని పోలీసుల చర్యను అడ్డుకున్నాడు. బైక్‌ వాహనంలోకి ఎక్కిస్తున్న సమయంలో దానిపైనే కూర్చున్నాడు. బైక్ పై నుంచి కిందకు దిగాల్సిందిగా కోరినప్పటికీ అతడు వినలేదు. అయితే ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో నెటిజన్లు.. పోలీసుల చర్యపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


ఇందుకు సంబంధించి డిప్యూటీ పోలీస్ కమిషనర్(ట్రాఫిక్) రాహుల్ శ్రీరామ్ స్పందిస్తూ.. టోయింగ్ వ్యాన్‌లోని బైక్‌ను ఎక్కించిన తర్వాత ఈ ఘటన జరిగిందని అన్నారు. బైక్‌పై దాని యజమాని ఎక్కే సమయానికే పూర్తిగా ఎత్తివేయబడిందని చెప్పారు. సిబ్బంది ఎన్నిసార్లు అభ్యర్థించిన అతడు పట్టించుకోలేదని తెలిపారు. ఈ క్రమంలోనే బైక్‌ను, అతడితోపాటుగా వ్యాన్ క్యారేజ్‌పై ఉంచబడిందన్నారు. మరోవైపు బైక్‌ యజమాని క్షమాపణ చెప్పాడని, జరిమానా చెల్లించాడని చెప్పారు. కాంట్రాక్ట్ సిబ్బందితో పాటు, అక్కడే ఉన్న ట్రాఫిక్ పోలీస్‌పై చర్యలకు ఆదేశించినట్టుగా తెలిపారు.

First published:

Tags: Pune, Traffic police, Viral Video

ఉత్తమ కథలు