హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

అక్కడ భూత, ప్రేత, పిశాచాలున్నాయంటా..వాళ్లు నిద్రపోతే ఒట్టు

అక్కడ భూత, ప్రేత, పిశాచాలున్నాయంటా..వాళ్లు నిద్రపోతే ఒట్టు

Photo Credit: Youtube

Photo Credit: Youtube

Fear of the Devil: ఉత్తర ప్రదేశ్‌లో భూత ప్రేత పిశాచాలు సంచరిస్తున్నాయని స్థానికులు వణికిపోతున్నారు. పోలిక లేని ఆకారం కాలనీలోని ఒక ఇంటి నుంచి మరొక ఇంటికి వెళ్తున్నట్లుగా సీసీ కెమెరాలో రికార్డైందని రాత్రి వేళల్లో ఇళ్ల నుంచి బయటకు రావడం లేదు.

ఇంకా చదవండి ...

అరచేతిలోంచే ప్రపంచాన్ని చూస్తున్న ఈ రోజుల్లో దెయ్యాలు, భూతాలు ఉన్నాయనే భయం ఇంకా ప్రజల మదిలోంచి పోవడం లేదు. అందుకే రాత్రి వేళల్లో ఏ వింత ఆకారం కనిపించినా, లేక ఏదైనా శబ్ధం వినిపించినా అది ఖచ్చితంగా దెయ్యమనే భావిస్తున్నారు. ఇలాంటి వార్తలు చెప్పడానికి కాస్త విచిత్రంగా ఉన్నప్పటికి ఉత్తరప్రదేశ్‌(Uttar Pradesh)లో జరిగిన ఘటన మాత్రం స్థానికుల్ని రాత్రి పూట నిద్రపోనివ్వడం లేదు. ఆజంగఢ్‌(Azamgarh)లోని కోల్‌ఘాట్‌(Kolaghat)ప్రాంతంలో కొద్ది రోజులుగా వింత ఆకారం కాలనీలోని ఇళ్ల మధ్య కనిపిస్తోందని ప్రచారం జరుగుతోంది. మొదట్లో ఇదంతా పుకార్లని కొట్టిపారేశారు స్థానికులు. రాజు శ్రీవాత్సవ (Raju srivastav)అనే వ్యక్తి ఇంటి దగ్గర ఏర్పాటు చేసిన సీసీ ఫుటేజ్‌(Cc footage)ని పరిశీలించిన స్థానికులు ఇప్పుడు రాత్రి వేళల్లో జాగారం చేస్తున్నారు. ఎందుకంటే రాజు శ్రీవాత్సవ ఇంటి సమీపంలో ఓ తెల్లటి ఆకారం సీసీ కెమెరా(Cc camera)లో రికార్డైంది. సుమారు 30సెకన్లు (30 Seconds video)మాత్రమే ఉన్న ఆ వీడియోని చూసిన జనం భయంతో వణికిపోతున్నారు. ఖచ్చితంగా అది దెయ్యమని అపోహ పడుతున్నారు. సాయంత్రం అయిందే చాలు ఏ నీడ కనిపించినా దెయ్యమని వణికిపోతున్నారు. రాత్రి వేళల్లో అయితే ఇంటి గడప దాటడం లేదు.

నీడను చూస్తే చాలు నిద్రపోని జనం..

ఉత్తరప్రదేశ్‌ అజంగఢ్Azamgarh జిల్లా కోల్‌ఘాట్‌లో బయటపడిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా తెగ వైరల్ అయింది. దీంతో చీకటి పడుతోందంటే చాలు అటువైపు వెళ్లేందుకు చుట్టుపక్కల ప్రాంతాల్లో నివసించే వాళ్లు సైతం భయపడుతున్నారు. నిజంగా తమ ప్రాంతంలో ఏవైనా దెయ్యాలు, భూతాలు ఉన్నాయేమో కనిపెట్టమని స్థానికులు అధికారుల్ని వేడుకుంటున్నారు. ఇలాంటి భయాందోళన పరిస్థితుల మధ్య ఇల్లు కదల్లేకపోతున్నామని, ఏవైనా పనులు ఉన్నా బయటకు వెళ్లడానికి భయపడుతున్నామని చెబుతున్నారు.

భూత,ప్రేత, పిశాచాలున్నాయని వదంతులు..

వాస్తవంగా రాజు శ్రీవాత్సవ అనే వ్యక్తి ఇంటి దగ్గరున్న సీసీ కెమెరాలో రికార్డైన ఫుటేజ్‌లో ఎలాంటి భూతము, దెయ్యము లేదంటున్నారు అధికారులు. ఎవరో వ్యక్తి నడుచుకుంటూ వెళ్తున్నట్లుగానే ఉందని చెబుతున్నారు. అధికారులు ఎన్ని విధాలుగా చెప్పినప్పటికి స్థానికులు మాత్రం మేం రాత్రి 7గంటలు దాటితే ఇంట్లోంచి బయట అడుగుపెట్టలేకపోతున్నామంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మాలో ఎవరినైనా భూతం పట్టుకుంటే ఎవరు కాపాడతారంటూ అమాయకంతో కూడిన భయాన్ని బయటపెడుతున్నారు. ఇంతకీ అక్కడ సీసీ కెమెరాలో రికార్డైన దృశ్యం వ్యక్తిదా లేక ఏదైనా గాలివాటానికి వచ్చిన ఆకారమా అని కనుగొనే పనిలో పడ్డారు అధికారులు.

First published:

Tags: Up news, Viral Video

ఉత్తమ కథలు