హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Viral Video : అతడికి ఆదిపురుష్ లో అవకాశం ఇవ్వాల్సిందేనంటున్న నెటిజన్లు!

Viral Video : అతడికి ఆదిపురుష్ లో అవకాశం ఇవ్వాల్సిందేనంటున్న నెటిజన్లు!

రావణుడి గెటప్ లో వ్యక్తి డ్యాన్స్

రావణుడి గెటప్ లో వ్యక్తి డ్యాన్స్

Viral Video : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas)నటిస్తున్న 'ఆది పురుష్‌' టీజర్‌ ఆదివారం(అక్టోబర్‌ 2,2022) సాయంత్రం విడుదలైన విషయం తెలిసిందే.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Viral Video : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas)నటిస్తున్న 'ఆది పురుష్‌' టీజర్‌ ఆదివారం(అక్టోబర్‌ 2,2022) సాయంత్రం విడుదలైన విషయం తెలిసిందే. అక్టోబర్ 2న అయోధ్య వేధికగా జరిగిన ఆది పురుష్(Adipurush)ఈవెంట్‌లో టీజర్‌ను విదుదల చేసినప్పటి నుంచి మిలియన్ల వ్యూస్‌ వచ్చాయి. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఆది పురుష్‌ సినిమాలో రామాయణాన్ని కొత్తగా చూపించేందుకు డైరెక్టర్‌ ఓం రౌత్ ప్రయత్నిస్తున్నాడు. విడుదలైన టీజర్‌ చూడటానికి బాగున్నప్పటికీ నెట్టింట విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి కారణం టీజర్ లో విజువల్ ఎఫెక్ట్స్‌ ఎక్కువగా ఉండటమే అందుకు ప్రధాన కారణం. చూసేందుకు కార్టూన్‌ మువీలా ఉందని, యానిమేషన్‌, బ్యాక్‌ గ్రౌండ్‌ గ్రాఫిక్స్ మేకర్స్‌ను నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.

ముఖ్యంగా, ఆదిపురుష్‌లో రావ‌ణాసురుడిగా సైఫ్ ఖాన్ లుక్‌ సోష‌ల్ మీడియాలో ట్రోలింగ్ అవుతున్న నేప‌ధ్యంలో ఓ వ్య‌క్తి రావ‌ణుడి గెట‌ప్‌లో డ్యాన్స్ చేస్తున్న వీడియో సోష‌ల్ మీడియాలో ప్ర‌స్తుతం తెగ వైర‌ల‌వుతోంది.  రావ‌ణుడి వేషంలో వ్య‌క్తి వీధుల్లో ఓ పాట‌కు అనుగుణంగా డ్యాన్స్ చేస్తుండ‌టం ఈ వీడియోలో క‌నిపించింది. హ‌ర్యాన్వి పాటకు ఆ వ్య‌క్తి డ్యాన్స్ చేస్తుండ‌గా ఫ్యాన్సీ డ్రెస్‌లో మ‌రో వ్య‌క్తి అత‌డితో క‌లిసి చిందేశాడు. రావ‌ణుడి వేషంలో ఉన్న వ్య‌క్తి డ్యాన్స్ మూమెంట్స్‌కు నెటిజ‌న్లు ఫిదా అయ్యారు.

Sonia In Bharat Jodo Yatra : పాదయాత్రలో సోనియా 'షూ' లేస్ కట్టిన రాహుల్ గాంధీ

ద‌స‌రా రోజున ఈ వీడియోను సోష‌ల్ మీడియాలో అప్‌డేట్ చేశారు. ఆదిపురుష్‌లో సైఫ్ స్ధానంలో రావ‌ణుడిగా ఇత‌డిని తీసుకోండ‌ని, ఆదిపురుష్ సినిమాలో ఇత‌డ‌ని కూడా చేర్చుకోవాల‌ని నెటిజన్లు తమ అభిప్రాయాలను సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేశారు.

Published by:Venkaiah Naidu
First published:

Tags: Adipurush movie, Viral Video

ఉత్తమ కథలు