Viral: అమర జవాను తల్లిపై డాక్టర్ ఔదార్యం.. ఆమెకు ఉచిత చికిత్స.. సర్వత్రా ప్రశంసలు

దేశ రక్షణ కోసం మన జవాన్లు వారి ప్రాణాల్ని సైతం లెక్కచేయకుండా పనిచేస్తున్నారు. వారికోసం మనం ఎంత చేసినా తక్కువే. సైనికులు, వారి కుటుంబసభ్యులు ఆపదలో ఉన్నప్పుడు వారికి సేవ చేయడమనేది వారి గౌరవించడం లాంటిదే. అలాంటి పనే చేసే అందరి చేత ప్రశంసలందుకుంటున్నాడో మహారాష్ట్ర డాక్టర్...

news18
Updated: November 3, 2020, 12:42 PM IST
Viral: అమర జవాను తల్లిపై డాక్టర్ ఔదార్యం..  ఆమెకు ఉచిత చికిత్స.. సర్వత్రా ప్రశంసలు
  • News18
  • Last Updated: November 3, 2020, 12:42 PM IST
  • Share this:
దేశ రక్షణ కోసం మన జవాన్లు వారి ప్రాణాల్ని సైతం లెక్కచేయకుండా పనిచేస్తున్నారు. వారు తమ తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు దూరమై దేశ రక్షణలో నిమగ్నమవుతున్నారు. అటువంటి సైనికులకు మనం ఎంత చేసినా తక్కువే, ఎందుకంటే వారి త్యాగాల వల్లే మనం దేశంలో సురక్షితంగా జీవించగలుగుతున్నాం. అయితే, వారి త్యాగాన్ని గుర్తించేవారు కొందరే ఉంటారు. సైనికుల  త్యాగాన్ని గుర్తించడమంటే వారికి సాల్యూట్ చేస్తేనే సరిపోదు. వారికి అవసరమైన సమయంలో మనమున్నాం అంటూ నిరూపించే మనస్తత్వం కొందరికే ఉంటుంది. అటువంటి వారిలో ఒకరు జౌరంగాబాద్లోని మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో యూరాలజిస్ట్ గా పనిస్తున్న డాక్టర్ అల్తాఫ్ షేక్.

వివరాల్లోకి వెళ్తే జౌరంగాబాద్ పరిధిలోని జల్నా జిల్లా పరేడ్ పట్టణానికి చెందిన ఒక జవాను జమ్ము కశ్మీర్లో సైనికునిగా విధులు నిర్వహిస్తూ ఏడు సంవత్సరాల క్రితం అమరుడయ్యాడు. ఆ తరువాత ఆ కుటుంబం తీవ్ర ఆర్థిక కష్టాల్లో మునిగిపోయింది. ఈ క్రమంలో జవాను తల్లి శాంతాబాయికి మూత్రపిండాలల్లో రాళ్లు ఏర్పడటంతో శస్త్ర చికిత్స చేసుకోవాల్సి వచ్చింది. కానీ కుటుంబ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఆమె వైద్యం చేయించుకునే పరిస్థితి లేదు.

ఈ విషయం తెలుసుకున్న జౌరంగాబాద్ లోని ఐకాన్ మల్టీస్పెషాలిటీ ఆసుపత్రిలో యూరాలజిస్ట్ గా పనిచేస్తున్న డాక్టర్ అల్తాఫ్ షేక్ ఆసుప్రత్రి యాజమాన్యంతో మాట్లాడి ఆమెకు విజయవంతంగా ఉచిత శస్త్ర చికిత్స చేశారు. శస్త్ర చికిత్స అనంతరం ఆమె కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యింది. ఈ సమయంలో భావోద్వేగానికి గురైన శాంతాబాయి కన్నీటి పర్యంతమై ఉచితంగా శస్త్రచికిత్స చేసిన డాక్టర్ను హృదయానికి హత్తుకొని కృతజ్ఞతలు తెలిపింది. అంతేకాక, నాలుగు కాలాల పాటు చల్లగా ఉండమని డాక్టర్ను ఆశీర్వదించింది.

మహారాష్ట్ర మంత్రి అశోక్ చవాన్ ప్రశంసలు..
ఈ సందర్భంలో తీసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. డాక్టర్ అల్తఫ్ షేక్ చేసిన గొప్ప పనికి రాజకీయ నాయకులతో పాటు ప్రజల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియోను చూసిన మహారాష్ట్ర పిడబ్ల్యుడి మంత్రి, కాంగ్రెస్ నాయకుడు అశోక్ చవాన్ ఆ వీడియోను రీట్వీట్ చేయడమే కాకుండా ఆయనను పిలిచి అతను చేసిన గొప్ప పనిని ప్రశంసించారు.

దీనిపై డాక్టర్ అల్తాఫ్ షేక్ మాట్లాడుతూ, మన కోసం మన దేశం కోసం ఆమె కుమారుడు ప్రాణాలర్పించాడు. అతని త్యాగానికి మనం ఎంత చేసినా రుణం తీర్చుకోలేం. కానీ ఓ సైనికుడిని కని, పెంచి పెద్దచేసి దేశానికి అప్పగించిన ఆ తల్లి వైద్యం చేయించుకోలేని దుస్థితిలో ఉండటం చాలా దురదృష్టకరం, విచారకరం. అందువల్ల, ఆ తల్లికి చేతనైన సహాయం చేయడం నా బాధ్యతగా భావించాను. అది నా బాధ్యతే కాదు నా అదృష్టం కూడా.”అని అన్నారు. కాగా డాక్టర్ చేసిన గొప్ప పనిని గుర్తించిన యువసేన ఆయన్ని సత్కరించింది.
Published by: Srinivas Munigala
First published: November 3, 2020, 11:15 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading