హ్యాపీ ఫ్రెండ్షిప్ డే... సీల్ చేప కోసం వెతికిన హార్న్ బిల్ పక్షి... సూపర్ వైరల్ వీడియో

Happy Friendship Day 2020 : నెటిజన్లే కాదు... జూకి వచ్చిన సందర్శకులు కూడా ఆ పక్షి పరిగెడుతూ రావడం చూసి ఆశ్చర్యపోయారు. అసలా సీల్ చేపకూ, పక్షికీ ఉన్న సంబంధమేంటి?

news18-telugu
Updated: August 2, 2020, 12:12 PM IST
హ్యాపీ ఫ్రెండ్షిప్ డే... సీల్ చేప కోసం వెతికిన హార్న్ బిల్ పక్షి... సూపర్ వైరల్ వీడియో
హ్యాపీ ఫ్రెండ్షిప్ డే... సీల్ చేప కోసం వెతికిన హార్న్ బిల్ పక్షి... సూపర్ వైరల్ వీడియో (credit - twitter)
  • Share this:
Happy Friendship Day 2020 : అమెరికా రాష్ట్రం ఒరెగాన్‌లో జరిగింది మనం కళ్లతో చూస్తే తప్ప నమ్మలేని ఈ ఘటన. మనం అప్పుడప్పుడూ చూస్తూ ఉంటాం. వేర్వేరు ప్రాణుల మధ్య ఉన్న అనుబంధాన్ని. అదే విధంగా... జుబేరీ అని పిలిచే హార్న్ బిల్ పక్షి... ఓ సీల్ చేప కోసం జూలో అటూ ఇటూ వెతికింది. చివరకు... సీల్ చేపలు ఉండే ఎన్‌క్లోజర్ ఎక్కడుందో కనిపెట్టింది. అధికారులను తప్పించుకొని... ఎన్‌క్లోజర్‌లోకి వెళ్లింది. తీరా అక్కడికి వెళ్లాక... చాలా సీల్ చేపలు కనిపించాయి. వాటిలో తాను వెతుకుతున్న సీల్ ఏది అని కాసేపు గమనించింది. అప్పుడు ఓ సీల్ చేప తనవైపు రావడాన్ని చూసింది. అదే తాను వెతుకుతున్న సీల్ అని గుర్తించి... ఆనందంతో కేకలు పెట్టింది. ఇదంతా జూ అధికారులు వీడియో తీశారు. ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌ను ఓ రేంజ్‌లో కుదిపేస్తోంది.


ఇప్పటికే ఈ క్యూట్ వీడియోకి... 2.35 లక్షల వ్యూస్ వచ్చాయి. 14వేల మందికి పైగా లైక్ చేశారు. చాలా మంది ఈ వీడియో చాలా బాగుందని అంటున్నారు. అలా ఓ పక్షి సీల్ చేపను చూసేందుకు రావడమేంటని అంతా ఆశ్చర్యపోతున్నారు.




ఆ సీల్ చేపకూ... హార్న్‌బిల్‌కీ మధ్య స్నేహం ఎలా కుదిరిందో తమకూ తెలియదంటున్నారు జూ అధికారులు. అది పరిగెడుతుంటే... అసలు ఎక్కడికి వెళ్తుందో చూద్దామని ఊరుకుంటే... చివరకు అది సీల్స్ ఎన్‌క్లోజర్‌లోకి వెళ్లిందని చెప్పారు. స్నేహం ఎలా ఏర్పడితేనేం... అది నిస్వార్థమైనదని ఈ పక్షి మరోసారి నిరూపించింది. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే.
Published by: Krishna Kumar N
First published: August 2, 2020, 12:12 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading