హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Video Viral:అక్కడ అమ్మాయిలను వెంటపడి వేధిస్తే..ఎలా ఉంటుందో ఈ వీడియో చూడండి

Video Viral:అక్కడ అమ్మాయిలను వెంటపడి వేధిస్తే..ఎలా ఉంటుందో ఈ వీడియో చూడండి

Photo Credit:Youtube

Photo Credit:Youtube

Video Viral:ఆడపిల్లలు కదా వెంటపడి విసిగించినా ఏం చేయలేరు అనున్నాడు. పది రోజులుగా వాళ్లను ఫాలో అవుతూ బస్టాండ్‌లో వెకిలి చేష్టలతో వేధించాడు. పోకిరి చేష్టలతో విసుగుచెందిన అమ్మాయిలు కుటుంబ సభ్యుల్ని పిలిపించి నడిరోడ్డుపై చెప్పుతో కొట్టి పోలీసులకు అప్పగించారు.

ఇంకా చదవండి ...

అమ్మాయిల వెంటపడి వేధించే పోకిరిలకు తగిన గుణపాఠం చెప్పారు ఇద్దరు బాలికలు. కాలేజీకి వెళ్తున్న అమ్మాయిలను ఓ పోకిరి రోజూ ఫాలో అవుతూ బస్టాండ్‌ వరకు వెనుక వెళ్లడం అక్కడ తుంటరి చేష్టలు, వెకిలి మాటలతో విసిగిస్తూ వచ్చాడు. ఇద్దరు అమ్మాయి (Two girls)ల్లో ఓ యువతి చెంపపై టచ్ చేయడంతో ఇద్దరూ పోకిరికి బుద్ధి చెప్పాలని డిసైడ్ అయ్యారు. విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పారు. ఈనెల 26వ తేదిన ఇద్దరు అమ్మాయిల్లో ఓ అమ్మాయి తండ్రితో పాటు సోదరుడు వచ్చి బస్టాండ్‌ (Busstand‌)లో నిల్చున్నారు. కాలేజీ అమ్మాయిల వెంటపడుతున్న యువకుడు యధావిధిగా వచ్చి ఆమెను ఫాలో అయి కామెంట్ చేస్తుండగానే పోకిరి(Teenager)ని పట్టుకున్నారు. బస్టాండ్‌లో అందరూ చూస్తుండగానే ఇద్దరు బాలికలు చెప్పు(Slapping)తో కొట్టారు. మరోవైపు బాలిక తండ్రి, సోదరుడు అమ్మాయిల్ని వేధిస్తున్న పోకిరిని గట్టిగా పట్టుకోవడంతో అమ్మాయిలు ఇద్దరూ చెప్పులతో చెంపలు పగలగొట్టారు. ఓ యువకుడ్ని ఇద్దరు పట్టుకుంటే మరో ఇద్దరు అమ్మాయిలు చెప్పులతో కొట్టడంతో రోడ్డుపైన చూస్తున్న వాళ్లంతా సెల్‌ఫోన్లలో షూట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వీడియో వైరల్ (Video viral)అవుతోంది. ఈ ఘటన ఈనెల 26వతేదిన హర్యానా(Haryana)లోని సోనిపట్(Sonipat)జిల్లా గోహనా (Gohana)లో జరిగింది.

అమ్మాయిల వెంటపడితే అంతే..

చదువుకునేందుకు రోజూ పల్లెటూరి నుంచి గోహనాకు వెళ్తున్నారు ఇద్దరమ్మాయిలు. గత వారం రోజులు ఓ పోకిరోడు..ఇద్దరమ్మాయిల్లో ఒకరిని వెంటపడుతూ వేధించసాగాడు. ప్రేమించమంటూ పిచ్చిగా మాట్లాడటంతో బాలికలు ఇద్దరూ తమ తండ్రి, సోదరుడి సాయంతో ప్లాన్ ప్రకారం ఈనెల 26వ తేదిన గోహనా బస్టాండ్‌లో పట్టుకొని పిచ్చికొట్టుడు కొట్టారు. దేహశుద్ధి చేసిన అనంతరం డయల్ 112 నెంబర్‌కి ఫోన్ చేసి పోకిరీ వేదవను పోలీసులకు అప్పగించారు. హర్యానాలో అమ్మాయిలను వేధించే వాళ్ల పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఇష్టం లేదని చెప్పినా ప్రేమ, పెళ్లి అంటూ వెంటపడే పోకిరిలకు తగిన గుణపాఠం చెబుతున్నారు. గొహనాలో యువకుడి చేష్టలతో విసిగిపోయిన బాలికలు మరొకరు ఈవిధంగా అమ్మాయిల్ని టార్చర్  పెట్టకుండా ఉండేందుకు ఇలా పబ్లిక్‌లో పనిష్మెంట్ ఇచ్చారు. నడిరోడ్డుపై చెప్పులతో చెంపపై కొట్టి యువకుడి పరువుతీశారు.


వైరల్ అవుతున్న వీడియో..

అమ్మాయిల వెంటపడుతూ వేధిస్తున్న యువకుడ్ని స్టేషన్‌కి తీసుకెళ్లారు పోలీసులు. బాధిత బాలికల తల్లిదండ్రులతో పాటు యువకుడి పేరెంట్స్‌ని స్టేషన్‌కి పిలిపించారు. యువకుడు తప్పైందని చెప్పడంతో బాలిక తల్లిదండ్రులు కేసు పెట్టవద్దని పోలీసులను కోరారు. ఇకపై ఇలాంటి పోరంబోకు చేష్టలు చేయవద్దని పోలీసులు యువకుడికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు.

First published:

Tags: Haryana, Viral Video

ఉత్తమ కథలు