హోమ్ /వార్తలు /trending /

RRR MANIA:రాజమౌళి చేసిన మాయకు ప్రేక్షకుల రియాక్షన్ ఏలా ఉందో మీరే చూడండి..

RRR MANIA:రాజమౌళి చేసిన మాయకు ప్రేక్షకుల రియాక్షన్ ఏలా ఉందో మీరే చూడండి..

RRR MANIA:ట్రిపులార్ సినిమా సక్సెస్‌ అదో లెవెల్ అన్నట్లుగా ఉంది. తెలుగు, తమిళ, హిందీ భాషలే కాదు నేపాల్‌, సేలంలో కూడా ఆర్ఆర్ఆర్ సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్లలో ఫ్యాన్స్ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఆ వీడియోలు నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతున్నాయి.

ఇంకా చదవండి ...

  రామ్‌చరణ్ (Ramcharan), ఎన్టీఆర్‌(NTR), రాజమౌళి(Rajamouli) కాంబినేషన్‌లో వచ్చిన ట్రిపులార్(RRR) సినిమా క్రేజ్ ఇప్పుడు రాష్ట్రాలు దాటి దేశాలకు పాకిపోయింది. సినిమా రిలీజ్‌కి ముందు నుంచే హిట్‌ గ్యారెంటీ అనే టాక్ సొంతం చేసుకుంది. ఈనెల 25న రిలీజైన తర్వాత ట్రిపులార్ సక్సెస్‌ టాక్ సొంతం చేసుకోవడంతో క్రేజ్ మరింత పెరిగిపోయింది. తాజాగా ఈసినిమాని నేపాల్‌(Nepal) లో ఉండే ప్రజలు కూడా ఎంజాయ్ చేస్తున్నారు. ప్యాన్ ఇండియాగా రిలీజైన ట్రిపులార్ సినిమా తెలుగు(Telugu), తమిళం(Tamil), హిందీ(Hindi)లోనే కాదు విదేశాల్లో అంతే సక్సెస్‌ఫుల్‌గా ప్రదర్శించబడుతోంది. చల్లగా ఉండే హిమాలయ దేశమైన నేపాల్‌తో పాటు తమిళనాడు(Tamil Nadu)లో కూడా తెలుగు సినిమాకు అక్కడి ప్రేక్షకుల థియేటర్లలో అరుపులు, కేకలతో దద్దరిల్లిపోతున్నాయి. ఇక అక్కడి అభిమానులు కూడా థియేటర్లలోనే డ్యాన్స్‌లు చేస్తున్నారు. ముఖ్యంగా సినిమా వసూళ్ల పరంగా కొత్త రికార్డులు తిరగరాస్తుంటే .. సినిమా చూసిన అభిమానుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. దాదాపు  రెండు దశాబ్ధాల క్రితం పెద్ద హీరో కొత్త సినిమా ఏదైనా రిలీజ్ అయితే ఇలాంటి సందడి వాతావరణమే కనిపించేంది. ఓటీటీ, చిన్న సినిమాల హవా పెరగడంతో అలాంటి హడావుడి కరువైపోయింది. తిరిగి ఇన్న సంవత్సరాల తర్వాత మళ్లీ ట్రిపులార్ సినిమాతో థియేటర్ల దగ్గర హంగామా కనిపించడం ఓ రికార్డ్‌గానే భావిస్తున్నారు మూవీ మేకర్స్.

  దుమ్మురేపుతున్న ట్రిపులార్..

  ట్రిపులార్ సినిమా ప్రదర్శించబడుతున్న థియేటర్లలో స్క్రీన్‌ల దగ్గరు వెళ్లి మరీ ప్రేక్షకులు స్టెప్పులు వేస్తూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్‌ మేనియా ఈ విధంగా ఉంటుందని తెలుగు ప్రేక్షకులు ఊహించినప్పటికి ..విదేశాల్లో ఇలాంటి రెస్పాన్స్ రావడంతో చిత్ర యూనిట్ ఆ అలాంటి ఓ వీడియోని తమ అఫిషియల్ పేజ్‌లో పోస్ట్ చేసింది. ఇప్పుడు ఆ వీడియోనే తెగ వైరల్ అవుతోంది.

  ఆల్‌ సెంటర్స్ అదుర్స్ ..

  అటు నేపాల్‌లో ఫ్యాన్స్‌ థియేటర్లలో చిందులేస్తుంటే..తమిళనాడులోని సేలంలో సినిమా కోసం థియేటర్ ముందు పడిగాపులు కాస్తున్న ప్రేక్షకులతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. శనివారం సెకండ్‌ షో టైమ్‌లో సినిమా అభిమానుల కోలాహలం కనిపించింది. ట్రిపులార్ సినిమా టికెట్ల కోసం వచ్చిన ప్రేక్షకులతో థియేటర్ చుట్టు పక్కల ప్రాంతాలు వీధులు, జంక్షన్లు జనంతో జామ్‌ అయిపోయాయి. రోడ్లకు ఇరువైపుల అభిమానులతో జనసంద్రంగా మారడంతో వందలాది వాహనాలు రోడ్లపైనే నిలిచిపోయాయి. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ట్రాఫిక్ కు ఆటంకం కలిగింది. ఆ వీడియోను ఓ అభిమాని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో తెగ వైరల్ అవుతోంది.

  జక్కన్న మాయాజాలం..

  డైరెక్టర్ రాజమౌళి ట్రిపులార్‌ సినిమా కోసం చేసిన ప్రమోషన్, జనంలో వచ్చిన టాక్, ఇండస్ట్రీలో క్రియేట్ అయిన హైప్ అన్నింటిని బ్యాలెన్స్ చేస్తోంది ట్రిపులార్ మూవీ సక్సెస్‌ టాక్.

  First published:

  ఉత్తమ కథలు