Video : సాహసమే ఊపిరిగా... రెండు ఖండాల మధ్య సముద్రంలో పయనం...

Silfra : మన భూమిపై ఏడు ఖండాలున్నాయని మనకు తెలుసు. కానీ... రెండు ఖండాల్ని పక్క పక్కనే చూడగలగటం అరుదైన అంశం. ఈ వీడియోలో అది సాధ్యమవుతోంది.

Krishna Kumar N | news18-telugu
Updated: August 10, 2019, 12:21 PM IST
Video : సాహసమే ఊపిరిగా... రెండు ఖండాల మధ్య సముద్రంలో పయనం...
సిల్ఫ్రా దృశ్యం (Image : Youtube - Caters Clips)
Krishna Kumar N | news18-telugu
Updated: August 10, 2019, 12:21 PM IST
మీకు తెలిసే ఉంటుంది... వందల కోట్ల సంవత్సరాల కిందట... ఉత్తర అమెరికా... యూరప్ ఖండాలు ఒకటిగానే ఉండేవి. ఇప్పుడు అవి వేరు వేరు. ఐతే... అవి విడిపోయినప్పుడు... ఓ పగులు లోయ ఏర్పడింది. అందులోకి అట్లాంటిక్ సముద్ర నీరు వచ్చి చేరింది. ఇప్పుడు అదో సాహసోపేత ప్రదేశం. అక్కడికి వెళ్లాలంటే... ఖండాలంత ధైర్యం ఉండాలి. కొందరు డైవర్లు... సముద్రం గుండా ఆ లోయలోకి వెళ్లారు. లక్కేంటంటే... అక్కడి నీరు ఇంకా కలుషితం కాలేదు. అందువల్ల డైవర్లు... ఆ రెండు ఖండాల మధ్యలో ఉన్న లోయలోని మార్గంలో ఈదుకుంటూ వెళ్లారు. ఆ దృశ్యాల్ని వీడియో తీశారు. యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసిన ఈ వీడియో ఇప్పుడో సంచలనం. చాలా టూరిజం సైట్లు... ఈ వీడియోని ఎంబెడ్డింగ్ చేసుకున్నాయి. ఎంతో మంది యువ డైవర్లు... దీన్ని చూసి ప్రేరణ పొందుతున్నారు.

సిల్ఫ్రా దృశ్యం (Image : Youtube - Caters Clips)


ఈ ప్రాజెక్ట్ మేనేజర్ లిడిజా జోవిసిక్... ఇలాంటి చాలా సాహసాల్ని ఆసక్తి వున్న డైవర్లతో చేయిస్తోంది. ఆమె ఓ ఆసక్తికర విషయం చెప్పింది. రెండు ఖండాల మధ్యా ఉన్న ఆ లోయను సిల్ఫ్రా అని అంటున్నారట. అక్కడ వందల ఏళ్ల పాటూ... లావా రిలీజై... ప్రస్తుతం అదో అద్భుతమైన, అందమైన ప్రదేశంగా ఉందని చెప్పింది.




అక్కడి నీటిలో 100 మీటర్ల (దాదాపు 300 అడుగులు) వరకూ దృశ్యాలు కనిపిస్తున్నాయనీ... అంత స్వచ్ఛమైన నీరు ఈ రోజుల్లో చాలా అరుదైన ప్రదేశాల్లోనే ఉంటోందని చెప్పింది. సిల్ఫ్రా చాలా అందంగా ఉందనీ, అక్కడకు వెళ్లిన వాళ్లకు కలిగే ఎక్స్‌పీరియన్స్... ఈ భూమిపై మరెక్కడా దొరకదని వివరించింది.
First published: August 10, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...