హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Video Viral:పదేళ్ల వయసున్న బాలిక తన టాలెంట్ చూపించింది..బాబోయ్ వైరల్ అవుతున్న వీడియో

Video Viral:పదేళ్ల వయసున్న బాలిక తన టాలెంట్ చూపించింది..బాబోయ్ వైరల్ అవుతున్న వీడియో

Photo Credit:Twitter

Photo Credit:Twitter

Video Viral: పదేళ్ల వయసున్న చిన్నారి అద్భుతమైన డ్యాన్స్‌ చేసింది. చెన్నైలో ఓ పెళ్లికి వెళ్బాలిన చిన్నారి సినిమా పాటకు డ్యాన్స్ చేసి అందర్ని ఆశ్చర్యపరిచింది. ఆ డ్యాన్స్ వీడియో మీరు ఓసారి చూడండి.

టాలెంట్‌ ఉన్నవాళ్లు ఎక్కడున్నా సోషల్ మీడియా (Social media)ఇట్టే బయటకులాగుతోంది. అప్పటి వరకు సాధారణ వ్యక్తులుగా ఉన్న వాళ్లను సెలబ్రిటీలు, పాపులర్‌ పర్సనాలిటీలుగా గుర్తింపునిస్తోంది. ఇందుకు ఒకరిద్దరు కాదు కొన్ని వేల మంది ఉదాహారణగా చెప్పుకోవచ్చు. పశ్చిమ బెంగాల్‌(West bengal)లో పల్లీలు అమ్ముకునే భుబన్‌ బదాకర్‌ ఎలా స్టార్‌ ఫేం వచ్చిందో ..ఇప్పుడు తమిళనాడు(Tamil Nadu) కు చెందిన ఓ చిన్నారి కూడా అంతే పాపులర్ అవుతోంది. చెన్నై(Chennai)లో ఓ వెడ్డింగ్‌కి వచ్చింది సుమారు పదేళ్ల వయసున్న చిన్నారి. అయితే నూతన వధువరులు ఫంక్షన్‌ హాలులో పెళ్లి వేదికకు వెళ్తుండగా డ్యాన్స్ చేసింది. అయితే ఈ చిన్నారి మరో ఇద్దరు అబ్బాయిలతో కలిసి వేసిన స్టెప్పులు చూస్తూ పెళ్లికి వచ్చిన వాళ్లు కూడా విగ్రహాల్ల నిలబడి చూస్తుండిపోయారు. బ్లాక్ కలర్‌ చుడిదార్ వేసుకొని తలలో పూలు పెట్టుకొని ప్రొఫెషనల్‌ డ్యాన్సర్‌ని తలదన్నేలా స్టెప్పులు వేసింది చిన్నారి. తమిళ సినిమా మంబియట్టాన్‌లోని సాంగ్‌కి కత్తి లాంటి స్టెప్పులు వేసి ఫంక్షన్‌కి వచ్చిన వాళ్లందరిలో ఓ ఊపు తెచ్చింపింది. చూడటానికి నాలుగు అడుగులు లేదు. పట్టుమని పదేళ్ల వయసు లేని చిన్నారి డ్యాన్స్‌ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. చిన్నారి డ్యాన్స్‌ పర్ఫామెన్స్‌ చూస్తున్న నెటిజన్లు ఓ మై గాడ్ వాటే టాలెంట్ అంటున్నారు. ఇంకొందరైతే ..ఎనర్జిటిక్‌ గర్ల్ అంటూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.

పిల్ల కాదు డ్యాన్స్ మాస్టర్..

ఫ్యామలీ మెంబర్స్‌తో పెళ్లి వేడుకకు వచ్చిందో లేక పెళ్లి బంధువుల అమ్మాయో తెలియదు కాని..పాపా ఎనర్జీ ముందు ఇద్దరు అబ్బాయిలు కూడ అంత స్పీడ్‌గా, అంతే నాచురల్‌గా స్టెప్పులు వేయలేకపోయారు. తమిళనాడులో పెళ్లి వేడుకలో ఈ చిన్నారి టాలెంట్‌ని కొందరు షూట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వరల్డ్‌ వైడ్‌గా పాపులర్ అయింది.

చిన్నారికి ప్రశంసల వెల్లువ..

2021లో రిలీజైన తమిళ సినిమా ముంబియట్టాన్‌లోని హిట్ సాంగ్‌ మరోసారి ఈ చిన్నారి ద్వారా పాపులర్ అవుతోంది. మిస్ డిసప్పీయర్‌ అనే ట్విట్టర్‌ పేజ్‌లో ఈ వీడియో లింక్‌ షేర్ చేశారు. చిన్నారి టాలెంట్‌ని మాటలు, కామెంట్స్‌ రూపంలో ఎక్స్‌ప్రెస్ చేయడానికి సరిపోని మరికొందరు హార్ట్ సింబల్స్, ఫైర్ ఎమోజీలను ట్యాగ్ చేస్తున్నారు. ఒక్క ఫంక్షన్‌లో ఈ రేంజ్‌లో డ్యాన్స్ చేసి పాపులరైన చిన్నారి వివరాలు తెలియరాలేదు. అయితే సోషల్ మీడీయా ప్రభావంతో ఆమె పేరు వివరాలే కాదు..త్వరలోనే సినిమాల్లో అవకాశం కూడా దక్కుతుందంటున్నారు సోషల్ మీడియా ఫాలోవర్స్.

Published by:Siva Nanduri
First published:

Tags: Tamil nadu, Viral Video

ఉత్తమ కథలు