Home /News /trending /

VIDEO OF BJP MLA SIBU MISHRA GOING VIRAL IN ASSAM SNR

Video Viral: అసోంలో బీజేపీ ఎమ్మెల్యే ఓవర్ యాక్షన్..వైరల్ అవుతున్న వీడియో

(Photo Credit:Youtube)

(Photo Credit:Youtube)

Video Viral:ప్రజాప్రతినిధులు ఎన్నికల వేళ ప్రజల ముందు ఒంగి ఒంగి నమస్కారాలు చేస్తారు. ఓట్లేసి గెలిపించిన తర్వాత వాళ్ల నెత్తి మీద ఎక్కి తైతక్కలాడుతారు. ఇది విమర్శ కాదు..అసోంలో ఓ బీజేపీ ఎమ్మెల్యే ప్రవర్తించిన తీరు చూస్తే మీరు అవుననే అంటారు.

ఇంకా చదవండి ...
ప్రజాప్రతినిధులు అనే వాళ్లు ప్రజలు కష్ట, నష్టాల్లో ఉన్న సమయంలో అండగా ఉండాలి. ఏదైనా విపత్తులు, ప్రమాదాలు సంభవించినప్పుడు సహాయ, సహకారాలు అందించాలి. అధికారుల్ని అప్రమత్తం చేయాలి. కాని అసోం(Assam)లో మాత్రం ఓ బీజేపీ ఎమ్మెల్యే (BJP MLA)ఈమాత్రం ఇంగితజ్ఞానం కూడా లేకుండా ప్రవర్తించాడు. రెండ్రోజుల క్రితం వరదలు, వర్షాలతో బీభత్సం ఏర్పడింది. ఇళ్లు, రోడ్లు, పూర్తిగా జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. వర్షాలు ముంచెత్తిన ప్రాంతాల్ని పరిశీలించడానికి వెళ్లారు లుండింగ్‌ అసెంబ్లీ నియోజకవర్గ(Lunding‌ Assembly constituency) బీజేపీ ఎమ్మెల్యే సిబు మిశ్రా(Sibu Mishra). అయితే వరద ముంపులో చిక్కుకున్న వాళ్లను పరామర్శించేందుకు వచ్చిన నాయకుడు..రోడ్డుపై నీరు ప్రవహిస్తుండటంతో అటుగా నీళ్లలో నడుచుకుంటూ వెళ్లేందుకు ఇష్టపడలేదు. వెంటనే తన సెక్యురిటీ Securityకోసం ఏర్పాటు చేసిన ప్రభుత్వ ఉద్యోగిని తన వాహనంగా మార్చుకున్నాడు. ఏకంగా ఓ పోలీస్‌ భుజంపై ఎక్కి నీళ్లలో తడవకుండా రోడ్డు దాటించమని కోరడంతో ఆ అధికారి ఎమ్మెల్యే సిబు మిశ్రాను తన భుజాలపై మోసుకుంటూ నీళ్లలో తడవకుండా తీసుకెళ్లాడు. ఎమ్మెల్యేని మోయడమే ఓ కష్టమైన పని అంటే ఆయన తగడానికి వాటర్‌ బాటిల్‌ (water Bottle)ని కూడా మరో చేతిలో పెట్టడంతో కనిస్టేబుల్‌ కష్టంగా మోసుకుంటూ తీసుకెళ్లారు.

ప్రజాప్రతినిధిపై విమర్శలు..
లుండింగ్‌ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే సిబు మిశ్రాను ఓ ప్రభుత్వ ఉద్యోగి మోసుకెళ్తుండగా అక్కడే ఉన్న కొందరు తమ సెల్‌ఫోన్‌తో వీడియో తీశారు. ఆ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో విస్తృతంగా వైరల్ అవుతోంది. ప్రజాప్రతినిధిగా వచ్చిన బీజేపీ ఎమ్మెల్యే కేవలం తన బ్రాండెడ్‌ బూట్లు, ప్యాంట్‌ నీళ్లలో తడవకూడదనే ఇలా ప్రభుత్వ ఉద్యోగిని తన సవ్వారిగా మార్చుకున్నాడనే విమర్శలు వెల్లువెత్తాయి.

వరద ప్రాంతాలకు వచ్చి ఓవర్ యాక్షన్..
అదే సందర్భంలో అక్కడున్న వాళ్లు సైతం ఎమ్మెల్యే తీరును తీవ్రంగా తప్పు పట్టారు. వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు సైతం మండిపడుతున్నారు. వర్షాలు, వరదలు వస్తే మీరు ప్రజలకు సహాయం చేయడానికి వచ్చారా లేక ప్రజల ముందు బిల్డప్ ఇవ్వడానికి వచ్చారా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఎన్నికల సమయంలో ఓట్ల కోసం అడ్డమైన పనులు చేసే నేతలు గెలవగానే ఎందుకిలా ప్రవర్తిస్తున్నారని మండిపడుతున్నారు.
Published by:Siva Nanduri
First published:

Tags: Assam, Viral Video

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు