Viral Video : సోషల్ మీడియాలో ఓ పచ్చని ఆకు వీడియో వైరల్ అవుతోంది. ఆ ఆకులో ఏ ప్రత్యేకతా లేదు. కానీ ఆ ఆకుపై ఓ గొంగళి పురుగు ఉంది. అది ఉంది అని ఎవరైనా చెబితే తప్ప తెలియదు. అంతలా అది ఆకులో కలిసిపోయింది. పూర్తి పారదర్శకమైన ఆ గొంగళి పురుగును బారన్ గొంగళి పురుగు (baron caterpillar) గా పిలుస్తారు. సైంటిఫిక్ నేమ్ యుథాలియా అకొన్తియా (Euthalia aconthea). ఈ గొంగళి పురుగులు ఇండియా, శ్రీలంక సహా ఆసియాలో ఎక్కువగా కనిపిస్తాయి. ఇవి సీతాకోక చిలుకగా మారాక.. బ్రౌన్ కలర్లో కనిపిస్తాయి.
బారన్‌కి సంబంధించిన ఓ వీడియోని రెడ్డిట్ యూజర్ PonzuBees... నవంబర్ 26, 2022న పోస్ట్ చెయ్యగా.. దీనికి ఇప్పటివరకూ 2.3వేల అప్ ఓట్లు వచ్చాయి. ఆ వీడియోని గమనిస్తే.. అందులో ఓ ఆకు ఉంది. దాన్ని క్లోజ్‌గా చూపించినప్పుడు... ఆకుపై ఉన్న గొంగళి పురుగు నెమ్మదిగా కదులుతోంది. కానీ అది ఆకులో పూర్తిగా కలిసిపోవడం వల్ల.. అది అక్కడ ఉన్న విషయం ఈజీగా తెలియట్లేదు.
ఆ వీడియోని ఇక్కడ చూడండి (viral video)
చూశారుగా.. ఆశ్చర్యంగా అనిపించిందా? మన ప్రకృతి ఎంత గొప్పదో కదా. ఆ గొంగళి పురుగును ఏ పక్షులూ తినేయకుండా.. రక్షణ కోసం దానికి పారదర్శక శరీరాన్ని ఇచ్చింది. తద్వారా అది తనను తాను కాపాడుకుంటోంది.
నెటిజన్ల రియాక్షన్ :
"అది నమ్మలేని విధంగా ఉంది" అని ఓ యూజర్ కామెంట్ ఇవ్వగా.. "అది ఆ ఆకులో ఎంత బాగా కలిసిపోయిందో కదా" అని మరో యూజర్ స్పందించారు. "ఆకు మధ్యలోని గీతలోనే వెళ్లాలని ఆ పురుగుకి ఎవరు చెప్పారు? తన వీపుపై ఆకుపై ఉన్న గీత లాంటిదే ఉందని దానికి తెలుసా?" అని మరో యూజర్ ఆశ్చర్యపోతూ ప్రశ్నించారు. "ప్రతీ జీవిలోని బ్రెయిన్లో ఉన్న న్యూరాన్లకు.. లక్షల సంవత్సరాలుగా తమలాంటి జీవులకు ఉండే న్యూరాన్లతో సంబంధం ఉంటుంది. దీన్నే జీవ పరిణామ క్రమం (evolution) అంటారు. జీవుల్లోని న్యూరాన్లు పురాతన డీఎన్ఏని కలిగివుంటాయి. ఆ డీఎన్ఏ వల్ల అవి ఎలా ప్రవర్తించాలో వాటికి సహజంగానే తెలుస్తుంది" అని మరో యూజర్ సమాధానం ఇచ్చారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Viral, VIRAL NEWS, Viral Video