Home /News /trending /

VIDEO OF A YOUNG WOMAN WHO HIT A YOUNG MAN SAYING THAT HE WAS HIT BY A BIKE IN MADHYA PRADESH HAS GONE VIRAL SNR

Video Viral:బైక్ టచ్ అయినందుకు ఆ అమ్మాయి ఏం చేసిందో చూడండి

Photo Credit:Youtube

Photo Credit:Youtube

MADHYA PRADESH: ఓ అమ్మాయి పబ్లిక్‌ ప్లేసులో యువకుడ్ని చెప్పుతో కొట్టింది. రోడ్డుపై వెళ్తున్న యువతి బైక్‌ని యువకుడు ఢీకొట్టడంతో ఆగ్రహంతో రెచ్చిపోయింది. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా చెప్పుతో కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. యువతి ప్రవర్తనను తీవ్రంగా తప్పుపడుతోంది.

ఇంకా చదవండి ...
మధ్యప్రదేశ్‌(Madhya Pradesh)లో ఓ టీనేజ్‌ యువతి బైక్‌పై వెళ్తుండగా ఓ యువకుడు మరో బైక్‌తో ఢీకొట్టాడు. అయితే ఆ యువకుడు చేసిన తప్పు ఏమిటంటే రాంగ్‌ రూట్‌లో రావడం..అది కూడా సిగ్నల్ పడిన దగ్గర మహిళ బైక్ ఆపి ఫోన్‌ మాట్లాడుతుంటే ఢీకొట్టాడు. అంతే అమ్మాయిలకు టైమ్‌ దొరకాలే గాని ఏ విధంగా రెచ్చిపోతారే ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు అన్నట్లుగా ఓ రేంజ్‌లో రెచ్చిపోయింది. యువకుడ్ని చెప్పు తీసుకొని చెడ, మడా కొట్టింది. బైక్ (Bike)రోడ్డుపై వదిలేసి ఆ యువకుడు తప్పైందని చెబుతున్నా వినిపించుకోకుండా రెచ్చిపోయింది. ఫేస్ కనిపించకుండా యువతి (Young woman)స్కార్ఫ్‌ (Scarf)‌కట్టుకుంటే యువకుడు ముఖం కనిపించకుండా హెల్మట్ (Helmet)పెట్టుకున్నాడు.మధ్యప్రదేశ్‌(Madhya Pradesh)జబల్‌పూర్‌(Jabalpur)లో నడిరోడ్డుపైన ఓ యువతి యువకుడ్ని పట్టుకొని కొడుతుంటే చూస్తున్న వాళ్లంతా పోనిలేదమ్మా వదిలేయ్...తప్పందైని చెబుతున్నాడు కదా అంటే ఏమాత్రం తగ్గకుండా అపరకాళి అవతారంలో రెచ్చిపోయింది. పబ్లిక్‌ ప్లేసులో ఓ యువకుడు రాంగ్‌ రూట్‌(Wrong route)లో వచ్చి బైక్‌ ఢీకొట్టినందుకు యువతి చేసిన ఓవర్ యాక్షన్ అంతా అక్కడున్న సీసీ కెమెరా(CCTV camera)లో రికార్డైంది. అలాగే రోడ్డుపై వెళ్తున్న మరికొందరు తమ సెల్‌ఫోన్లతో గొడవపడుతున్న దృశ్యాల్ని షూట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో రచ్చ రచ్చైంది.

సోషల్ మీడియాలో రచ్చ..
మధ్యప్రదేశ్‌ జబల్‌పూర్ జిల్లాలోని ఓమటి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని రసల్‌చౌక్ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఈ సీన్‌ జరిగింది. అమ్మాయి బైక్‌ని రాంగ్‌రూట్‌లో వచ్చి యువకుడు ఢీకొట్టడం తప్పే అయినప్పటికి ఓ యువతి పబ్లిక్ ప్లేసు అని కూడా చూడకుండా కుర్రాడ్ని చావబాదడంతో అక్కడున్న వాళ్లంతా యువతిని తప్పుపట్టారు. అతను తప్పైందని చెబుతుంటే వినిపించుకోవేంటి అంటూ ఆమెకు సర్ధి చెప్పి కోపం తగ్గించే ప్రయత్నం చేసినప్పటికి ఆమె శాంతించలేదు.

ఓవర్ యాక్షన్ అంటే ఇదే..

యువతి వీరంగం సృష్టించడంతో రోడ్డుపై ట్రాఫిక్ జామ్ అయింది. అక్కడ డ్యూటీలో ఉన్న పోలీసులు వచ్చి పబ్లిక్ ప్లేసులో న్యూసెన్స్ క్రియేట్ చేసినందుకు ఇద్దర్ని పోలీస్‌ స్టేషన్‌కి తీసుకెళ్లారు. యువకుడిపై రాంగ్‌రూట్‌లో డ్రైవింగ్ చేసినందు ఫైన్ వేశారు. అమ్మాయికి వార్నింగ్ ఇచ్చి వదిలేశారు. రోడ్డుపై ఫోన్‌లతో షూట్ చేసిన వాళ్లు మాత్రం వదల్లేదు. వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇలా చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకునే హక్కు మహిళలకు ఉందా అనే హ్యాష్ ట్యాగ్‌తో యువతి చేష్టలను తీవ్రంగా ఖండిస్తున్నారు. కొందరు మహిళలు సైతం యువకుడి అమాయకత్వాన్ని చూసి అతనికి మద్దతిస్తున్నారు. ఆడవాళ్లకు అంత పొగరు తగదంటూ హితవు పలుకుతున్నారు.
Published by:Siva Nanduri
First published:

Tags: Madhya pradesh, Viral Video

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు