VIDEO OF A YOUNG MAN DOING FEATS IN A RUNNING CAR IN UTTAR PRADESH GOES VIRAL SNR
Video Viral:స్టంట్స్ చేస్తే చస్తావురా నాయనా..యూపీలో యువకుడి ఓవర్ యాక్షన్ వీడియో ఇదే
Photo Credit:Youtube
Video Viral:కాళ్లు, చేతులు సరిగా ఉన్నంత కాలం ఏదో కటింగ్ ఇవ్వాలని ట్రై చేస్తారు. ఏదో ప్రమాదం జరిగితే కాని తెలియదు వాటి విలువ. యూపీలోని ఘజియాబాద్‌లో ఓ యువకుడు అంతే పబ్లిసిటీ కోసం ప్రాణాల్ని రిస్క్‌లో పెట్టి స్టంట్స్ చేశాడు. ఇప్పుడు ఆ వీడియోనే వైరల్ అవుతోంది.
ప్రస్తుత కాలంలో కొందరు యువకులు ఏదో రకంగా వార్తల్లో నిలవాలని తాపత్రయపడుతున్నారు. అందుకోసం పిచ్చి పిచ్చి పనులు, ప్రాణాలకు తెగించి చేసే సాహసాలు, ఎదుటివాళ్ల చూపుల్ని ఆకర్షించేంతగా ఉండే విన్యాసాల(Stunts)తో వీడియోలు(Videos), సెల్ఫీలు(Selfies),తీసుకొని సోషల్ మీడియాSocial mediaలో పోస్ట్ చేస్తూ క్రేజ్ పొందాలని భావిస్తున్నారు. ఇలాంటి ప్రయత్నం చేసిన ఓ యువకుడికి చిక్కుల్లో పడ్డాడు. ఉత్తరప్రదేశ్(Uttar Pradesh)లో జరిగిన వెరైటీ స్టంట్స్‌కి సంబంధించిన వీడియో ఇప్పుడు వరల్డ్ వైడ్(World Wide)గా వైరల్ (Viral) అవుతోంది. ఘజియాబాద్Ghaziabadలో ఎలివేటెడ్ రోడ్డుపై స్కార్పియో వాహనం(Scorpio Vehicle)డ్రైవ్ చేస్తున్న ఓ యువకుడు తన హీరోయిజాన్ని చూపించాలనుకున్నాడు. ఓవైపు కారు రోడ్డుపై వెళ్తుండగానే ..డ్రైవర్ సైడ్ డోర్ (Driver Side Door)తెరిచి డోర్‌పై కూర్చొని తల దువ్వుకోవడం, డ్రైవర్ సీట్లోకి ఎక్కే ఫుట్ రెస్ట్‌పై నిలబడి కారు డోర్‌ని కాలుతో ఆపుతూ ఫోటోలకు ఫోజులిచ్చాడు. మధ్యలో కారు డ్రైవింగ్ చేస్తూ..మళ్లీ ఇదే తరహాలో డ్రైవర్ సీట్లో ఓ పక్కకు కూర్చొని ఎవరితోనో ముచ్చటిస్తున్నట్లుగా ఫోజులిచ్చాడు. రాత్రి వేళ కావడం, రోడ్డుపై పెద్దగా వాహనాల రద్దీ లేకపోవడంతో ఈ కుర్రాడి విచిత్రమైన స్టంట్స్ చేస్తున్న సమయంలో ఎలాంటి ప్రమాదం జరగలేదు. అంతే కాదు..ఇంత ప్రమాదకరమైన స్టంట్స్ చేస్తున్న యువకుడు ..కారుని సింగిల్ హ్యాండ్‌తో కంట్రోల్ చేయగలనన్న ధీమాతో అత్యంత నిర్లక్ష్యంగా ట్రాఫిక్ రూల్స్, డ్రైవర్‌గా తీసుకోవాల్సిన ఏ జాగ్రత్తలను పాటించకపోవడంతో వీడియో వైరల్ అవుతోంది.
ప్రాణాలతో చెలగాటమా..
అయితే ఈ వీడియో ఎలా బయటకు వచ్చిందో తెలియదు కాని ప్రస్తుతం మాత్రం రచ్చ రచ్చ అవుతోంది. కారుపై ఫీట్స్ చేయాలనుకున్న యువకుడే తన స్నేహితులతో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయించాడా లేక రోడ్డుపై వెళ్తున్న వారెవరైనా సెల్ఫోన్లో షూట్ చేసి సోషల్ మీడియా గ్రూప్‌లలో షేర్ చేసి ఉంటారన్నది మాత్రం తెలియరాలేదు.
స్టంట్స్ చేస్తే చస్తావురా నాయనా..
ఎంతో జాగ్రత్తగా వాహనాలు నడుపుతుంటేనే రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి. అలాంటిది ఏకంగా నడిరోడ్డుపై కారు డ్రైవింగ్ సీట్‌ని వదిలేసి యువకుడు విన్యాసాలు చేయడంపై సామాన్య ప్రజలే కాదు నెటిజన్లు మండిపడుతున్నారు. అతనికి బుద్ధి చెప్పే విధంగా సెటైరికల్‌గా కామెంట్స్‌ని షేర్ చేస్తున్నారు. వీడియోలోని కారు నెంబర్ ఆధారంగా అతడ్ని గుర్తించి తగిన చర్యలు తీసుకునే పనిలో ఘజియాబాద్ పోలీసులు ఉన్నారు.
క్రేజ్ కోసం వింత చేష్టలు..
కాళ్లు, చేతులు సరిగా ఉన్నప్పుడు ఇలాంటి విన్యాసాలు చేసి అందర్ని ఆకర్షించాలనుకునే ప్రయత్నం మంచిది కాదు. ఫీట్స్ చేస్తూ ప్రాణాలు పోగొట్టుకోవడం కంటే ఏదైనా సాధించి ప్రజల్లో గుర్తింపు తెచ్చుకోవాలని నెటిజన్లు సూచిస్తున్నారు. అలాగే ఘజియాబాద్‌లో యువకుడు చేసిన ఫీట్స్ చూసి మరెవ్వరూ ఇలాంటి ప్రయోగాలు చేయవద్దని న్యూస్18సైతం యువతకు సూచిస్తోంది. ఏదైనా జరగరానిది జరిగితే నష్టపోయేది మీ కుటుంబమేననే విషయాన్ని మార్చిపోవద్దని హెచ్చరిస్తోంది.
Published by:Siva Nanduri
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.