మంత్రగాళ్లు, భూతవైద్యులు, నాటు వైద్యం చేసే వ్యక్తులు, తాంత్రిక పూజలతో రోగాలు నయం చేస్తామని చెప్పే వాళ్లు ఇంకా జనం మధ్యలోనే తిరుగుతున్నారు. తిరగడమే కాదు ఏకంగా ప్రభుత్వ ఆసుపత్రు(Government hospital)ల్లో చొరబడి మరీ రోగులకు వైద్యం చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్(Uttar Pradesh)లో ఈ విచిత్రమైన సంఘటన జరిగింది. విషసర్పం కాటేయడంతో ఆసుపత్రికి వచ్చిన మహిళా పేషెంట్(Patient)కి ఓ నాటు వైద్యుడు(Tantric doctor)ఏం ట్రీట్మెంట్ చేశాడో అక్కడున్న వాళ్లంతా చూసి ఆశ్చర్యపోయారు. నాటు వైద్యుడి వ్యవహారం బయటపెట్టడానికి వీడియో (Video) తీసి సోషల్ మీడియా(Social media)లో పోస్ట్ చేయడంతో వీడియో వైరల్(viral) అవుతోంది.
వైరల్ అవుతున్న వీడియో..
ఏదైనా అనారోగ్య సమస్య వచ్చినా, లేక క్రిమీ, కీటకాలు, విష సర్పాలు కరిచినా వైద్యులకు చూపించుకోవాలి. ఉత్తరప్రదేశ్లో ఓ మహిళ అదే పని చేసింది. తన చేతికి ఏదో విషసర్పం కరవడంతో మహోబా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చింది. విషం శరీరంలోకి వ్యాపించకుండా వెంటనే ఎమర్జెన్సీ వార్డుకు తరలించారు. అయితే అక్కడ బాధితురాలికి ట్రీట్మెంట్ చేయడానికి డాక్టర్లకు బదులుగా నాటు వైద్యులు ఉండటం అందర్ని ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ జిల్లా ఆసుపత్రికి తేళ్లు, పాములు, విష కీటకాలు కరిస్తే వచ్చే వాళ్లకు నాటు వైద్యులతోనే చికిత్స అందిస్తున్నట్లుగా రోగి బంధువులు తెలిపారు.
వెరైటీ ట్రీట్మెంట్ ..
బాధితురాలి చేతికి కట్టు కట్టిన తాంత్రిక వైద్యుడు..ఆమె చెవులో నోరు పెట్టి గట్టిగా గాలి ఊదాడు. అంతే కాదు చెవిలో ఏదో మంత్రం చదవడంతో అక్కడున్న వాళ్లంతా ఆశ్చర్యపోయారు. మహిళకు వచ్చిన సమస్య తెలుసుకొని మందులు, సెలైన్, ఇంజక్షన్ చేస్తారని బంధువులు అనుకున్నారు. ఇంతలోనే ఓ భూతవైద్యుడు వచ్చి విచిత్రమైన ట్రీట్మెంట్ చేయడంతో అక్కైపోయారు.
మంత్రాలతోనే వైద్యం..
మంత్రాలకు చింతకాయలు రాలతాయనే సామెత తరహాలోనే మంత్రాలకు విషం విరుగుడు అవుతుందని..రోగం నయం అవుతుందని ఇంకా జనం నమ్ముతున్నారు. అయితే ఈతరహా వైద్యం ఎక్కువగా డాక్టర్లు, ఆసుపత్రులు అందుబాటులో లేని పల్లెటూళ్లు, ఏజెన్సీ ప్రాంతాల్లో చూస్తుంటాం. కాని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ వార్డులోనే ఇలాంటి నాటు వైద్యం చేస్తుండటంపై ఆరోగ్యశాఖ అధికారులను వివరణ కోరుతున్నారు స్థానికులు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Trending news, Uttar pradesh, Viral Video