Home /News /trending /

VIDEO OF A POLICE OFFICER MASSAGING A WOMAN AT A POLICE STATION IN BIHAR HAS GONE VIRAL SNR

Bihar: మసాజ్‌ సెంటర్‌గా మారిన పోలీస్‌ స్టేషన్..మహిళతో ఏం చేయించాడో వీడియో చూడండి

(Photo Credit:Youtube)

(Photo Credit:Youtube)

Bihar:న్యాయ సహాయం కోసం పోలీస్‌స్టేషన్‌కి వచ్చిన మహిళతో మసాజ్ చేయించుకున్నాడో పోలీస్ అధికారి. బిహార్‌ సహర్సా జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. సదరు పోలీస్ అధికారిని సస్పెండ్ చేశారు ఉన్నతాధికారులు.

బిహార్‌(Bihar)లో ఓ పోలీస్‌ అధికారి ప్రవర్తించిన తీరు దుమారం రేపుతోంది. పోలీస్‌ స్టేషన్‌(Police station)కి ఓ కేసు విషయంలో న్యాయం చేయమని కోరడానికి వచ్చిన మహిళ(Woman)తో మసాజ్ చేయించుకున్న వీడియో సోషల్ మీడియా(Social media)లో విపరీతంగా వైరల్(Viral) అవుతోంది. పోలీస్‌ వ్యవస్థకు అగౌరవం తెచ్చే విధంగా అత్యంత నీచంగా ప్రవర్తించాడు పోలీస్ అధికారి. ఒంటిపై దుస్తులు లేకుండా దర్జాగా కుర్చిలో కూర్చుంటే ఆ నడి వయసు కలిగిన మహిళ చేతులో పోలీస్ ఆఫీసర్ వీపుపై మసాజ్(Massage)చేస్తున్న ఇంటర్‌నెట్‌(Internet)లో చక్కర్లు కొట్టడంతో సదరు అధికారిని సస్పెండ్(Suspended)చేశారు ఉన్నతాధికారులు. బీహార్‌లోని సహర్సా జిల్లా నౌహట్ట పోలీస్‌ స్టేషన్‌లో జరిగిన ఇన్సిడెంట్‌ ఇది. బాధిత మహిళ కొడుకు ఓ కేసు విషయంలో జైలు పాలయ్యాడు. తన బిడ్డను బెయిల్‌Bail‌పై విడిపించే మార్గం ఏధైనా ఉందా అని అడిగేందుకు పోలీసులను బ్రతిమిలాడుకునేందుకు పోలీస్ స్టేషన్‌కి వెళ్లింది బాధితురాలు. పోలీస్ స్టేషన్‌లో ఉన్న ఎస్‌ఐ శశిభూషన్ సిన్హా(Shashibhushan Sinha)..అవసరం కోసం వచ్చిన మహిళతో తన వ్యక్తిగత పరిచర్యలు చేయించుకున్నాడు. బెయిల్‌ విషయంపై లాయర్‌ మాట్లాడుతాను ముందు నాకు మసాజ్ చేయమని మహిళను కోరాడు. బిడ్డ బెయిల్‌పై విడుదల కావాలన్న ఆలోచనతో మహిళ ఒంటిపై కనీసం దుస్తులు కూడా లేకుండా కూర్చున్న పోలీస్‌ అధికారి వీపు నెమురుతూ మసాజ్ చేసింది. పోలీస్ స్టేషన్‌కి వచ్చిన బాధిత మహిళతో పాటు మరొక మహిళ ఉండటంతో ఆమె ఇదంతా ఫోన్‌లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయింది.

పోలీస్ అధికారి కండకావరం..
పోలీస్‌స్టేషన్‌కి అవసరం మీద వచ్చిన మహిళలకు నమ్మకం కలిగేలా సదరు బాధితురాలు మసాజ్ చేస్తుంటే లాయర్‌కు ఫోన్ చేసి మాట్లాడాడు శశిభూషన్ సిన్హా. పాపం ఆడమనిషి..బిడ్డకు బెయిల్‌ కావాలని కోరుతోంది. ఎలాగైనా బెయిల్ వచ్చేలా చూడండి..అవసరమైతే నేనే మీకు ఓ 10వేల రూపాయలు ఇస్తానంటూ చెప్పడం వీడియోలో రికార్డైంది. న్యాయం చేయాల్సిన వ్యక్తే బాధిత మహిళతో మసాజ్ చేయించుకుంటూ ఫోన్‌లో సెటిల్‌మెంట్లు చేస్తుండటంపై విమర్శలు వెల్లువెత్తాయి. వీడియో జిల్లా పోలీస్ అధికారుల వరకు చేరడంతో అతనిపై సస్పెన్షన్ వేటు వేశారు.
మసాజ్‌ సెంటర్‌గా మారిన పీఎస్‌..

ఈతరహా ఘటనలు బిహార్‌లో కొత్తేమి కాదంటున్నారు ప్రజాసంఘాల నాయకులు. పోలీసులు తమ అధికారాన్ని అడ్డుపెట్టుకొని పరిపాలన కొనసాగిస్తున్నారని విమర్శిస్తున్నారు. ఏదో కేసులు, సమస్యలపై పోలీస్ స్టేషన్‌కి వచ్చే మహిళలు, బాధితులను డబ్బుల కోసం బెదిరించడం, అవసరాలు తీర్చుకోవడం వంటివి చేస్తున్నారనే ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నారు. బీహార్‌లో ఇలాంటి వ్యక్తులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
Published by:Siva Nanduri
First published:

Tags: Bihar News, Police Case

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు