Home /News /trending /

VIDEO OF A MONKEY FLYING A KITE IN UTTAR PRADESH WENT VIRAL ON SOCIAL MEDIA SNR

OMG:ఛీ ఆ కోతికి అన్నీ మనిషి బుద్దులే వచ్చాయి.. ఏం చేసిందో తెలుసా

Photo Credit:Youtube

Photo Credit:Youtube

OMG: మకరసంక్రాంతి రోజున ఉత్తరప్రదేశ్‌లో ఓ వింత జరిగింది. బంగ్లాపైకి ఎక్కి ఎంచక్కా ఓ కోతి గాలిపటాలు ఎగురవేసింది. తోటి పిల్లలతో కలిసి కోతి ఎంజాయ్ చేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. వీడియో చూస్తున్న వాళ్లంతా ఆ కోతి బాగా తెలివైనదంటూ కితాబిస్తున్నారు.

ఇంకా చదవండి ...
మకర సంక్రాంతి పండగ రోజున అక్కడ ఓ విచిత్రం జరిగింది. వింతగా అనిపించి ఆ దృశ్యాలను వీడియో తీసి సోషల్ మీడియా(Social media)లో పోస్ట్ చేయడంతో ఇప్పుడు వైరల్‌గా మారింది. సంక్రాంతి పండుగ రోజున గాలిపటాలు ఎగరేస్తారు. చాలా చోట్ల పిల్లలు ఎగురవేస్తారు. కొన్ని చోట్ల పెద్దలు, వృద్దులు కూడా పతంగులు ఎగురవేస్తూ సంతోషపడారు. కానీ ఉత్తరప్రదేశ్‌(Uttar Pradesh)లో మాత్రం మకర సంక్రాంతి (Makar sankranti)రోజున ఓ కోతి దర్జాగా డాబాపైకి ఎక్కి పతంగు(Kites)లను ఎగురవేసింది. ఇది నమ్మదగిన విషయం కాదు. కానీ ఆ వీడియో చూస్తే ఎవరైనా నమ్మాల్సిందే. అందుకే ఆ కోతి గాలిపటాలు ఎగురవేస్తున్న వీడియో సోషల్‌ మీడియాలో(Social media)తెగ చక్కర్లు కొడుతోంది(Viral video). ఉత్తరప్రదేశ్‌ లఖీంపూర్‌ ఖేరీ (Lakhimpur kheri)ప్రాంతానికి సమీపంలోని సదర్ కొత్వాలి (Sadar kotwali)ప్రాంతంలో ఈవిచిత్రం అందరి కంట పడింది. గాలిపటం గాల్లో పైకి ఎగరినంత సేపు దారాన్ని పట్టుకొని బంగ్లాపైన కూర్చున్న కోతి ఎప్పుడైతే కిందకు పడుతుందో ఎంతో శ్రద్దగా దారాన్ని నిదానంగా చుడుతూ గాలిపటం కిందపడకుండా దగ్గరకు తీసుకుంది. మళ్లీ అలాగే గాలిపటాన్ని గాల్లోకి ఎగరవేసి దారాన్ని వదులుతూ తెగ ఎంజాయ్ చేసింది. కోతి ఏంటి గాలిపటం ఎగురవేయడం ఏమిటని స్థానికులు ఆశ్చర్యపోయారు. చుట్టు పక్కల గాలి పటాలు ఎగురువేస్తున్న వాళ్లంతా ఆ వింతను చూస్తుండిపోయారు. ఇంకొదరైతే కోతి వీడియోని తమ సెల్‌ఫోన్ల(Cell phone)లో రికార్డ్‌ చేసుకున్నారు.

ఆ కోతి అంత పని చేసిందా..
ఆ చుట్టు పక్కల ఇంకొన్ని గాలిపటాలు కూడా గాల్లో ఎగరడం చూస్తున్న కోతి వాటితో పోటీగా తన గాలి పటాన్ని పైకి పంపాలని తెగ ప్రయత్నం చేసింది. అయితే దాన్ని బలం సరిపోలేదేమో..గాలిపటం పదే పదే కిందకు రావడంతో తన ముచ్చట తీర్చుకొని మెల్లిగా అక్కడి నుంచి జారుకుంది. సదర్ కోత్వాల్‌లో జరిగిన ఈ వింత ..ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమా అంటూ అందరి సెల్‌ఫోన్‌లో కనిపిస్తోంది.

వైరల్ అవుతున్న మంకీ వీడియో..
మనిషి కోతి నుంచి ఆవిర్భవించాడని చెప్పడానికి చారిత్రక ఆదారాలు ఎలా ఉన్నాయో ..కోతి కూడా మనుషుల్లాగానే  పతంగులు ఎగరవేసిందనడానికి వీడియోలు సాక్ష్యంగా ఉన్నాయి. ఎవరూ నమ్మకపోయినా ఇది వాస్తవంగా జరిగిన ఘటన. అందుకే కోతి చేసిన వెరైటీ స్టంట్‌ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ తిరుగుతోంది. అందర్ని  ఆశ్చర్యపరుస్తోంది. మరికొందరైతే లోకంలో ఎన్నో వింతలు, విచిత్రాలు జరుగుతున్నాయి. ఇది కూడా అలాంటిదేలే అంటున్నారు.
Published by:Siva Nanduri
First published:

Tags: Monkeys, Uttar pradesh, Viral Video

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు