Raccoon Attack Video : మన దేశంలో ఊర కుక్కలు, ఊర పిల్లులు కామన్ కదా. అదే విధంగా అమెరికాలో రకూన్ (Raccoon) అనే జంతువులు కామన్. పిల్లి కంటే పెద్దగా, కుక్క కంటే చిన్నగా ఉండే ఈ జంతువులు దాదాపు 9 కేజీల బరువు పెరుగుతాయి. సాధారణంగా ఇవి మనుషుల జోలికి రావు. ఒక్కోసారి మాత్రం దాడి చేస్తాయి. అందువల్ల వాటిని వన్యప్రాణులుగానే భావిస్తున్నారు. తాజాగా అమెరికాలోని కనెక్టికట్‌లో జరిగిన ఘటన వైరల్ అయ్యింది.
ఉదయాన్నే ఓ బాలిక స్కూల్‌కి వెళ్లబోతూ ఇంటి డోర్ తియ్యగానే.. పక్కనుంచి వచ్చిన రకూన్ ఆ పాప కాలు పట్టుకొని కొరికేస్తూ ఉంటే.. ఆ బాలిక ఏడుస్తూ కేకలు పెట్టింది. ఆ అరుపులతో అలర్టైన తల్లి గబగబా వచ్చి.. ప్రాణాలకు తెగించి.. రకూన్ని పట్టుకొని.. పాపను విడిపించింది. ఓవైపు రకూన్ తనను కరుస్తున్నా ఆ తల్లి ధైర్యంగా పోరాడుతూ.. పాప ఇంట్లోకి వెళ్లేవరకూ అలాగే ఉంది.
Viral News : టీస్టాల్లో క్రిప్టోకరెన్సీ చెల్లింపులు.. ఆ కుర్రాడి స్టోరీ వైరల్
చిన్నారి వెళ్లిపోగానే.. ఇంట్లోవాళ్లెవరూ బయటకు రావొద్దని చెబుతూ.. డోర్ వేసేసింది. ఆ తర్వాత రకూన్ని పట్టుకొని.. గాల్లోకి విసిరేసింది. తర్వాత తను కూడా ఇంట్లోకి వెళ్లిపోయింది. ఈ వీడియోని ట్విట్టర్‌లోని @FightClubVideos అకౌంట్లో డిసెంబర్ 4న పోస్ట్ చెయ్యగా.. ఇప్పటివరకూ 26 లక్షల మందికి పైగా చూశారు. 48వేల మందికి పైగా లైక్ చేశారు.
ఆ వీడియోని ఇక్కడ చూడండి (viral video)
Mom protects daughter from raccoon ???? pic.twitter.com/nrstilnFxU
— Fight Club (@FightClubVideos) December 3, 2022
దీనిపై నెటిజన్లు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. "ఈ రకూన్లకు కంట్రోల్ ఉండదు" అని ఓ యూజర్ స్పందించగా.. "రకూన్‌ను ఆమె ఎదిరించిన విధానం బాగుంది" అని మరో యూజర్ కామెంట్ ఇచ్చారు. "రకూన్ నాపై కూడా దాడి చెయ్యాలని చూసింది" అని మరో యూజర్ కామెంట్ రాశారు.
"నేను రకూన్లను చూసి భయపడేది ఇందుకే" అని మరో యువతి కామెంట్ ఇచ్చారు. "ఇది చాలా ఫన్నీగా ఉంది" అని మరో యూజర్ కామెంట్ రాశారు. ఇలా చాలా మంది ఈ వీడియోపై స్పందిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Trending video, Viral, VIRAL NEWS, Viral Video