Viral Video: నిద్రపోతున్న కుక్క చెవిలో గుసగుస... ఆ శునకం రియాక్షన్‌ చూస్తే వావ్‌ అంటారు..

Photo Credit : Instagram

Viral Video: మనుషుల మాటల్ని కుక్కలు కొంతమేర అర్థం చేసుకుంటాయని మనకు తెలుసు. అయితే కొందరు శునకాలకు గట్టిగా అరచి చెబుతుంటారు. కానీ అలా అరచి చెప్పక్కర్లేదట. మనం ముందు చెప్పుకున్నట్లు ఎంత నెమ్మదిగా చెప్పినా వాటికి వినిపిస్తుంది.

  • Share this:
ఈ విషయం మీకు తెలుసా? భూకంపం వచ్చేటప్పుడు ముందుగా తెలిసేది శునకాలకే అంటారు. అంటే వాటికేవో అతీంద్రియ శక్తులు ఉన్నాయనుకోవద్దు. మనిషి చెవుల కంటే శునకం చెవులు లక్ష రెట్లు ఎక్కువ ప్రభావవంతంగా పని చేయడమే ఇందుకు కారణం. వాటి చెవులు అంత షార్ప్‌ అన్నమాట. భూమిలో ప్రకంపనలను అవి ముందుగా పసిగడతాయి. అలాంటి కుక్క చెవిలో చిన్నగా గుసగుసలాడితే, అదెలా రియాక్ట్‌ అవుతుంది? చదువుతుంటే ఏదో ఫన్నీగా అనిపిస్తోంది కదా. ఆ శునకం రియాక్షన్‌ చూస్తే ఇంకా ఫన్నీగా ఉంటుంది మరి.మనుషుల మాటల్ని కుక్కలు కొంతమేర అర్థం చేసుకుంటాయని మనకు తెలుసు. అయితే కొందరు శునకాలకు గట్టిగా అరచి చెబుతుంటారు. కానీ అలా అరచి చెప్పక్కర్లేదట. మనం ముందు చెప్పుకున్నట్లు ఎంత నెమ్మదిగా చెప్పినా వాటికి వినిపిస్తుంది. ఇదంతా ఇప్పుడెందుకు చెబుతున్నాం అంటే... ఓ వ్యక్తి తన పెంపుడు కుక్క చెవిలో ఏదో గుసగుసలాడటం, దానికి ఆ శునకం రియాక్ట్‌ అవ్వడం ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో వ్యక్తి కుక్కకు ఇష్టమైన పదం ‘వాకీస్‌’ను చెవిలో చెప్పాడట. దానికి ఆ శునకం రియాక్షన్‌ చూస్తే ఎవరైనా వావ్‌ అని అంటారు.

వీడియోను పరిశీలిస్తే... అందులో కుక్క, తన యజమాని చెయ్యి మీద ఎంచక్కా నిద్రపోతోంది. ఆ సమయంలో దాని చెవిలో అతడు ఏదో చెప్పాడు. శునకం రియాక్షన్‌కు తగ్గట్టుగా వీడియోకు మ్యూజిక్‌ యాడ్‌ చేసి ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌లో అప్‌లోడ్‌ చేశారు. అయితే తొలుత ఈ వీడియోను టిక్‌టాక్‌లో అప్‌లోడ్‌ చేసినట్లు అర్థమవుతోంది. అక్కడ బాగా పాపులర్‌ అయ్యాకే ఇన్‌స్టాగ్రామ్‌లోకి తెచ్చారు. వాకీస్‌ అని గుసగుసలాడుతూ చెప్పేది మనకు వినిపించదు. కేవలం అక్కడ అక్షరాల రూపంలో రాయడమే కనిపిస్తుంది. ఇదంతా పక్కనపెడితే ఆ శునకం రియాక్షన్‌ అయితే సూపర్‌ ఉంటుంది. అయితే ‘వాకీస్‌’ అంటే ఏంటి? ఆ పదం వినగానే శునకం ఎందుకు అలా రియాక్ట్‌ అయ్యింది అనేది తెలియడం లేదు. ఇవన్నీ పక్కనపెట్టేసి శునకం ఎక్స్‌ప్రెషన్‌ మాత్రం నెటిజన్లను ఆకట్టుకుంటోంది.



నో మ్యాడ్‌ బారబర్‌ అనే ఓ ఇన్‌స్టాగ్రామ్‌ వీడియో క్రియేటర్‌ ఈ వీడియోను షేర్ చేశారు. అతడి ఇన్‌స్టాగ్రామ్‌ పేజీలో ఇలాంటి ఆసక్తికరమైన ఫొటోలు ఉన్నాయి. ప్రపంచంలోని వివిధ వైవిధ్యమైన ప్రదేశాల్లో బార్బర్స్‌ ఫొటోలు అందులో కనిపిస్తున్నాయి. కావాలంటే https://www.instagram.com/nomadbarber/ హ్యాండిల్‌లోకి వెళ్లి ఆ ఫొటోలు కూడా వీక్షించొచ్చు.
Published by:Sridhar Reddy
First published: