హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Fact Check: విమానం రెక్కలపై పడుకొని దేశాన్ని వీడిన అఫ్గాన్‌ వాసి.. ఆ వీడియో గురించి ఫైనల్‌గా తేలిందేంటంటే..

Fact Check: విమానం రెక్కలపై పడుకొని దేశాన్ని వీడిన అఫ్గాన్‌ వాసి.. ఆ వీడియో గురించి ఫైనల్‌గా తేలిందేంటంటే..

వీడియోలోని ఓ దృశ్యం

వీడియోలోని ఓ దృశ్యం

అఫ్గానిస్థాన్‌ను ఆధీనంలోకి తీసుకున్న తరువాత.. తాలిబన్లకు భయపడి దేశం విడిచి పారిపోవడానికి అఫ్గాన్‌ వాసులు చేసిన ప్రయత్నాలు చూసి ఎంతోమంది కంటతడి పెట్టుకున్నారు. కాబూల్ ఎయిర్‌పోర్ట్‌లో జరిగిన హృదయ విదారకమైన ఘటనలు, అక్కడి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఇంకా చదవండి ...

అఫ్గానిస్థాన్‌ను ఆధీనంలోకి తీసుకున్న తరువాత.. తాలిబన్లకు భయపడి దేశం విడిచి పారిపోవడానికి అఫ్గాన్‌ వాసులు చేసిన ప్రయత్నాలు చూసి ఎంతోమంది కంటతడి పెట్టుకున్నారు. కాబూల్ ఎయిర్‌పోర్ట్‌లో జరిగిన హృదయ విదారకమైన ఘటనలు, అక్కడి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కాబూల్‌లోని హమీద్ కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో వేలాది మంది ప్రజలు విమానాలు ఎక్కడానికి ప్రయత్నించారు. విమానం టైర్ల వద్ద కూర్చొని భయంకరంగా ప్రయాణించడానికి ప్రయత్నించిన ఇద్దరు వ్యక్తులు గాల్లోనే కిందపడి చనిపోయారు. ఈ క్రమంలో ఒక వ్యక్తి విమానం ఇంజిన్‌పై కూర్చొని గాల్లో ప్రయాణిస్తున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది.

విమానం టర్బైన్ ఇంజిన్‌పై ఒక వ్యక్తి ప్రమాదకరంగా పడుకొని ప్రయాణిస్తున్నట్లు కనిపించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అతడు కూడా తాలిబన్లకు భయపడి దేశం వీడిన అఫ్గాన్‌ పౌరుడు అని వార్తలు వచ్చాయి. గులిస్తాన్ న్యూస్ ఛానల్ పేరుతో ఉన్న ఫేస్‌బుక్ పేజీ ఈ వీడియోను షేర్ చేసింది. తాలిబన్లకు భయపడుతున్న అఫ్గాన్‌ పౌరులు, ప్రమాదకరంగా విమానం రెక్కలపై కూర్చొని ప్రయాణిస్తున్నారనే క్యాప్షన్‌తో దీన్ని షేర్ చేశారు. ఆ తరువాత చాలామంది ట్విట్టర్ యూజర్లు కూడా ఈ వీడియోను షేర్ చేస్తూ, అఫ్గాన్‌ పౌరులపై సానుభూతి వ్యక్తం చేశారు. అయితే ఈ వీడియో నకిలీదని తేలింది.

లాజికల్ ఇండియన్ డిజిటల్ మీడియా సంస్థ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి, ఇది అఫ్గాన్‌ పౌరులకు సంబంధించిన వీడియో కాదని తేల్చింది. టర్బైన్ ఇంజిన్‌పై వ్యక్తి కూర్చొని ప్రయాణిస్తున్నట్లుగా కనిపిస్తున్న ఇదే వీడియో Pinterestలో ఉన్నట్లు ఆ సంస్థ వెల్లడించింది. ఈ వీడియోపై ఉన్న వాటర్‌మార్క్ ద్వారా గూగుల్‌లో సెర్చ్ చేసినప్పుడు అసలు విషయం బయటపడింది.


ఈ వీడియోను 2020 డిసెంబర్ 17న ‘క్వాన్ హోవా’ అనే యూట్యూబ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేశారు. ఒక వ్యక్తి ఎగిరే విమానం టర్బైన్ ఇంజిన్‌పై కూర్చున్నట్లు, వంట చేస్తున్నట్లు, వింత పనులు చేస్తున్నట్లు యూట్యూబ్‌ వీడియోలో కనిపిస్తోంది. దీంతో ఇది ఫోటోషాప్ చేసిన వీడియో అని వీక్షకులకు తెలిసింది.

వియత్నాంకు చెందిన వ్యక్తులు ఈ వీడియోను రూపొందించినట్లు తెలుస్తోంది. ఫోటోషాప్ చేసిన వ్లాగ్ వీడియోలను తాము షేర్ చేస్తున్నట్లు ఈ ఛానెల్‌ డిస్క్రిప్షన్‌లో పేర్కొన్నారు. దీంతో ఎగురుతున్న విమానం టర్బైన్ ఇంజిన్‌పై ప్రయాణిస్తున్న వ్యక్తి అఫ్గాన్ పౌరుడు కాదని, అఫ్గానిస్థాన్‌లో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులకు, ఈ వీడియోకు సంబంధం లేదని మీడియా వర్గాలు నిర్ధారించాయి.

First published:

Tags: Afghanistan, Flight, Taliban, Trending, Viral Video

ఉత్తమ కథలు