హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

అతనికి పాములంటే భయం లేదు..నూడుల్స్‌లా ఫీలవుతున్నాడు

అతనికి పాములంటే భయం లేదు..నూడుల్స్‌లా ఫీలవుతున్నాడు

OMG: అతను పాములు పట్టేవాడో కాదో తెలియదు కాని ఒకేసారి 300 పాముల్నిగోనె సంచిలో మోసుకొచ్చి అడవిలో వదిలేశాడు. అన్ని పాముల్ని మోసుకొని తీసుకొచ్చిన అతని ధైర్యాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. పాముల్ని వ్యక్తి అడవిలో వదిలిపెడుతున్న వీడియో వైరల్ అవుతోంది.

ఇంకా చదవండి ...

పాము షడన్‌గా కనిపిస్తే ఎంతటి వాళ్లైనా భయంతో హడలిపోతారు. అదే పదుల సంఖ్యలో కాదు కాదు వందల సంఖ్యలో పాములు ఉంటే పరిస్థితి ఏంటి. వామ్మో అని ఆశ్చర్యపోకండి ఓ వ్యక్తి ఒకటి రెండు కాదు మూడు వందల పాముల(300 Snakes)ను ఓ గోనె సంచిలో తెచ్చి దర్జాగా అడవి(Forest)లో వదిలిపెట్టాడు. ఈ పాముల సంచి(Bag)ని ఓ వాహనంలోనో లేక ఫారెస్ట్‌ సిబ్బంది సహకారంతోనే తీసుకొని రాలేదు. తానే పెద్ద సంచిలో 300పాముల్ని పట్టుకొని వాటికి మోసుకుంటూ అడవికి తెచ్చాడు. పాములకు ఎలాంటి హాని జరగకుండా ఉండేలా అడవికి తెచ్చి పాములు ఉన్న సంచిని తాడు విప్పి కిందపు వదిలేశాడు. మూడు వందల పాముల్ని సంచిలో మోసుకొచ్చిన వ్యక్తి వీడియో ఇప్పుడు సోషల్ మీడియా(Social media)లో తెగ వైరల్ అవుతోంది. అయితే ఇది ఏ రాష్ట్రంలో జరిగిందో..అతని పేరేంటో పూర్తిగా వివరాలు తెలియరాలేకపోయినప్పటికి ..అతను చూపించిన ధైర్యాన్ని మాత్రం ప్రతి ఒక్కరూ మెచ్చుకుంటున్నారు. తెచ్చిన పాముల సంచిలోని అన్నింటిని కిందకు వదిలేసి ఆ పాముల కుప్పలో చేతులు పెట్టి వాటిని విడి విడిగా అడవిలోకి వెళ్లేలా చెల్లాచెదురు చేశాడు. చూడటానికే ఒళ్లు గగుర్పొడిచే విధంగా ఉన్న ఈ వీడియో అందర్ని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

పాములంటే భయం లేదట..

గోనె సంచిలో తెచ్చిన పాముల్లో ఒక్కొక్కటి ఐదు అడుగుల నుంచి మూడు అడుగుల పొడవు ఉన్నాయి. సంచిలోంచి పాముల్ని వదిలే క్రమంలో కొన్ని పాములు తెచ్చిన వ్యక్తి కాళ్లకు, చేతులకు చుట్టుకోవడంతో వాటిని నిదానంగా విదిలించుకొని అడవిలోకి వెళ్లేలా దగ్గరుండి వాటిని సాగనంపాడు ఓ స్నేక్‌మెన్. అతనికి ఇన్ని వందల పాములు ఎక్కడి నుంచి వచ్చాయనే ప్రశ్న వేస్తున్నారు నెటిజన్లు. ఎక్కడైనా పాము పుట్టను కొల్లగొట్టాడా లేక పాములుండే జూ లోంచి రహస్యంగా తెచ్చాడా అంటూ కామెంట్స్‌ చేసుకుంటున్నారు.

View this post on Instagram

A post shared by Meme wala (@memewalanews)300పాముల్ని ఒంటి చేత్తో..

విషం చిమ్మే వందలాది పాములను మహాశివుడిలా భుజంపై పెట్టుకొని ఓ సంచిలో తెచ్చిన అతని ధైర్యాన్ని మాత్రం తెగ మెచ్చుకుంటున్నారు నెటిజన్లు. పాములు తెచ్చిన వ్యక్తి ఎందుకు ఈవిధంగా చేశాడనే విషయం మాత్రం ఇంత వరకూ బయటకు రాలేదు. పాముల్ని కొట్టి చంపడం కంటే ..ఈవిధంగా పట్టుకొని అడవుల్లో వదిలేస్తేనే మంచిదంటున్నారు యానిమల్ లవర్స్.

First published:

Tags: Instagram, Snakes, Viral Video

ఉత్తమ కథలు